top of page
Search

కృష్ణ అష్టమి

murthydeviv
6 days ago
3 min read

ఇప్పుడు ఆంటే టీ వి ల్లో పేస్ బుక్ లో ఈ కృష్ణుడి పండగ గురించి చాలా చెప్తూన్నా రు . కానీ మన చిన్నప్ప్పుడు

ఈ పండగ గురించి అంత హంగామా ఉండేది కాదు . అయితే అమ్మా, మా చిన్న బామ్మ గారు ఆ రోజు సాయంత్రం తులసి కోట దగ్గర కృష్ణుడి పూజలు చేసేవారు. మా నాయనమ్మ గారికి కృష్ణుడు అంటే ఎక్కువగా ఇస్టం ఉండేదిట .

అందుకే ఆవిడ రుక్మిణి కృష్ణులు విగ్రహాలు కు కూడా రోజూ పూజలు చేసే వారుట . ఆ రెండు విగ్రహాలు ఇప్పటికీ అన్నయ్య పూజ మందిరం లో పూజలు అందుకుంటూ వున్నాయి.


కృష్ణ అష్టమి నాడు స్పెషల్ గా చెగోడీలు , పూరి అటుకులు పాలు , పండ్లు నైవేద్యం పెట్టే వారు. తులసికోట దగ్గర జరిగే ఆ పూజ ఆంటే మాకు ఎందుకో చాలా ఇష్టం ఉండేది. మా ఇంట్లో ఎవరు రాసారో తెలియదు కానీ మా అమ్మగారు

ఆ రోజూ కృష్ణుడి మీద ఎన్నో పాటలు పాడేవారు ..


మా అమ్మ గారు పెద్దగా ఉపవాసం ఉండేవారు కాదు కానీ , ఒక అరగంట లో రెండు అష్టోత్తరా లు చదివి పూజ

ముగించి పాటలు మాత్రం చాలా సేపు పాడుతూ ఉండేవారు.


కృష్ణా అష్టమి నాడు మన్ను తినకురా తనయా అని మొదలుపెట్టి వున్న పిండివంటలు పేర్లు అన్నీ చెప్పి

ఇవ్వన్నీ నీకోసం చేశాను , ఇవ్వన్నీ తిన కుండా మన్ను ఎందుకు తింటావు అనే పాట మాకు భలే ఇష్టం ఉండేది.

అలా కృష్ణుడు మీద ఎన్నో పాటలు పాడుతూ ఉండేవారు ..


ఇంక ఆవిడ పాటల పుస్తకం అయితే కొంచెం పాత పడ గానే ఇంకొక పుస్తకం లో రాసుకునే వారు . ఆవిడ కొంచెం పెద్ద వారు అయ్యాక నాతో కొత్త పుస్తకం లో రాయించు కునేవారు .

అలా కృష్ణుడి మీద ఎన్నో రకాలుగా పాటలు వున్నాయి.


పసిపిల్లలు కు నీళ్లు పోస్తూ, జోలగా కూడా ఆ పాటలు పాడుతూ ఉండేవారు. అలా కృష్ణ అష్టమి ఆంటే ఆరోజులన్ని గుర్తు వస్తాయి. ఇప్పటికీ మా పిల్లలు ఈ పండగ నాడు మా అమ్మ గార్ని ఆ పాటలు తలుచుకుని వాళ్లకు వచ్చినట్లు

పాడుకుంటారు.

నాన్నగారు కూడా ఏ పండుగ వచ్చినా పూజ అవగానే హారతి ఇస్తున్నప్పుడు మేము వెళ్ళి అమ్మ తో కలిసి పాడాలి అని చెప్పేవారు.

నాన్నగారు ఒకసారి కృష్ణా అష్టమికి బొంబాయి వెళ్లారు. అక్కడ చూసిన ఉట్ల పండగ గురించి ఎంతో వర్ణించి చెప్పారు.


ఇంక మా అత్తగారు అయితే కృష్ణా అష్టమికి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రక రకాలుగా పిండివంటలు చేసేవారు.

కలశం పెట్టి , దోగాడే కృష్ణుడు విగ్రహం పెట్టి పూజ చేసే వారు.

ఆ రాత్రికి మా మామగారు తప్పకుండా పోతన గారి భాగవతం లో కృష్ణా జననం చదివేవారు.


మా తాత గారు అరవై ఏళ్ల వయసు లో హిందీ నేర్చుకుని గీతా ప్రెస్ వాళ్ళ కళ్యాణ్ అనే మాస పత్రిక తెప్పించుకుని చదివే వారు.

ఆ పుస్తకం లో ఫోటోలు చాలా అందంగా జీవ కళ తో ఉండేవి. మంచి పెయింటింగ్స్ బొమ్మలు కలెక్ట్ చేయటం నాకు హాబీ గా ఉండేది. అందులో దేవకీ వాసుదేవులకు దర్శనం ఇచ్చిన విష్ణుమూర్తి , శేషుడు గొడుగుగా గోకులముకి బుట్ట లో వెళుతున్న పసిపాప గా కృష్ణుడు రెండూ ఫోటోలు కలిపి ఫ్రేమ్ కట్టించి మా ఆత్త గారికి పూజ కి ఇచ్చాను.


ఆవిడ ఆ ఫోటో చూసి చాలా సంతోషించారు. ఆవిడ చేసిన అంత ఘనంగా కాక పోయినా నా ఓపిక కొద్దీ కృష్ణుడు పూజ చేస్తాను.

మా ఇంటి పక్కన కొన్నాళ్ళు కన్నడ వాళ్ళు వుండే వారు . వాళ్ళు అయితే వాకిలి దగ్గర నుండీ కృష్ణుడి పాదాలు వేసి తొమ్మిది రకాల పిండివంటలు తో పూజ పేరంటం చేసేవారు.

మా మనవడు మనవరాళ్లకి కృష్ణుడి లాగా అలంకరణ చేసి , వాళ్ళ కాళ్ల తో పాదాలు వేయించి చాలా హంగామా గా పేరెంటాలు చేసాము.

ఇప్పడు అన్నీ తల్చుకుంటూ మెల్లగా పూజ ముగించటం , పిండివంటలు ఏదో ఓపిక వున్న వరకు..


అమ్మవారి భక్తులకు కూడా ఈ అష్టమి ముఖ్య మై నదే ఆవిడ కూడా ఆ రోజే వాసుదేవ భ గిని కదా

అసలు బహుళ అష్టమి ఆంటే నే దేవీ పూజలు కి జపాలకు , చాలా ముఖ్యమైన రోజు..


ఈ రోజు ఇంకా ఎక్కువగా చేస్తారు.. ఈ రోజు రాత్రిని మోహ రాత్రి అంటారుట .

దుర్గా అష్టమి కాళ రాత్రి, నరక చతుర్దశి ని మహా రాత్రి అంటారుట .

అలా కృష్ణా అష్టమి అనగానే ఇలా అన్నీ జ్ఞాప కా లు తోరణాలు లాగా మన సులో ఊగుతూ వున్నాయి


కృష్ణ హరే బాల కృష్ణా హరే విష్ణు స్వరూపా, సృష్టి రూపా దుష్ఠ కంస హారా నిన్ రమ్మంటిరా


సుందర పాదా ర విందములకు పసిడి గజ్జెల ఆందెల కట్టేదేరా , పొందుగ బ్రహ్మాండ భువనము నిండగా బొజ్జ నిండా

పాలు పోసేదరా


ముంగురులు దువ్వి ముత్యాలు తులసి మాలలు నీ మెడ లో వేసేదరా పొంగుచు వచ్చి బంగారు తొట్టిలో పరమాత్మ నిను లాలీ ఊ చే దారా


ఇలాంటి పాటలు పాడుతూ వాళ్ళు పిల్లలు ని పెంచే వారు. అందుకే మనకు ఈ మాత్రం భక్తి వచ్చింది అనుకుంటా.

ఎంత మంచి పాట లో ఎవరు రాసారో


అవీ కృష్ణుడి పుట్టినరోజు విశేషాలు

శుభరాత్రి
















 
 
 

Recent Posts

See All
పేరంటం

శ్రావణ మాసం అనగానే పేరెంటాలు గుర్తు వస్తాయి కదా. ఇప్పుడు కూడా శ్రావణ శుక్రవారం మంగళవారం పేరెంటాలు కమ్యూనిటీ ల్లో చాలా బాగా జరుగుతున్నాయి. ఆమ్మ వార్ల ను కూడా ఎంతో అందముగా చుట్టూ రంగు బల్

 
 
 
అమ్మ పాటల పుస్తకం

ఈ శ్రావణ మాసం , దసరాలు పండుగలు రోజుల్లో మా అమ్మ గారి పాటలు అలా మనసులో మెదులుతూ వుంటాయి. మా ఇంట్లో మా పెద్ద అత్తయ్య, మా పెద్దమ్మ గారు చాలా పాటలు రాశారు. మా అత్తయ్య గారు ఎక్కువగా శ

 
 
 
మేజు వాణి

శ్రావణమాసం అంతా చాలా హడావిడి గా గడిచి పోయింది. ఇంట్లో పూజలు కాకుండా పెళ్లిళ్ళు , పుట్టినరోజు, ఉయ్యాల ఫంక్షన్స్ పైగా వర్షాలు అలాగే అన్నింటికీ హాజరు వేయించుకోవాలి కదా అలా చాలా బిజీగా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page