గీతా జ్ఞానం
- murthydeviv
- 2 days ago
- 1 min read
ఈ టైటిల్ చూసి నేను భగవద్గీత గురించి చెప్తాను అనుకోవద్దు. ఆ గ్రంథం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనుకుంటాను.మా అత్తగారు మార్గశిర మాసము లో గీత చదివితే మంచిది, అంటే ఉషశ్రీ గారి గీత. మలయాళ స్వామి వారి ఉపన్యాసాలు కొన్ని చదివాను . అర్ధం అయిందో లేదో నాకే తెలియదు మాకు బాగా ఆత్మీయుడు, బంధువు మా అన్నయ్య పోయినపుడు ఓదారుస్తూ ఆత్మ కు చావు లేదు అది మనల్ని చూస్తూ ఉంటుంది అని చెప్పారు ఆ రోజు ఆత్మ ఎక్కడ ఉన్నా మా అన్నయ్య నీ చూడలేము కదండీ అన్నాను. ఎవరన్నా పోయినపుడు చాలామంది ఘంటసాల గారి గీత పెడతారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని నీకర్తవ్యం నీవు చేయి, పలితం నేను చూసుకుంటాను అని కదా చెప్పాడు. అసలు a సమయంలో గీత ఎందుకు పెడతారు నాకు అర్ధం కాదు . ఈ మధ్య చాలా మంది ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కూడా ఈ విషయాన్ని గురించి చెప్పారు. నేను పాడిన గీత ఇలా పెడుతున్నారా అని ఘంటసాల గారు కూడా బాధ పడతారేమో. ఈ మధ్య భాగవతము లో ఒక కథ చదివాను. ఒక పేర్లు గుర్తు లేవు క్షమించాలి ఎప్పటి సంగతులో గుర్తు వుంటాయి ఇది ఎందుకు గుర్తు లేదు అంటే తెలియదు. ఒక రాజు కు కొడుకు మరణిస్తాడు. అతను చాలా దుఃఖం లో వుంటాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టి రాజ్య పాలన సరిగా ఉండేట్లు చేయాలని ఒక మహర్షి నీకు ఆత్మలు చూపిస్తానని తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి. ఈ తండ్రిని ఆ ఆత్మ గుర్తు పట్టదు. తన కొడుకు ఎవరో ఈయన గుర్తు పట్ట డు . వైరాగ్యం వచ్చి వేరే ఎవరినో రాజు గా చేసి తపస్సు కు వెళ్తాడు.అంత వైరాగ్యం మనకు ఎలాగూ రాదు. అలా తపస్సులు చేయలేము . ఆత్మలు ఎక్కడ ఎలా ఉన్నా ఎన్ని ఏళ్ళు గడిచినా పోయిన వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు మనల్ని వదిలి వెళ్ళవు మన వెనకే వున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఈ మధ్య అన్నయ్య కూతురు వాళ్ళ అమ్మాయి పెళ్లి అని పిలవటానికి వచ్చింది. అందుకే మా అన్నయ్య గుర్తు వచ్చాడు. మనం వున్నన్నాళ్లు అందరీ తో ఆప్యాయంగా ఉంటూ. ఏ ద్వేషాలు లేకుండా ఉంటే చాలు అనుకుంటాను. ఎవరి ఆత్మ ఎక్కడ ఉన్నా మనం పోయాక మనము ఎవరికి గుర్తు వచ్చినా ఒక విరజాజి పూల పరిమళము లాగా మనసుకు హాయిగా ఉండాలని ఆశిస్తూ
Comments