top of page
Search

మేజు వాణి

  • murthydeviv
  • 1 day ago
  • 2 min read

శ్రావణమాసం అంతా చాలా హడావిడి గా గడిచి పోయింది. ఇంట్లో పూజలు కాకుండా పెళ్లిళ్ళు , పుట్టినరోజు, ఉయ్యాల ఫంక్షన్స్ పైగా వర్షాలు అలాగే అన్నింటికీ హాజరు వేయించుకోవాలి కదా అలా చాలా బిజీగా గడిచిపోయింది.


ఇంకా కృష్ణుడి పుట్టినరోజు వుంది కదా, అదీ అయ్యాక పోలాల అమావాస్య రోజు కూడా ఏదో పూజలు వుంటాయి.

అయితే ఆ పూజలు అందరికీ వుండవు.


ప్రతి వాళ్ళు పెద్ద వారు మీరు రాకపోతే ఎలా అని నమస్కారం పెట్టి మరీ పిలుస్తారు. అందుకని మెల్లగా బయలు దేరుట.

అయితే ఇప్పుడు పెళ్లి ఆంటే సంగీత్, హల్ది, పెళ్లికూతురు పెళ్లి ఇన్నీ రకాలు


అన్నింటికి అటెండ్ అవలేము కదా ఒక పెళ్లి సంగీత్ కి మనవరాలు కోరిక మీద బయలు దేరాను. ముందుగా ఎదురుకోలు అయ్యాక మరలా అందరూ తయారు అయ్యారు.

సంగీత్ లో ముందుగా పిల్లలు డాన్సులు తర్వాత పెద్దలు, ఆ తర్వాత పెళ్లి జంట అబ్బో ఎన్ని డాన్స్ లో


సాధారణం గా అన్నీ సంగీత్ ల్లో కొన్ని పాటలు తప్పకుండా వుంటాయి , జబ్ ఉయ్ మెట్ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయినా అందులో పాటలు కి డాన్స్ తప్పదు.

పది గంటలకు ఇంక బయలు దేరుదాం అనుకుంటే అబ్ తో పార్టీ షురూ హువా హై అనే పాట తో హోరేత్తిపోయే

డ్రమ్స్ తో అందరూ డాన్స్ చేసారు అనే కంటే బాగా ఎగిరారు.


ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇంకొక పెళ్లి అమ్మాయి ఆంధ్ర , ఆబ్బాయి అగర్వాల్ , ఈ రోజుల్లో ఇవీ సామాన్యమే కదా

ఇక్కడ సంగీత్ లేదు ఈ జంట హార్వర్డ్ లో ఏం బి ఏ చేసి దుబాయ్ లో ఉద్యోగం లో చేర పోతున్నారు.


వాళ్ళ స్నేహితులు అందరూ వాళ్ళు ఎలా కలుసుకున్నారు ఒకరికి ఒకరికి నచ్చిన అంశం ఏమిటీ అంటూ ఏవో ప్రశ్నలు జవాబులు చెప్పుకుని ఉంగరా లు మార్చుకున్నారు.

మర్నాడు ఆంధ్ర పద్దతిలో తలంబ్రాలు వరకు తర్వాత వాళ్ళ పద్దతిలో సిందూర్ , సాత్ ఫేరి చేసారు .


ఎక్కువగా హంగామా లేకుండా బాగానే వుంది అనుకున్నాను. కానీ నాకు ఇవ్వన్నీ చూస్తూ ఉంటే పూర్వం రోజుల్లో జరిగే పెళ్లిళ్లు గుర్తు వచ్చాయి .


పెళ్ళికి ముందు ఇన్నీ ఎరువు తెచ్చుకున్న ప ద్దతులతో రోజు అంతా గడిపి పెళ్లి అయ్యాక నాగా వల్లీ, స్థాలిపాకం, సదస్యం అనే మన సంప్రదాయం అసలు మర్చిపోయారు .


పెళ్లి అయ్యాక ఏదో చేయాలి కాబట్టి మూడు ఒకేసారి ముగించి అప్పంగింతలు కూడా తూ తూ మంత్రమ్ గా చేసేస్తున్నారు.. ఒక వేళ పురోహితులు కాస్త వివరంగా చేసినా ఆయన్ని కూడా తొందర పెడుతున్నారు.


మా చిన్నప్పుడు ఎప్పుడు పెళ్ళి అయినా మేజు వాణి అని కొత్త దంపతులు ను కూర్చో పెట్టి , ఒక వేడుక

చేసేవారు.


కొత్త దంపతులు చేత దండలు మార్పించి , గంధము, సెంట్ రాయించే వారు. కొంచెం చిన్న పిల్లలు అయితే పూల బంతి తో ఆడించే వారు ..


వచ్చిన వాళ్ళు అందరూ పాటలు పాడే వారు . వియ్యపు రాలిని, అడపడుచులను కూర్చో పెట్టి ఏవో మర్యాద లు చేసి స్వీట్స్ అవీ ఇచ్చే వారు. ఆ వేడుకలు అన్నీ ఎంతో సరదాగా ఒకరి మీద ఒకరు హాస్యపు జల్లులు కురిపిస్తూ

కన్నుల పండుగ గా ఉండేది.

గంధము, సెంట్ పూస్తూ వున్నప్పుడు దండ లు వేసే టప్పుడు పెళ్లి కూతురు లేత చిరునవ్వు తో సిగ్గు పడుతూ ఉంటే ఆ పెళ్లి కొడుకు మనసు నును సిగ్గుల తెర చాటున అనురాగం దాగెనని అన్నట్లు గా చూస్తే

ఆ పెళ్లికూతురు అనురాగం ఆనందం అన్నీ నీ కోసమే అన్నట్లు గా చూపులు తోనే చెపుతూ వున్నట్లు వుంటుంది


మేజు వాణిలు , అప్పటి వియ్యాల వారి మీద పాటలు , ఆ సరదాలు ఇప్పుడు ఎక్కడ

భోజనాలు జరిగే టప్పుడు పాటలు , పెళ్లి దంపతులు కు ఎన్నో సార్లు హరతులు ఇచ్చి పాటలు పాడే వారు.

.మా మేనత్త చెప్పే వారు దిష్టి తగలకుండ అన్నీ సార్లు హారతులు ఇస్తారు.


మన సంప్రదాయం లు పక్కన తోసి ఏవో కొత్త వి పాటిస్తున్నాము . చూద్దాము ఈ మార్పులు ఎన్నాళ్ళో

ఇంకా ప్రతి ఫంక్షన్స్ కి డ్రెస్ కోడ్ వాటి గురించి ఇంకొక సారి చెప్పుకుందాం.


శుభ రాత్రి






A



 
 
 

Recent Posts

See All
ఆంధ్ర వాల్మీకి

రెండు మూడు రోజుల నుంచీ వీర తాడులు మిస్ అవుతున్నాను. అయితే ఈ రోజు మిస్ అయినందుకు చాలా బాధ అనిపించింది. వావిలి కొలను సుబ్బారావు గారిని ఆంద్రా వాల్మీకి అనే వారు. మా చిన్న తనంలో మా చిన్న నాయనమ్

 
 
 
ఛలో ఆంధ్రా

ఈ మధ్య విజయవాడ వెళ్ళాము. ఎన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రా లోకీ వెళ్ళగానే ఏదో సొంత వాళ్ళను చూసిన ఆనందం వస్తుంది. అందులో ఇపుడు కోదాడ దాటగానే చెక్ పోస్ట్ కూడా వస్తుంది ఇంకా ఎక్కువగా ఆహా మన ఆంధ్రా క

 
 
 
పూల బాలలు

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలు ఇమ్మని రెమ్మ రెమ్మకు ఇంత సున్నితంగా ఇంకెవరు రాయగలరు కృష్ణ శాస్త్రి గారు తప్పితే అనుకున్నా. ఒక రెండు రోజులు నుండీ పడిన కొద్దీ పాటి వాన కే పూల చెట్లు కళ కళ లాడు

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page