top of page
Search

అపురూప చిత్రాలు 2

  • murthydeviv
  • Jul 22
  • 3 min read

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు నచ్చినవి అనే కాదు, కొంచెము సొసైటీ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి తీసినవి, మరీ ముఖ్యంగా చాలా మంచి పాటలు, ఇప్పటికీ ఇండియన్ ఐడల్ లో పాడుతూనే వుంటారు. ఇలా సంగీత ప్రధానమైన సినిమాలు లో బైజు బావర, మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి కథ తో తీసిన సినిమా నౌషాద్ సంగీత దర్శకత్వంలో చాలా మధురమైన పాటలు ఉన్నాయి. కథ నాకంతగా గుర్తులేదు కానీ పాటలు మాత్రం ఇప్పటికీ వింటూ వుంటాను. 1952 లో వచ్చింది. మీనాకుమారి, భరత్ భూషణ్ యాక్టర్స్. అలాగే బసంత్ బ హర్ లో కూడా మంచి పాటలు ఉన్నాయి . ఈ సినిమా కి శంకర్ జైకిషన్ సంగీతం అందించారుట. బూట్ పాలిష్, జాగ్తే రహో రెండూ రాజ్ కపూర్ సినిమాలు బూట్ పాలిష్ కి ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయిట. జాగ్తే రహో కూ డా మొదట్లో వారం రోజులు కూడా ఆడలేదుట. తర్వాత ఏదో ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రిలీజ్ లో బాగా ఆడింది ట .ఈ సినిమా మొత్తం కథ ఒక రోజు రాత్రి జరిగిన ఎపిసోడ్ నాకూ సినిమా చూసిన గుర్తు లేదు. మా చిన్నతనం లో గ్రాంఫోన్ వుండేది. మా పెద్ద నాన్న గారు ఎక్కువగా సంగీతం వయోలిన్ అలాంటి రికార్డులు పెట్టే వారు . మా అత్తయ్య గారి ఇంట్లో మాత్రం తెలుగు హిందీ సినిమా పాటలు పెట్టే వాళ్ళు ఆరోజుల్లో మేము విన్న హిందీ పాటలు అంటే తెలుగులో, పందిట్లో పెళ్లి అవుతున్నది, ఇంకా మండోలే మేరీ తన్ డో లే అనే పాటలు. కాలేజ్ కి వచ్చాక రేడియోలో కొత్త పాటలు వినటం తెలుసుకున్నాము. బినకా గీత మాలా వినటం ఆ రోజుల్లో ఒక క్రేజ్ . అపుడే కొత్తగా రికార్డు ప్లేయర్ వచ్చింది.. అందులో మా వారు ఎక్కువగా పాత పాటలు పెడ్తూ వుండే వారు. తినగ తినగ వేము తియ్యగా ఉండు అన్నట్లు అలా పాటలు వింటూ ఉంటే అవీ బాగున్నట్లు అనిపించేది . ఇంకా ఇన్నాళ్లు బ్రతికి ఉన్నాయి అంటే వాటిల్లో ఏదో మాధుర్యం ఉండబట్టే కదా అనుకుంటూ ఉంటాను. రాజ్ కపూర్ సినిమాలు ఆవారా, శ్రీ 420 జి ష్ దేశ్ మే గంగా, సమాజానికి ఏదో సందేశం ఇచ్చే సినిమాలు , అంతే కాకుండా అణిముత్యాలు లాంటి పాటలు, ఇప్పటికీ ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాము. రాజ్ కపూర్ కల్ ఆజ్ ఔర్ కల్ కూడా జనరేషన్ గ్యాప్ మీద తీసిన సినిమా ఎందుకో పెద్దగా హిట్ కాలేదు. ఏదో సినిమాలు రివ్యూ లాగా ఏమిటో ఈ గోల అనుకోకుండా ఇప్పుడు తెలుగు రానివాళ్ళు పాడే తెలుగు పాటలు, చెవులు దద్దరిల్లే సౌండ్ తో అర్థం కూడా కానీ పాటలు వినే కంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ లాగా ఈ అణిముత్యాలు గురించి తెలుసుకుంటే ఎప్పుడైనా వినవచ్చు. బైజు బావర లో మన్ తర్పాట్ హరిదర్శన్ కో , ఓ దునియా కే ర కె వాలే రెండూ చాలా బాగుంటాయి. అలాగే రఫీ గారి పాత పాట కోహినూర్ లో మధుబన్ మే రాధికా కూడా చాలా మంచి పాట. మా చిన్నతనం లో అందరము కలిస్తే,, ఫ్రెండ్స్ అయినా, బంధువులు కలిసినా కబుర్లు, పాటలు పాడుకోవడం కొత్త పాటలు నేర్చుకోవడం అలా కాలక్షేపం చేయడం వుండేది. ఇపుడు అయితే అందరూ ఎవరి సెల్ ఫోన్ లో వాళ్ళు అర్థం లేని రీల్స్ చూస్తూ ఉంటారు. ఇంక ఉదయాన్నే వచ్చే వాట్సాప్ మెసేజ్ లు వచ్చినవే వస్తూ ఉంటాయి. పాటిస్తారో లేదో తెలియదు కాని బోలెడు సూక్తులు పంపిస్తూ వుంటారు. డిలీట్ చేయడం కూడా చాలా కష్టం గా వున్నది. నాకు అయితే ఒక మంచి కాఫీ కప్ తో ఒక మంచి పాట వింటూ లేదా ఒక మంచి బుక్ చదవటం చాలా ఆనందం ఇస్తుంది. ఫేస్ బుక్ లో మొన్నే చూసాను. గురుదత్ గారి 100ఇయర్స్ అయింది అని . ఆయన సినిమాలు కూడా అన్ని మంచి సినిమాలు కానీ అంత విషాదం నేను భరించలేను. సాహెబ్ బీబీ ఔర్ గులామ్ అనే సినిమా చూసి ఒక పది రోజులు నిద్ర పోలేదు. చివరకి మా వారి చివాట్లు తో మన లోకానికి వచ్చాను. ఆయన సినిమా పాటలు బాగుంటాయి . మిస్టర్ అండ్ మిస్సెస్ 55 ఫన్నీ గా వుంటుంది. మేము కాలేజ్ లో చదువుకునే సమయంలో ఆయన సూయి సైడ్ చేసుకున్నారు. ఏమిటో మేము అందరం ఎంత బాధ పడ్డామో గుర్తు వస్తె ఎంత అమాయకమైన రోజులు అనుకుంటాను. అపురూప చిత్రాలు అందులో ఎన్నో మంచి పాటలు. ఆ కవులు ఎంత మధురంగా రాశారో అనిపిస్తుంది. ఇలా రాస్తూ పోతే ఎన్నో సినిమాలు, పాటలు వెన్నెల లో విహరించి నట్లే వుంటుంది. ఇదివరకు నాంపల్లి లో లత థియేటర్ లో, జమ్రుద్ థియేటర్ లో పాత సినిమాలు వచ్చేవి అలా చాలా చూశాము హిందీ లో కూడా చాలా పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఫన్నీగా నేను ఒక పది ఏళ్ళ క్రితం యు ఎస్ లో అలాంటి పాత సినిమాలు చూసాను ఆరోజుల్లో అక్కడ ఒక్క జీ టీ వీ నే వచ్చేది. పగలు వుదయం 11గంట లకు తప్పకుండా ఒక పాత సినిమా వచ్చేది. అవ్వన్నీ రాయను కానీ కవి ప్రదీప్ అనే కవి ఏ మేరే వతన్ కి లోగో పాట ఆయన వ్రాసిందే. ఆయన గొప్ప దేశ భక్తి గీతాలు వ్రాసారు. తేరే ద్వార ఖ డా భగవాన్, వామన అవతార్ అనే సినిమా లో , నాస్తిక్ అనే సినిమా ల్లో దే ఖ తేరే సంసార్ కి హాలత్ అనే పాట ఆ పాటలు వింటూ ఉంటే కళ్ళలో మనకు తెలియకుండానే నీళ్లు వస్తాయి. ఆయన పేరు టైప్ చేస్తే యూ ట్యూబ్ లో వెతికితే అవ్వన్నీ వినవచ్చు. ఆ పాటలు వింటే ప్రపంచము ఎంత మారి పోయింది అనిపిస్తుంది. ఈ పాటికే మీకు పాటలు వినాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు కొంచెము వింటారు అనుకుంటూ ఊ అంటారో ఊ హు అనుకుంటారో మీ అభిరుచి నేను మాత్రం మంచి కాఫీ కప్పు తో ఓల్డ్ ఈ స్ గోల్డ్ అంటాను. మరి గుడ్ నైట్. రేపు యింకో జీవిత చిత్రం తో. కవి ప్రదీప్ గారు సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉంటే ఆయనకు ఏ మేరే వతన్ కే లోగో రాయాలని ఐడియా వచ్చి ఒక సిగరెట్ షాపు దగ్గర పేపర్ అడిగితే అతను ఒక ఖాళీ పాకెట్ ఇస్తే దాని మీద పక్క వాడిని అడిగి పెన్ తీసుకుని వ్రాశారు ట 👍

 
 
 

Recent Posts

See All
నవలా పఠనం

పుస్తకం హస్త భూషణం అన్నారు. భూషణం లాగా ఊరికే పట్టుకొని తిరగటం కాకుండా చదివితే ఇంకా బాగుంటుంది. ఎపుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండే వాళ్ళని...

 
 
 
యాంటిక్స్

శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు...

 
 
 
చూపులు కలిసిన శుభ వేళ

వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో పెళ్ళి ఒక ప్రహసనం లాగా మారిపోయింది అయితే నేను ఈ రోజుల్లో పెళ్ళి గురించి చెప్పడం...

 
 
 

Comentários


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page