top of page
Search

కిచెన్ క్వీన్స్

  • murthydeviv
  • Jun 13
  • 2 min read

నిన్న కొందరు కిచెన్ క్వీన్స్ గురించి చెప్పా కదా మీకూ బోర్ కొట్టేస్తుంది అని ఆపేశాను. కొందరిని ఒక నెల భరించి అబ్బా ఏదో ఓపిక వున్నట్లు ఆవకాయ తిందాము , అనుకుంటూ ఒక నెల ఎంతో గడుపుతాను. మరలా పెద్దమ్మ గానీ అక్కయ్య గాని ఎవరో ఒకర్ని చెప్తారు. మరలా కుక్క తోక లాగా ఆ క్వీన్స్ నీ తెచ్చుకుంటాను. అందరూ మంచి వాళ్ళు కాదు అని చెప్పలేను,. కొంత మందిని చూస్తే పాపం చాలా జాలి వేస్తుంది. ఒకావిడ అన్నయ్య పెద్ద ఉద్యోగం లోనే ఉన్నాడు. అల్లుడు కూడా అంతే అయినా పాపం వంట లు చేస్తూ వుండేది. ఆవిడ బాధ చూసి నేనే మావారి తెలిసిన వాళ్ళింట్లో ఒక పెద్ద ఆవిడ ను చూడాలి అంటే అక్కడ పెట్టించాను మా ఇంట్లో ఇన్ని రకాలుగా వంటలు చేయడం కష్టం అనుకుని. ఈ సారి మాత్రం మా చెల్లెలు గోదావరి జిల్లా నుంచి ఒక ఆవిడ ను పంపింది. ఆవిడ ఒక ఆరు నెలలు మా ఇంట్లో ఒక మూడు నెలలు మా ఆడపడుచు ఇంట్లో వాళ్ళ అమ్మాయి పురుడు కి చేసింది. ఆవిడ తో సినిమా ల్లో సూర్యకాంతం క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళ ను చూసే క్రియేట్ చేసి వుంటారు. అనే జ్ఞానం కలిగింది. మా ఆడపడుచు నాలాగ గట్టి గా మాట్లాడ లేదు. ఒక రోజు వచ్చి ఆవిడ ను మా ఇంట్లో దింపి వెళ్ళారు. రోజూ ఉదయాన్నే వంట చెప్పగానే కూర ఎలా చేయాలి అని అడిగేది. మనం చెప్పగానే ఇంకొక రకంగా చేస్తాను అనేది రోజూ ఆవ పెట్టీ పులుసు పెట్టీ ఏవో వంటలు. పప్పు పులుసు లాగా వుండేది మా వారు పిల్లలు అయితే రోజూ మాకు లంచ్ బాక్స్ వద్దు అని ఎవో కారణాలు చెప్పే వారు. నేను ఏదయినా మంచి చీరె కట్టుకుంటే ఇలాంటి చీరె నాకు కూడా తెచ్చి పెట్టండి అనేది. ఈవిడ ను ఇంకా కొన్ని రోజులు ఉండ మంటే నీ చీరె లు కూడా అడుగుతుంది అని మావారు నన్ను చివాట్లు పెట్టటం మొదలు అయింది. ఎలాగో మా అబ్బాయి పెళ్ళి ఫంక్షన్ లు అయిపోయాక ఆవిడ ను పంపించాను. ఆవిడ సీరియల్స్ పిచ్చి, ఏమన్నా అనగానే గుండె ల్లో నొప్పి అంటూ నన్ను ఒక ఆట ఆడించింది. ఆతరువాత ఇంట్లో ఉండే వాళ్లు వద్దు అని గట్టిగా అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొర విన్నట్లు మా అత్త గారికి ఆవిడ కజిన్ సిస్టర్ కూతురు ఉద్యోగం కావాలని మా ఇంటికి వచ్చింది. మా వారు వెంటనే మా అత్త గారిని చూడమంటూ ఉంచేసారు. ఇంటినీ మా అత్త గారిని పనివాళ్ళు ను అందరిని చాలా చూసుకుంటూ వుండేది. వంటిల్లు వదిలేది కాదు. ప్రతి వాళ్ళ కు ఏవో వీక్నెస్ లు ఉంటాయి అని నేను అడ్జెస్ట్ అయిపోయాను. అన్నీ రెడీ చేసి పెడితే వంట నేను చేసుకునే దాన్ని. మా పెద్దమ్మ ఇలాగే ఒక అమ్మాయిని పంపింది. మా ఇంట్లో అన్నీ పెళ్ళిళ్ళు కు నా వెంబడి ఉండి బీరువా కీస్ తో సహా పెళ్ళి లో వెండి సామానులు నగలు అన్నీ జాగ్రత్తగా చూసేది. ఇంట్లో అందరికీ కావాల్సిన వన్నీ చక్కగా చూసేది. తరువాత ఆ అమ్మాయికి పెళ్లి అయింది. ఇప్పటికీ ఫోన్ చేసి యోగ క్షేమము లు కనుక్కుంటూ వుంటుంది. పెళ్ళి కాకముందు ఏ అవసరం అయినా పిలిస్తే వచ్చేది. అలాగే మా పెద్ద అమ్మాయి బాబు ను చూడటానికి ఒక తమిళ్ ఆవిడ ను పెట్టింది. ఆవిడ నాకు పూజ గదిలో అన్నీ ఎరేంజ్ చేస్తూవుండేది. పిల్లలు ను కూడా బాగా చూసుకునేది. ఆవిడకు ఇద్దరు కూతుళ్లు ఒక అమ్మాయ్ అమెరికాలో ఉంటే ఇంకో అమ్మాయ్ బెంగుళూరు లో వుంటారు. కానీ ఆవిడ పాపం ఇపుడు దగ్గర లో ఇస్కాన్ గుడి లో సేవ చేస్తూ వుంటున్నది. ఈ మధ్య నే పిల్లలు ను నన్ను చూడాలని వచ్చింది. అలాంటి వాళ్ళ ను చూస్తే చాలా బాధ గా ఉంటుంది. కలియుగం అంటే ఇలా ఉంటుంది అనుకున్నాను అదీ ఈ కిచెన్ క్వీన్స్ కథ.

 
 
 

Recent Posts

See All
బాపు రమణీయం

బాపు రమణల లోగిలి అని ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది. అందులో చేరటం వలన మంచి కథలు బాపు రమణ ల గారి గురించి కొన్ని కబుర్లు తెలుస్తూ...

 
 
 
బార్బెక్యూ నేషన్

ఒక నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్డు లో వెళ్తుంటే ఈ పేరు తో ఒక పెద్ద బోర్డు కనిపించింది. వెంటనే నేను మా డ్రైవర్ ను అడిగాను.నేను...

 
 
 
కాఫీ, కాఫీ

ఒక డైరెక్టర్ గారు తన సినిమా పేరు కి క్యాప్షన్ లాగా మంచి కాఫీ లాంటి సినిమా అని పెట్టాడు. సినిమా నిజంగానే మంచి కాఫీ లాగా బాగుంది. సినిమా...

 
 
 

Komentáře


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page