top of page

అరచేతిలో స్వర్గం

murthydeviv

ఇది ఒక సామెత అనుకోండి. కానీ నాకు ఈ రోజుల్లో సెల్ ఫోన్ చూస్తే ఎందుకో ఇదే మాట గుర్తు వస్తుంది. మా మనవరాలు సెల్ ఫోన్లు లేని ఆరోజుల్లో మనం వున్నాము అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా ఉన్నారు.అని అడుగుతుంది. ఆపుడు తనకి టెలిఫోన్ కథ చెప్పాల్సి వచ్చింది. మన చిన్నప్పుడు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఫోన్లు వుండేవి. వ్యాపారస్తులకు, పెద్ద ఉద్యోగస్తులు కు మాత్రమే ఫోన్ వుండేది . ట్రంక్ కాల్ బుక్ చేస్తే గానీ ఇంకో వూరు వాళ్ళ తో మాట్లాడ లేము. లేకపోతే పోస్టు ఆఫీసు కి వెళ్లి అక్కడనుండి ఫోన్ చేసీ మాట్లాడాలి. ఇదివరకు రోజుల్లో ట్రంక్ కాల్ అన్నా టెలిగ్రామ్ అన్నా భయం అనిపించేది. ఇంక ఆమెరికా వేరే దేశాలు అయితే చాలా టైం పట్టేది. తర్వాత S T D వచ్చాక కొంచెం ఫోన్లు చేసుకోవటం సుళువు అయిన బిల్లులు మాత్రం పాపము లాగా పెరిగి పోయేవి.నెల చివరకు బిల్లు చూసీ ఆఫీసుల్లో ఇంట్లో అందరికీ కంగారు వచ్చేది. తర్వాత పేజర్లు, మెల్లగా సెల్ ఫోన్లు వచ్చాయి. ఈ కబుర్లు చెపితే వాళ్ళ కి ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎలా వున్నారు సెల్ ఫోన్ లేకుండా అని అంటారు. నిజమే ఎలా వున్నాము. ఆపుడు ఆనందం గా లేమా, అంటే మనము చాలా ఆనందం గా వున్నాము అంటాము. ఇపుడు ఎవరింటికి వెళ్ళినా తలా ఒక ఫోన్ పట్టుకుని చూసుకుంటూ కూర్చుంటారు.T V లు వచ్చిన కొత్తల్లో కూడా ఇలాగే ఎవరింటికి వెళ్ళినా ఆ టైమ్ లో డ్రామా ఏదయినా వస్తే మనం కూడా అది చూస్తూ వుండాల్సి వచ్చేది.. ఆదివారం టీవీలో సినిమా వేస్తే ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పాత సినిమా అయితే అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ, చూసేవాళ్ళం. ఇపుడు టీవీ లో ఎన్ని చానల్స్ వున్నా కలిసి సినిమా చూడటము అనే పద్ధతి అసలు లేదు. మొదట్లో దూర్ దర్శన్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్ బాపూ గారి సంపూర్ణ రామాయణం సినిమా పెట్టారు అప్పట్లో మా ఇంట్లో నే ఫస్ట్ టీవీ వుండేది. చుట్టుపక్కల వాళ్ళతో బంధువులతో ఇల్లు నిండి పోయేది. ఇంక యిపుడు ఎన్నో ఛానెల్స్. ఇంక స్మార్ట్ ఫోన్ల లో అన్నీ ఛానెల్స్, యింకా ప్రైవేట్ ఛానెల్స్ వచ్చాకా, ఎవరి గోల వారిదే. ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళ కు ఇష్టమైన టైముల్లో చూడచ్చు. ఇంక నలుగురూ కలిసి కూర్చుని సినిమా చూడవలసిన అవసరం లేదు.ఈ టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ అయింది. పిల్లలు అన్నీ నేర్చుకుని కాలం తో పాటు పరిగెత్తాలి. కానీ ఒక్కొక్క సారి ఈ టెక్నాలజీ చూస్తే భయము వేస్తుంది. ఫేస్ బుక్,, Instagram వాటిల్లో కొన్ని కొన్ని చూస్తుంటే భయము అనిపిస్తుంది. ప్రైమరీ స్కూల్ పిల్లలు కు కూడా ఇంత ఓవర్ గా వుండటం అవసరమా అనుకుంటాను.a వయసులో ఆడుకునే ఆటలు ఆడటం, కొత్త గా ఏవయినా నేర్చుకోవటం ఉండదు. హోమ్ వర్క్ చేశారు అంటే ఇంక ఫోన్ పట్టుకోవటం, తల్లి తండ్రులు కుడా వాళ్ళ ఫోన్ లో వాళ్ళు బిజీగా వుంటారు. ఈ టెక్నాలజీ కి అంతు ఎక్కడ అనిపిస్తుంది. కానీ కాలం తో పాటూ మనమూ పరిగెత్తి పోవాలి కదా అనుకుంటాను. కమ్యూనికేషన్ పెరిగినందు వలన ఊపయోగం వున్నా, దాన్ని అతిగా వాడటం వలన నష్టము అనుకుంటాను. అందుకే అరచేతి లో స్వర్గము అన్నాను. పిల్లలు ఏమీ ఫోటోలు పెడుతున్నారు ఎవరితో ఎలా మాట్లాడుతారు అని గమనించుకోవాలి అనిపిస్తుంది.

 
 
 

Recent Posts

See All

కుంభ మేళ

నిన్నే నే అమ్మమ్మ గారి ఊరి గురించి రాశాను కదా. ఈ రోజు ఏం రాస్తములే అనుకున్నాను ఫేస్ బుక్ లో ఇంకా మా ఫ్రెండ్స్ కుంభ మేళ గుఱించి రాస్తూ...

అమ్మమ్మ గారి ఇల్లు

M N a Mans తాతయ్యలు, మేనత్త లు, బాబాయిలు ఎంత గారాబంగా చూసినా మన చిన్నతనంలో అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఆ వయసులో ఏదో డిస్నీ లాండ్ కి....

మహానుభావులు

తన కోసమే కాకుండా ఇంకొకరికి ఏ కొద్ది సహాయము చేసే వాళ్ళయినా నా దృష్టి లో మహానుభావులు అనుకుంటాను. మా పెద్దనాన్న గారు చాలా స్ట్రిక్ట్ గా...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page