top of page
Search

పేరంటం

  • murthydeviv
  • 4 minutes ago
  • 2 min read

శ్రావణ మాసం అనగానే పేరెంటాలు గుర్తు వస్తాయి కదా. ఇప్పుడు కూడా శ్రావణ శుక్రవారం మంగళవారం పేరెంటాలు కమ్యూనిటీ ల్లో చాలా బాగా జరుగుతున్నాయి. ఆమ్మ వార్ల ను కూడా ఎంతో అందముగా చుట్టూ రంగు బల్బ్ లు అవీ పెట్టీ గ్రాండ్ గా చీరెలు కట్టి బాగా చేస్తున్నారు. ఆ ఫోటో లు అన్నీ ఫేస్ బుక్ లో చూస్తూ వుంటాను..


ఇప్పుడు వాట్సాప్ లో నే పెళ్లి పిలుపులు , వెడ్డింగ్ కార్డ్స్ పెట్టీ లొకేషన్ పెడితే పని అయిపోతుంది.

కొంచెం ముఖ్యలు అనుకున్న వాళ్లకి ఫోన్ చేసి తప్ప కుండా రావాలి అని చెప్తారు.


ఈ నగరాల్లో ఈ ట్రాఫిక్ లో ఆది ఒకందుకు మంచిదే అనుకుంటాను.


మా చిన్నప్పుడు అయితే శ్రావణ మంగళవారం , శుక్రవారం పేరంటం అయితే ఇంటింటికి వెళ్ళి పిలిచే వాళ్లము.

మా వైపు దసరా కి బొమ్మలు కొలువు ఉండదు, సంక్రాంతి కే మూడు రోజులు పేరంటం .


కానీ ప్రతి పండగకి మా ఆమ్మ గారు పసుపు కుంకుమ పొట్లాలు కట్టి పండు, తాంబూలం చుట్టూ వున్న ఇళ్ళల్లో

ఇచ్చి రమ్మనే వారు

ఉదయాన్నే తలాంటి పోసుకుని కొత్త బట్టలుతో జడ గంటలు తో జడలు తల లో పూలతో రెడీ అయ్యి

ఇచ్చి రావాలి. ఏ కాలం లో వచ్చే పూలు ఆ కాలం లో పెట్టుకోవాలి.


నాకు అయితే ఆ చేమంతి పూలు పెట్టుకో వాలంటే తగని చికాకు గా ఉండేది .

ఇప్పుడు ఏ పండుగ అయినా ఆ రోజులు గుర్తు వస్తూ వుంటాయి . అంత పెద్ద ఇళ్ళు కూడా శుక్రవారం, కడిగించే వారు ..


ఇక పండుగ లు అయితే ముందు రోజే కడిగించి బియ్యపిండి లో ఏమీ కలిపే వారో నాకు గుర్తు లేదు కానీ ఆ తెల్లటి పిండిలో సన్నటి గుడ్డ తో ఇంటినిండా ముగ్గులు , అవీ అరిన దాకా మనము జాగ్రత్తగా చూసుకుంటూ తొక్క కుండా నడవాలి..


కా ని అసలు పండుగ రోజూ మధ్యాహ్నం కి ఇంటి నిండా చేమంతి రేకులు తో , తడి కాళ్ల తో తొక్కితే , ఆ తెల్లటి పిండి

అచ్చులు తో పిండివంటలు ఘుమ ఘుమలతో , సాంబ్రాణి సువాసన ల తో ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేసేది.


ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఆ సందడి గుర్తు వస్తుంది. ఇప్పుడు పిల్లలు రోజూ షాంపూ లే ఇంక పండగ స్పెషల్ ఏముంది.


పని అమ్మాయి కలర్ చాక్ పీస్ తో నాలుగు ముగ్గులు పెడితే ఘనం . కానీ ఇప్పుడు నార్త్ ఇండియన్ అలవాటు

రంగులు తో పూల తో వాకిలి ముందు అలంకరణ చేస్తుంన్నారు.


కృష్ణ అష్టమికి , కార్తీకమాసం ద్వాదశి నాడు కూడా పేరంటం వున్నా అంత లార్జ్ స్కేల్ లో ఉండదు.


ఆ రోజుల్లో పేరంటం ఆంటే అరటిపండు , తాంబూలం సెనగలు ఇచ్చే వారు . కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టీ

ఇచ్చే వారు హ్యాండ్ కర్చీఫ్ ల్లో సెనగలు తాంబూలం మూట కట్టుకుని , వీలు అయితే అరటి పండు తింట మో , పిల్లలు ఉంటే వాళ్లకి ఇవ్వటం.


ఇప్పటి లాగా పసుపు కుంకుమ ప్యాకెట్ లు లేవు . మర్నాడు ఆ సెనగలు తాలింపు వేస్తే మధ్య లో ఏ క్రెన్, కానీ త్రివేణి కానీ వక్క పలుకులు సువాసన తో తగుల్తు ఉండేవి .


ఈ పేరంటం మధ్యలో పెళ్లి సంబంధం కబుర్లు , కోడళ్ల మీద కబుర్లు, కూతురి అత్తగారి విశేషాలు ఇలా కబుర్లు దొర్లుతూ ఉండేవి.


హారతి పాటలు , పిల్లలు గొడవ లో కలిసి పోతూ ఉండేవి . వాళ్ళ ని ఊరుకో పెట్టటానికి ఇంకో అరటి పండు ఇస్తూ ఉండేవారు..


ఈ రోజుల్లో పెళ్ళికి వెళ్లినా ఇచ్చే అందమైన కవర్ లో బజారు నుంచీ తెచ్చిన పాకెట్స్ లో ఒక చిటికెడు పసుపు, కుంకుమ కూడా ఉండటం లేదు , ఇంక వక్కపొడి పాకెట్ లో అయితే ఏదో చూర్ణం లాంటి పదార్థం వుంటుంది.


ఈ హడావిడి అంతా అయ్యాక పరిచిన చాపలు, జంప కాణాలు దులిపి ఎత్తి పెట్టే వాళ్లము. వెంటనే ఇల్లు చిమ్మకూడదు కదా తీరికగా ఈ ఏ తొమ్మిదికో క్లీన్ చేసేవాళ్ళము.


అదేమిటో ఆ రోజుల్లో ఎంత పెద్ద వాళ్ళు అయినా కింద నే కూర్చునే వారు. యింటికి మాములుగా ఎవరైనా వచ్చినా చాప లు పరిచి కూర్చోమని చెప్పేవాళ్ళము.


అవీ అప్పటి పేరంటం విశేషాలు


శుభరాత్రి





 
 
 

Recent Posts

See All
అమ్మ పాటల పుస్తకం

ఈ శ్రావణ మాసం , దసరాలు పండుగలు రోజుల్లో మా అమ్మ గారి పాటలు అలా మనసులో మెదులుతూ వుంటాయి. మా ఇంట్లో మా పెద్ద అత్తయ్య, మా పెద్దమ్మ గారు చాలా పాటలు రాశారు. మా అత్తయ్య గారు ఎక్కువగా శ

 
 
 
కృష్ణ అష్టమి

ఇప్పుడు ఆంటే టీ వి ల్లో పేస్ బుక్ లో ఈ కృష్ణుడి పండగ గురించి చాలా చెప్తూన్నా రు . కానీ మన చిన్నప్ప్పుడు ఈ పండగ గురించి అంత హంగామా ఉండేది కాదు . అయితే అమ్మా, మా చిన్న బామ్మ గారు

 
 
 
మేజు వాణి

శ్రావణమాసం అంతా చాలా హడావిడి గా గడిచి పోయింది. ఇంట్లో పూజలు కాకుండా పెళ్లిళ్ళు , పుట్టినరోజు, ఉయ్యాల ఫంక్షన్స్ పైగా వర్షాలు అలాగే అన్నింటికీ హాజరు వేయించుకోవాలి కదా అలా చాలా బిజీగా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page