top of page
Search

అణిముత్యాలు

  • murthydeviv
  • Jul 9
  • 3 min read

ఈ మద్యలో కాస్త బద్దకం వదిలించుకుని కాస్త అలమర లో బుక్స్ కొంచెం దుమ్ము దులుపుదామని తీసాను.ఆ పుస్తకాల్లో ఎపుడో రాసుకున్న పాటల పుస్తకం కనిపించింది. ఎపుడూ ఏదో ఒకటి రాయడం అనేది ఒక అలవాటు. ఆరోజుల్లో విన్న పాటలు అన్ని రాసుకోవటం ఫ్రెండ్స్ అందరము కలిసి పా డు కోవటం సరదాగా వుండేది. ఒక్క సినిమా పాటలే కాకుండా లైట్ మ్యూజిక్ పాటలు ఇంకా ఎంకి పాటలు అన్నీ పాడుకునే వాళ్ళం. ఇంతకీ ఆ బుక్ లో ఒక పాట చూడ గానే ఆ పాట ఏ సినిమాఇంక లో గుర్తు లేదు . ఎందుకో ఆ సాహిత్యం కృష్ణశాస్త్రి గారి నే గుర్తు చేసింది.సో ఉందిగా మన యూ ట్యూబ్ లో వెతికాను ఆ పాట బంగారు పాప సినిమాలో, పాట తో పాటు ఇంకో చక్కని పాట అదే సినిమా లో పాట ను కూడా వెతికి పెట్టింది.ఒక 50 ఏళ్ళ క్రితం నా ఫ్రెండ్ కి అప్పటికే పాత పాటలు గా మారిన ఈ పాటలు చాలా ఇష్టం వుండేది తనకి చాలా చక్కటి కంఠం ఇచ్చాడు భగవంతుడు. మాకు ఈ పాటలన్నీ మాకు నేర్పుతూ తను పాడుతూ వుండేది. చండీరాణి లో ఓ తారక, చిరంజీవులు లో చికిలింత చిగురు, మల్లీశ్వరి లో పాటలు తను పాడుతూ ఉంటే ఏదో వెన్నెల లో విహరించి నట్లే వుండేది. అపుడే కాలేజీ చదువులు ముగించి కొత్తగా ఉద్యోగం లో చేరిన రోజులు. అప్పట్లో నే తనకు కొత్త సినిమాలు నచ్చేవి కాదు ఎపుడూ పాత సినిమాలకు వెళ్దాం అనేది తను వంట కూడా బాగా చేసేది. మాకు కొత్త పాటలు కొత్తకొత్త వంటలు రుచి చూపిస్తూ వుండేది. ఈ సందర్భంగా మరలా ఒక నాలుగు రోజుల నుండి ఆ పాటలే వింటూ ఎంజాయ్ చేస్తూ ఆరోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మరీ ఈ రోజుల్లో తెలుగు సినిమా పాటలు వింటూ ఉంటే చాలా దుఃఖం కలుగుతుంది.కారు లో ఎక్కడికన్నా వెళ్తుంటే మా గ్రాండ్ చిల్డ్రన్ కాసేపు తెలుగు హిందీ పాటలు పెడతారు. కారు లో వినటమే కానీ చూడము కదా మొన్న ఎపుడో సా మాజవరగమన అంటూ ఒక పాట చూసే భాగ్యం కలిగింది. ఆ త్యాగరాజు గారు శ్రీరామచంద్రుడు ప్రభువు గురించి రాసిన పాటను ఆ సినిమాలో ఆ హీరోయిన్ కాళ్ళు చూపిస్తూ ఆ మాట వాడుతాడు. సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారో అనిపిస్తుంది. అదీ మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం అనుకుని మరలా మంచి పాటలు కథకు వెళదాము. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ పాటలు కూడా చాలా ఉన్నాయి. శివ శివ అన రాదా అనే పాట కూడా శాస్త్రి గారి దే ఇంకా మల్లీశ్వరి లో కూడా చాలా పాటలు రాసారు.ఈ మధ్య ఒక సింగర్ పరిచయం అయ్యారు . ఆవిడ మా అత్తయ్య , పెద్దమ్మ గారు వాళ్ళు రాసిన కొన్ని హారతి పాటలు పాడి యూ ట్యూబ్ లో పెడతానంటే ఆవిడకు కొన్ని పాటలు పాడుతూ పంపాను. అలాగే గుణసుందరి కథ సినిమాలో కల్పకమ్మ అమ్మవారి మీద వ్రాసిన పాటలు కూడా యూ ట్యూబ్ లో నుంచి షేర్ చేశాను. మా చిన్నతనం లో మా అక్కయ్య, అత్తయ్య వాళ్ళు ఆ పాటలు పాడే వారు. ఆవిడ ఆ పాటలు ఎపుడూ వినలేదు ట ,నేను షేర్ చేసినందుకు చాలా సంతోషించారు. రాజమకుటం సినిమాలో సడి సేయకే గాలి అనే పాట కూడా చాలా బాగుంటుంది.పి. లీల గారు పాడారు. ఈ మధ్య యూ ట్యూబ్ లో శిరీష కోటంరాజు గారు ట యు.స్ లో ఉంటారుట చాలా బాగా పాడారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చిరంజీవులు సినిమా లో చాలా పాటలు రాసారు . ఆయన పాటలే కాకుండా కథలు కూడా రాసారుట.నేను ఎక్కువ చదవ లేదు. రహస్యం సినిమాలో లలిత అమ్మ వారి మీద చాలా మంచి పాట రాసారు . గిరిజా కల్యాణం కూచిపూడి డాన్స్ డ్రామా కూడా బాగుంది. ఆయన్ని సినిమా ఫీల్డ్ లో ఘోస్ట్ రైటర్ అనే వారు ట. అంటే ఎవరికయినా పాటలు రాసి వాళ్ళ పేరుపెట్టు కున్న ఊరుకునేవారుట. రాగమయి రావే అనే పాట జయభేరి సినిమా అనుకుంటా . ఇలా రాస్తూ ఉంటే ఎన్నో పాటలు అలా ఊరిస్తూ వస్తూనే ఉంటాయి. పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో శ్రీ బాలు గారు వున్నపుడు ఎన్నో విషయాలు తెలిసేవి. దేవదాసు సినిమాలో కూడా కొన్ని పాటలు మల్లాది గారివే అంటారు. సరే ఇంక విజయా వారి విజయ గీతాలు గురించి చెప్పటానికి ముందే కలవరమా యే మదిలో అనిపిస్తుంది. పాటలన్నీ మనకు ఎంత ఘాటు ప్రేమయో అనిపిస్తాయి.కానీ నాకు మాత్రం అప్పు చేసి పప్పు కూడు సినిమా లో ఎచట నుండి వీచెనో ఈ చల్లటి గాలి పాట చాలా నచ్చుతుంది . సినిమా కొంచెం సాగతీత గా ఉన్నా ఫన్నీ గా ఫైటింగ్ లేకుండా హాయిగా ఉంటుంది. సరే బృందావనం మది అందరిదీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇలా రాస్తూ పోతే అంతు వుండదు. చివరిగా విప్రనారాయణ సినిమాలో చూడుమదే చెలియా పాట వింటూనే రాస లీల చూసినట్లు వుంటుంది పాడుతా తీయగా లో ఒక చిన్న పిల్లవాడు కూడా చాలా బాగా పాడాడు..ఈ పాత పాటలు శిరీష కొమర్రాజు బాగా పాడింది. తెలుగు ఉచ్చారణ బాగుంది. ఏదో నాకు ఇష్టం అని రాసి మీకు బోర్ కొడుతుందని అనుకున్నా, నీ గుణ గానము , నారాయణ హరినారాయణ, మధురం శివ మంత్రం పాటలు వింటే మాత్రం భక్తి ఆటోమేటిక్ గానే వస్తుంది. అసలే ఆషాఢం ఉదయాన్నే చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. రేడియో లు టేప్ లు సెట్ చేయకుండా వుందిగా మన అరచేతిలో స్వర్గం అదే మన సెల్ ఫోన్ ఆన్ చేసేమంటే అన్నీ వినిపిస్తుంది. ఉదయాన్నే మంచి కాఫీ తాగుతూ మంచి పాత పాటలు వినండి. మీ కంఠం వినసొంపుగా ఉంటే పాడి వినిపించండి. మరి పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలు నించు మనసునే మరిపించు గానం మరి గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
నవలా పఠనం

పుస్తకం హస్త భూషణం అన్నారు. భూషణం లాగా ఊరికే పట్టుకొని తిరగటం కాకుండా చదివితే ఇంకా బాగుంటుంది. ఎపుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండే వాళ్ళని...

 
 
 
అపురూప చిత్రాలు 2

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు...

 
 
 
యాంటిక్స్

శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు...

 
 
 

2 Comments


Ramakrishnarao Lakkaraju
Ramakrishnarao Lakkaraju
Jul 09

పాత పాటల్లో నాకు బాగా నచ్చిన పాట "పెళ్ళి చేసి చూడు " చిత్రంలో పాడిన "ఏడు కొండలవాడ వెంకటా రమణ " .

Like
murthydeviv
Jul 11
Replying to

నాకు నచ్చే పాటలు లిస్ట్ రాశాను 😄

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page