అమ్మ పాటల పుస్తకం
ఈ శ్రావణ మాసం , దసరాలు పండుగలు రోజుల్లో మా అమ్మ గారి పాటలు అలా మనసులో మెదులుతూ వుంటాయి.
మా ఇంట్లో మా పెద్ద అత్తయ్య, మా పెద్దమ్మ గారు చాలా పాటలు రాశారు. మా అత్తయ్య గారు ఎక్కువగా శంకరుడు మీద పాటలు రాస్తే , మా పెద్దమ్మ గారు అమ్మవారి మీద చాలా చక్కటి పాటలు రాశారు.
మా ఊరిలో వున్న శివాలయం లో వున్న ఆమ్మ వారి మీద క్షిర పురి విజయా అనే మకుటం తో మా పెద్దమ్మ రాశారు .
మా అత్తయ్య అయితే ఏ పాట అయినా పూర్ణేశ్వరి ని బ్రోవగా రావా అనే మకుటం తో రాశారు .
మా పెద్దమ్మ గారు కొంచెం సంస్కృతం చదివారేమో అనుకుంటాను. గొప్ప అర్థం వచ్చే పదాలతో రాశారు .
ఇప్పుడు కూడా ఎక్కడ పాడినా వెంటనే అందరూ ఎవరు రాశారు అని అడిగి రాయించుకుంటారు.
మా అత్తయ్య పాటలు భక్తితో శివుడిని ప్రార్థిస్తూ అర్తి తో రాసినట్లే అనిపిస్తుంది. ఆరోజుల్లో వాళ్ళు ఎక్కువ గా చదువుకోలేదు , అయినా అంత భక్తి తో అంత చక్కటి పాటలు ఎలా రాసారో అనుకుంటాను.
చిన్నప్పుడు మా అమ్మగారు పాటలు నేర్చుకోమంటే ఏదో సాకు చెప్పి తప్పించుకునే దాన్ని
.
మా పెద్ద నాన్న గారి అమ్మాయి తో సంగీతం నేర్చుకోమని కూర్చో పెడితే ఆ సంగీతం అంతగా వంట పట్ట లేదు.
ఇక పండగలు అప్పుడు నాన్నగారి పూజలు కి హారతి కి వచ్చి అమ్మ తో పాటు పాడిన పాటలు ఆలా గుర్తు ఉండిపోయాయి.
.ఇంత కి ఆమ్మ పాటల పుస్తకం ఎప్పుడూ నిత్య నూతనం గా ఉండేది . ఎవరైనా పేరంటం లో కొత్త పాట పాడితే
పుస్తకం లో రాయించుకునేది. పసి పిల్లలు కి నీళ్లు పోస్తూ, పాటలే , సరే ఇంక నిద్ర ని ఉయ్యాల ఊపటానికి పాటలే పాటలు.
తన పూజ కన్నా పాటలు ఎక్కువగా ఉండేవి.
మా అత్తయ్య కూడా ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికీ ఆమె పూజ అయిపోయేది. ఎన్నో రకాల పిండివంటలు చేసేది . ఎప్పుడూ బంధువులతో తీరిక లేకుండా వుండే వాళ్ళు పాటలు ఎప్పుడు రాసేవారో, మాకు ఎలా నేర్పే వారో
అని అనుకుంటాను.
మా ఆమ్మ అయితే పుస్తకం కొంచెం పాత పడగానే కొత్త పుస్తకం లో రాసుకునేది.
ఇంకా అందులో బువ్వబంతి పాటలు, వియ్యాల వారి పాటలు అలా ఎన్నో కొత్త కొత్త పాటలు వచ్చి చేరేవి.
మా పెద్ద వదిన కు కూడా ఈ పాటలు అన్నీ నేర్చుకోవటం ఇష్టం ఉండేది.
అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి పాటలు నేర్చుకుంటూ పుస్తకం లో రాసుకుంటూ చూసే వాళ్లకు ఆనందం కలిగించే వారు.
ఇంక మా ఆమ్మ గారు హైదరాబాద్ వచ్చాక ఆ పాటలు మా అన్నయ్య పిల్లలు కు , మా పిల్లలు కి నేర్పేది.
పుస్తకం కొంచెం పాత పడగానే కొత్త డైరీ ఇవ్వవే అని అడిగేది.
పెద్ద అత్తయ్య పాటలు పెద్దమ్మ గారి పాటలు ఆమ్మ చేత చిన్న అత్తయ్య చేత టేప్ రికార్డర్ లో రికార్డు చేయించినా
ఆ టే పులు ఇన్ని రోజులు వుండవు కదా , ఆలా దాచి వుంచాను కానీ సీ డి చేసే వాళ్ళు కూడా దొరక లేదు.
మా ఆమ్మ గారు పెద్ద వయసు లో రాయ లేక పోతున్నానే ఈ పాటలు అన్నీ కొత్త డైరీ లో రాయి అని అడిగింది.
అలాగే అంటూ ఆ పాటలు అన్నీ రాసి పెట్టాను . ఆ డైరీ ఇప్పుడు నా దగ్గర వున్నది.
చివరి వయసు లో కూడా ఏవో పాటలు గుర్తు చేసుకుంటూ ఆ చరణం ఏమిటీ గుర్తు రాలేదు అని అడిగేది.
తొంబై ఏళ్ల వయసులో కూడా రాములు వారి విగ్రహాలు కు పూల దండ లు కట్టి వేసి హారతి , జోల పాడుకునేది.
మా పెద్దమ్మ గారు వ్రాసిన పాట దసరా నవరాత్రుల పూజ ల్లో పాడితే మా గురువుగారు కళ్లనీళ్లు
పెట్టుకుని ఎంత బాగా రాసారు ఎంత బాగుంది అని నా దగ్గర నేర్చుకున్నారు..
ఏ నవ రాత్రి పూజలు అయినా ఆమ్మ వారి పాటలు పాడించుకునే వారు .
మా అత్తయ్య శివుడి మీద రాసిన కొన్ని పాటలు చాలా ప్రాచు ర్యం పొందాయి.
ఈ పాటలు అందరూ రాసి ఇవ్వమంటే ఈ మధ్య నే పీ డి ఎఫ్ చేయించాను. ఎవరైనా అడగ గానే ఆ పీ డి ఎఫ్ పంపుతాను .
ఇన్ని టెకనిక్ లు అప్పుడు లేవు కదా. అయినా మా ఆమ్మ గారు రాసుకున్నట్లు ఉంటుంది టే అంటుందేమో అనుకుంటాను.
నేను నేర్చుకున్న పాటలు అన్నీ మా ఆమ్మ గారి ఆత్మ తృప్తి కోసం వాట్సాప్ లో రికార్డు చేసి పెట్టాను.
నా టోన్ అంత గా మధురం గా ఉండక పోయినా , భక్తి ఉంటే చాలు అనే మా ఆమ్మ గారి మాటలు గుర్తు చేసుకుంటూ .
మా అత్తయ్య రాసిన ఒక పాట లో మార్కె డే యుడు, నందనా రు , భగీరదుడు పూజించి నటులే మారేడు దళములు తో మనసు దీరంగ పూజిస్తాను అని రాశారు .
అలా వాళ్ళకు నివాళి గా ఈ పాటల కదంభం
శుభ రాత్రి
Comments