top of page
Search

బార్బెక్యూ నేషన్

  • murthydeviv
  • 2 days ago
  • 3 min read

ఒక నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్డు లో వెళ్తుంటే ఈ పేరు తో ఒక పెద్ద బోర్డు కనిపించింది. వెంటనే నేను మా డ్రైవర్ ను అడిగాను.నేను కారు లో ఎక్కడికి వెళ్తున్నా మా డ్రైవర్లు నాకు కృష్ణుడు లాగా ఆత్మ జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. నాకు సినిమా లు , పొలిటికల్ లీడర్స్ పార్టీ ల బలాబలాలు, ఇలా అన్ని విషయాలు గురించి. జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. మావారు ఆ మధ్య కాలంలో ఢిల్లీ కి ప్రదక్షిణలు చేస్తూ వుండేవారు. వుదయం ఫ్లైట్ తొమ్మిది గంటల కు అయితే ఇంట్లో ఐదు గంటల నుండి హడావిడి పడాలి . డ్రైవర్ ను లేపటం దగ్గర నుండీ మనదే బాధ్యత. ఒక రెండు సార్లు ఫోన్ కి లేచాను అమ్మా వస్తున్నా అంటాడు. మూడో సారి ఫోన్ కి బాల కృష్ణ ఇంటి దగ్గర వున్నా, వచ్చేస్తాను అంటాడు. ఇంకో రోజు శ్రీహరి ఇంటి దగ్గర అంటాడు.మా వారితో ఈవెనింగ్ ఫ్లైట్ కి వెళ్ళచ్చు కదా అని నేను అంటే ఎందుకు హోటల్ ఖర్చు పని చూసుకొని ఈవెనింగ్ వస్తా అంటారు. అలాంటి ఈవెనింగ్ లు ఒక ఐదు ఆరు గడిచాక రావటం మాత్రం ఈవెనింగ్ వస్తారు. నాకు ఒక్కొక్క రోజు కారులో మా ఇంటి చుట్టూ ఉన్న సినిమా యాక్టర్, పొలిటికల్ వాళ్ళ ఇళ్ళు చూసి వద్దాము అనిపిస్తుంది. మా అబ్బాయి ఏదో రోడ్ నెంబర్ చెప్పి కొత్త ఆఫీస్ తీసుకుంటున్నాను అన్నాడు. దగ్గర నా ఎక్కడ అని బుద్ధి పొరపాటున డ్రైవర్ ను అడిగాను. బాణం లాగా జూనియర్ ఎన్ టి ర్ ఇంటి దగ్గర అని, ఆన్సర్ వచ్చింది. దగ్గర లో ప్లాంట్ నర్సరీ ఎక్కడ అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర అని ఆన్సర్. ఇదివరకు ఆంధ్రా ప్రజలు తిరుపతి బస్ లో వెళ్ళి మద్రాస్ లో ఎన్ టి రామారావు ను చూసి వచ్చే వారు. ట అలాగే నేను కూడా ఎవరి ఇళ్ళు ఎక్కడో తెలుసు కుంటే వాళ్ళు నాకు ఇచ్చే జ్ఞానం కి ఇరిటేట్ కాకుండా వుంటాను అనిపిస్తుంది.ఈ రోజు మాత్రం నేనే అడిగాను కదా, అది కొత్త హోటల్ అమ్మా అన్నాడు. వెంటనే నా మనసు అమెరికా కి పరిగెత్తింది. అమెరికాలో వున్న నా బంధు మిత్రులు కు నా మనవి ఏమిటంటే నాకు తెలిసిన అమెరికా ఒక పది సంవత్సరాల క్రితం మాట మాత్రమే. ఈ మద్యలో చాలా మారి ఉంటుంది.నేను చికాగో లో ఉన్నప్పుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ బ్యాక్ యార్డ్ లో మనుషులు హడావిడి గా బయటకు లోపలికి తిరుగుతూ ఉన్నారు. అబ్బ ఆ సందడి చూసి ఏమిటి అని అడిగితే మా మరిది గారు చెప్పారు. సమ్మర్ లో బయట ఇలా ఎలెక్ట్రిక్ గ్రిల్ పెట్టీ వంట చేస్తారు అన్నారు. అలా చేయటానికి బార్బెక్యూ అంటారు అని చెప్పారు.ఏదో సరదాగా గా చుద్దాం అనుకుంటూ నేను కూడా మా చెల్లెలు బ్యాక్ యార్డ్ లో ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నానుమునాన్ వెజ్ పీసెస్ నీ ఒక పెద్ద చువ్వ కి గుచ్చి ఆ గ్రిల్ మీద కాలుస్తున్నారు నన్ను చూసి హాయ్ అనిచెప్పారు

. ఓహో ఆది మానవులు లాగా ఇలా చేసుకుంటున్నారు కాబోలు అనుకున్నాను. మరి ఈ హోటల్ లో ఏమి పెడతారో తెలియదు, పన్నీర్ నే కాల్చి పెడతారేమో. వెళితే కానీ తెలియదు కదా మన చిన్న తనంలోచిక్కుడు కాయలు ఒక పుల్ల కు గుచ్చి కాల్చుకొని తినే వాళ్ళం. ఇంకా చిలకడ దుంపలు, బంగాళ దుంపలు కూడా కాల్చి తినే వాళ్ళం. చాలా రుచిగా వుండేవి అయితే అపుడు మనకు ఇలాంటి అందమైన పేర్లు పెట్టడం రాదు కదా. మొన్నీ మధ్య మా కోడలు ఒక గాజు సీసా నిండా ఉన్న గింజలు తెచ్చింది. ఆ బాటిల్ మీద లిస్ట్ అంతా ఉంది ప్రోటీన్ ఎంత ఇవి తింటే ఎంత ఎనర్జీ వస్తుంది వగైరా లు కొంచెం పరీక్ష గా చూస్తే గుమ్మడి గింజలు అని అర్థం అయింది . చిన్నతనం లో పచ్చి జీడి కాయలు ఈ గుమ్మడి గింజలు అన్ని నిప్పులు ల్లో వేసి జాగ్రత్తగా పొట్టు తీయడం గుర్తు వచ్చింది. ఆ జీడి పప్పు కాయలు జిగురు తగిలితే చేయి పొక్కుతుంది జాగ్రత్తగా కొట్టండి అని అమ్మ చెప్పేది. ఆ రోజుల్లోకుంపటి లో నే ఇవి కాల్చేవాళ్ళం పనస గింజలు కూడా అలాగే కాల్చి తినే వాళ్ళం.ఈ మధ్య కాలంలో పనస పొట్టు కూర కాకుండా పెద్ద ముక్కలుగా బిర్యానీ లో కూడా వేస్తున్నారు. అవి చూస్తుంటే నాకు ఏవో నాన్ వెజ్ డిషెస్ గుర్తు వస్తాయి. ఎవరు మాట్లాడినా ప్రోటీన్ ఎందులో ఉన్నది మనకు ఎంత మోతాదులో కావాలి అనే జ్ఞానం ఇస్తూ వుంటారు. మన చిన్న తనం లో ఉదయం కంది పొడి తో నెయ్యి వేసుకుని తినే వాళ్ళం లంచ్ కి కూర వున్నా లేకపోయినా పప్పు తప్పకుండా వుండేది. రాత్రి కి మరల కంది పచ్చడి, అలాంటి చట్నీ లు వుండేవి. అన్నీ ప్రోటీన్ కదా. అసలు రుచి అంతా స్లో కుకింగ్ లో వుంటుంది నా ఫ్రెండ్ ఒకావిడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ వాళ్ళింట్లో గ్యాస్ పక్కనే ఒక కుంపటి వుండేది. ఆదివారం దోసకాయ పప్పు తప్పకుండా కుంపటి లో చేస్తుందిట ఆ టేస్ట్ ఇంక ఎలా వండినా రాదుట తన ఇంట్రెస్ట్ అండ్ టేస్ట్ కు సంతోషించి, మనకు ఓపిక లేదులే అనుకున్నాను. మరలా ఇప్పుడు రాగి పాత్రలు ఇత్తడి గిన్నెలు అన్ని మరలా వెనక్కి వస్తున్నాయి కదా మా పెద్దమ్మ ఇత్తడి బాండీలో కుంపటి మీద బంగాళా దుంప ఉల్లిగడ్డలు వేసి చేసేది ఆ రుచి మనం ఎలా చేసినా రాదు. ఒకసారి ఒక హోటల్ కి వెళ్ళి మెనూలో ఎల్లో లెంటిల్స్ విత్ గుడ్ రెడ్ టమోటా స్పైసీ గార్నిష్డ్ విత్ కొరియాండర్ అని రాశాడు. అబ్బా టమోటా పప్పు ను ఎంత అందంగా రాసాడు, అనుకున్నాను. ఇపుడు ఈ బార్బెక్యూ నేషన్ కూడా పేరు ఎంత అందంగా ఉంది. కొత్త సీసా లో పాత కూల్ డ్రింక్ లాగా.

నా కాఫీ పోస్ట్ చూసి నా అమెరికా బంధువులు అందరూ మంచి కాఫీ ఇస్తామని ఇన్వైట్ చేశారు చాలా సంతోషంగా ఉంది. వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా వచ్చి కాఫీ తాగుతాను.

 
 
 

Recent Posts

See All
బాపు రమణీయం

బాపు రమణల లోగిలి అని ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది. అందులో చేరటం వలన మంచి కథలు బాపు రమణ ల గారి గురించి కొన్ని కబుర్లు తెలుస్తూ...

 
 
 
కాఫీ, కాఫీ

ఒక డైరెక్టర్ గారు తన సినిమా పేరు కి క్యాప్షన్ లాగా మంచి కాఫీ లాంటి సినిమా అని పెట్టాడు. సినిమా నిజంగానే మంచి కాఫీ లాగా బాగుంది. సినిమా...

 
 
 
నాన్న కు ప్రేమతో

ఫాదర్స్ డే అని షరా మామూలుగా అందరూ పేపర్ లో, రెండు మూడు ఆర్టికల్స్ చాలా బాగా ఉన్నాయి. అందులో లెటర్ టు హిస్ ఫాదర్ అనే నవల రాసిన వారి...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page