బాపు రమణీయం
- murthydeviv
- 2 hours ago
- 2 min read
బాపు రమణల లోగిలి అని ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది. అందులో చేరటం వలన మంచి కథలు బాపు రమణ ల గారి గురించి కొన్ని కబుర్లు తెలుస్తూ వుంటాయి.మొన్న ఆదివారం నాడు ముళ్ళపూడి రమణ గారి జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు గురించి చూసి చాలా సంతోషించి , వాళ్ళ గురించి రాయ గలిగిన గొప్ప దాన్ని కాకపోయినా, వాళ్ళ మీద అభిమానంతో ఏవో కొన్ని జ్ఞాపకాలు పంచుకోవాలని తాపత్రయం తో ఈ పోస్ట్ . మేము కాలేజ్ లో చదువుకునే రోజుల్లో బాపు రమణల గారికి వీర అభిమానులం. బాపు గారు ఏ కథ కు బొమ్మ వేసినా అది జాగ్రత్తగా గా ఆ పత్రిక నుంచి కట్ చేసుకుని దాచుకునే వాళ్ళం. సన్నగా పొడవుగా చక్కటి కాటుక కళ్లతో, పొడవాటి జడతో వున్న ఏ అమ్మాయి కనిపించినా బాపు బొమ్మ లాగా ఉంది అనుకునే వాళ్ళం. ఇక అబ్బాయిలు అయితే అలాంటి అమ్మాయి కావాలని చాలా కోరుకునే వాళ్ళు. రమణ గారి జోక్స్, బాపు గారి బొమ్మలు, రాధా గోపాలం కథలు , బుడుగు, అన్నిటికీ మించి హలో ఒక ఫైవ్ ఉంటే ఇస్తారా అనే అప్పారావు కథ లు ఆంధ్ర దేశం ను ఉర్రూత లూగించేవి. మా కాలేజ్ లో చదువుకునే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అలాగే ఉంటారని నేను నా ఫ్రెండ్ వాళ్లని బామ్మ అనే షార్ట్ కట్ తో పిలుస్తూ వుండే వాళ్ళం. ఈ హైదరాబాద్ వచ్చాక రమణ గారి బుక్స్ సెట్ అంతా నాలైబ్రరీలో కొలువు తీరాయి 2010, 11,లో వచ్చిన కోతి కొమ్మచ్చి పుస్తకాలు తో సహా. ఆధ్యాత్మిక పుస్తకాలు తో పాటు అవి కూడా వుంటాయి. అన్నిటికన్నా నచ్చే రాధ గోపాలం కథలు ఎపుడు చదివినా నిత్యనూతనంగా ఉంటాయి . ఆరోజుల్లో వుండే మధ్య తరగతి జీవన విధానంలో వున్న మాధుర్యాన్ని ఆయన ఎంత అందంగా చెప్పారో, ఇప్పటి జీవితాల్లో అలాంటి సంఘటనలు ఉండవు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు బామ్మలు మనవడు కి ఉద్యోగం ఇప్పించటం కోసం ఆవకాయ జాడి ల తో పెద్ద ఆఫీసర్ గారింటికి వెళ్ళటం, ఆ కథ ఎపుడు గుర్తు వచ్చినా చిరునవ్వు వస్తుంది. ఇంక బుడుగు, బాపు గారి బొమ్మలు చెప్పటానికి ఏముంది b. ఒక అద్భుతమైన క్రియేషన్. నాకు బాపు రమణ గారు అంటే ఎంత ఇష్టం మో మావారికి కూడా అంతే ఇష్టం. జంషెడ్ పూర్ లో వర్క్ చేసేటప్పుడు ఆంధ్రా అసోసియేషన్ తరపున పిలిచినప్పుడు వాళ్ళని కలవటం జరిగింది తర్వాత పిట్స్బర్గ్ లో కూడా ఒకసారి కలిసాము. అక్కడ వుండగానే మావారి ఫ్రెండ్ బాపు బొమ్మ లాంటి అమ్మాయి కావాలని చాలా మంది అమ్మాయిలు నీ చూసాడు. తర్వాత మావారి యింకో ఫ్రెండ్ చెల్లెలు ను అలాగే ఉందని ఇద్దరికీ పెళ్ళి చేయించారు. ఎక్కువ సినిమాలు చూడటం ఇష్టపడని మా వారు బాపు గారి సినిమాలు మాత్రం తప్పక . ముత్యాల ముగ్గు అయితే కనీసం ఒక పది సార్లు అయినా చూసి ఉంటారు . బాపు గారి సినిమాల్లో సీతా
కళ్యాణం ఒక కళా ఖండం లండన్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా వెళ్ళింది. మా వారి ఫ్రెండ్ Mr పెళ్ళాం సినిమా బాపు గారి డైరెక్షన్ లో తీశారు ముహూర్తం షాట్ కి పిలిస్తే వెళ్ళాము.ఆ రోజు మా అమ్మాయి మీ కథల్లో లాగా కుంపటి పెట్టచ్చు కదండీ అని అడిగింది. బాపు గారు నవ్వుతూ సరదాగా అలాగేనమ్మా అని చెప్పారు . కోతి కొమ్మచ్చి పుస్తకాలు చాలా బాగుంటాయి.ఆ పుస్తకాల్లో వాళ్ళ స్నేహము, తీసిన సినిమాలు గురించి రాశారు ఒక పుస్తకం ఎపుడూ నా రూమ్ లో పెట్టుకుని చదువుతూ ఉంటాను. నిన్న బాపు రమణ గారి సాక్షి సినిమా యూ ట్యూబ్ లో చూసాను. గోదావరి నది అందాలను వాళ్ళే చూపించాలి. అందాల రాముడు లో కూడా అవే అందాలు రమణ గారి పుస్తకం లో ఆ షూటింగ్ విశేషాలు చదువుతుంటే వాళ్ళ గొప్ప వ్యక్తిత్వము అర్థం అవుతుంది. మా దంపతుల కు బాపు రమణ ల గారి మీద వున్న అభిమానం అర్థం చేసుకున్న మా పిల్లలు మా మనవరాలు కి జ్ఞాన ప్రసునాంబ అనే పేరు పెట్టారు . స్కూలు లో కూడా పూర్తి పేరు రాయించారు. పాప పుట్టిన రోజుకు రిటర్న్ గిఫ్ట్ గా బుడుగు బుక్స్ ఇచ్చాము . నా అభిమానం కొద్దీ రాసిన ఈ నివాళి బాపు రమణ గార్లకు న మ స్కృతులతో
Comments