top of page
Search

నవలా పఠనం

  • murthydeviv
  • 3 hours ago
  • 3 min read

పుస్తకం హస్త భూషణం అన్నారు. భూషణం లాగా ఊరికే పట్టుకొని తిరగటం కాకుండా చదివితే ఇంకా బాగుంటుంది. ఎపుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండే వాళ్ళని ఇదివరకు పుస్తకాల పురుగు అనేవారు. నన్ను కూడా అలాగే అంటూ వుండేవారు. అసలా ఆ అలవాటు ఎలా వచ్చిందో తెలియదు కానీ మా రెండో అన్నయ్య క్లాసు పుస్తకంలో డిటెక్టివ్ నవలలు పెట్టుకుని చదువుతూ ఉండే వాడు. అలాగే నాకూ ఆ పుస్తకాలు చదవటం అలవాటయింది. వాటిల్లో డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు, గుర్తు ఉన్నారు. చండీ రాణి అని సీరియల్ లాగా బుక్స్ వచ్చేవి.ఈ మధ్య ఎక్కడో చదివాను ఆ నవలలు రాసింది, కొమ్మూరి సాంబశివ రావు గారు అని, కొమ్మూరి వేణుగోపాలరావు గారి కి బంధువులు ఏమో తెలియదు. ఆయన నవల హౌస్ సర్జన్ చదువుతుంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ లో తిరుగుతూ ఉన్నట్లు వుంటుంది. ఆయన ఒక కథ దీపావళి సంచికలో వచ్చిన కథ కూడా చాలా బాగుంటుంది, ఆయన నవల లు చాలా ఉన్నాయి. కాలేజ్ చదివే రోజుల్లో ప్రభ, పత్రికలో వచ్చే సీరియల్స్ కోసం ఒక క్రేజ్ వుండేది. కాలేజ్ నుండి రాగానే వీక్లీ వచ్చిందా అంటూ హడావిడి గా ఆ సీరియల్స్ చదవటం మర్నాడు కాలేజీ లో వాటి గురించి డిస్కషన్. ఇప్పటికీ కృష్ణ వేణి , మాధవ్, బలిపీఠము లోని భాస్కర్ అరుణ , సెక్రటరీ లో రాజశేఖర్ అలా గుర్తు ఉండి పోయారు. చక్ర భ్రమణం నవల కు ఫస్ట్ ప్రైజ్ వచ్చినా ఆ ఏడాది మూడవ బహుమానం వచ్చిన జీవన కలశము అనే నవల లో ఎక్కువ సామాజిక స్పృహ ఉన్నట్లు అనిపిస్తుంది.ఆ నవల కోసం ఎన్నో సార్లు ట్రై చేశాను కానీ దొరకలేదు. సెక్రటరీ లో రాజశేఖర్ ఆరోజుల్లో కాలేజ్ అమ్మాయిలకు ఒక క్రేజ్. హైదరాబాద్లో ఎక్కడో కలుస్తామేమో అన్నంత ఊహ వుండేది. కొన్నేళ్లు అయ్యాక కానీ అంత బిజినెస్ చేసే వాళ్ళు ఫ్యామిలీ కి అంత టైమ్ స్పేర్ చేయలేరని అర్థం అయింది. మీనా రెండు సార్లు సినిమా గా వచ్చింది. మీనా యువ మాస పత్రికలో వచ్చింది. అప్పటికే నేను పెళ్ళి అయి పంజాబ్ వెళ్ళి పోయాము . ఆరోజుల్లో ఈ తెలుగు బుక్స్ అక్కడ దొరికేవి కావు. అందర్నీ వాళ్ళు మద్రాసి అని పిలిచే వాళ్ళు. అసలు ఆంధ్రా అనే రాష్ట్రం ఉందనే తెలియదు . అక్కడే చాలా రోజులు నుండీ వున్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ గారి భార్య అన్నీ వారపత్రికలు యువ జ్యోతి తెప్పించే వారు. వీక్లీ వన్స్ వాళ్ళింట్లో కలిసి బుక్స్ షేర్ చేసుకొనే వాళ్ళం మీనా సీరియల్ కి అంత క్రేజ్ వుండేది. ఒక్క వారం వెళ్ళటానికి వీలు కాకపోతే చాలా బాధ కలిగేది. ఇపుడు తలచుకుంటే నవ్వు వస్తుంది. సులోచనారాణి గారి నవల లు అన్నీ మొదలు పెట్టాము అంటే చివరి దాకా ఆపకుండా చదివించే కథనం తో పరుగులు పెడతాయి. కీర్తి కిరీటాలు, జీవన తరంగాలు, అగ్ని పూలు అన్నీ అలాంటి పుస్తకాలు అన్నింటి లోకి మీనా కొంచెం నేచురల్ గా ఉంటుంది జీవన తరంగాలు లో చందూ లాంటి అబ్బాయిలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యారేమో అనిపిస్తుంది. ఆ సినిమాలు అన్నీ టికెట్స్ బుక్ చేయించుకుని ఫస్ట్ వీక్ లోనే చూసేంత క్రేజ్ వుండేది. మా వారు రెండు సినిమాలు చూసి ఇంక నాకు మాత్రం టికెట్ బుక్ చేయకు అని చెప్పారు. ఆవిడ యువ దీపావళి సంచికలో ఐ లవ్ యూ అనే కథ అన్ నాచురల్ గా ఉన్నా చివరి దాకా ఆపకుండా చదివించే కథనం తో బాగుంటుంది. రంగనాయకమ్మ గారి బుక్స్ కూడా ఆ రోజుల్లో ఒక క్రేజ్ అవిడ నవల లు అన్నీ కృష్ణవేణి ప్రభ లో వచ్చిందేమో అనుకుంటాను నేను తర్వాత నవల గా చదివాను కలం స్నేహం అపుడు వుండేవి. ఇపుడు ఇంటర్నెట్, ఫేస్ బుక్ లాగా మనిషి ఎపుడూ సంఘజీవి చుట్టూ ఉండే బంధాలు అనురాగాలు, ద్వేషాలు వాటి వలన కలిగే సుఖ దుఃఖాలు అన్నీ కావాలి. ఆవిడ పల్లెటూరు అందమైన ప్రేమ కథ. పేక మేడలు ఎప్పటికీ నిజమైన నవల, బలిపీఠం నవల లో అప్పట్లో భాస్కర్ అరుణ పాత్ర లు కొత్త కావచ్చు ఇప్పుడు సర్వ సాధారణం అయినాయి. కళ ఎందుకు, రచయిత్రి, కూలిన గోడలు, చదువుకున్న కమల స్వీట్ హోమ్ అన్నీ అభ్యుదయ భావాలు తో నిండి వుంటాయి. అయితే ఆ రోజుల్లో గృహిణి లు ఎక్కువగా వుండేవారు. ఈ రోజుల్లో స్త్రీలు బాగా చదువుకుని చాలా రంగాల్లో మగ వారితో సమానంగా ఉద్యోగాలు, బిజినెస్ చేస్తూ అన్నీ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. కానీ జాయింట్ ఫ్యామిలీ లో అడ్జస్ట్ కాలేక పోతున్నారు. భార్య భర్త ల్లో అవగాహన తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారు. అలంకరణ లో ఉన్న ఆధునికత వాళ్ళ భావాల్లో కనిపించడం లేదు. సాటి మనుషులు తో ప్రేమ గా మెలగటం, ఆదరించటం మ ర చి పోతున్నారు. ఈవిషయంలో మన తల్లిదండ్రులు నాయనమ్మ ల కాలం లో ఆడవాళ్లు చదువు లేక పోయినా ఉమ్మడి కుటుంబంలో ఆప్యాయంగా వ్యవహరించటం, ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహించటం చేసేవారు. అలాంటి గృహిణులు ఇప్పుడు ఉన్నారా అంటే అనుమానమే. సమాజం లో మార్పులు అంగీకరించాల్సిందే, కానీ పాత తరం లోని మంచి నీ గుర్తించాలి, నేర్చుకోవాలి, నాది అనే స్వార్థం తప్ప మనది అనే విశాల హృదయం లేకుండా పోతున్నది. రంగనాయకమ్మ గారి నవలలు ఇప్పటికీ అన్ని దొరుకుతున్నాయి. ఇదెక్కడి న్యాయం కూడా సినిమా గా వచ్చింది. కోడూరి కౌసల్య దేవి గారి చక్ర భ్రమణం సినిమా గా వచ్చింది సావిత్రి గారి నటన మంచి పాటలు తో ఎప్పటికీ మంచి సినిమా గా నిలిచి పుస్తకం మరచిపోయే టట్లు చేసింది. ఆవిడ నవలలు శంఖు తీర్థం, శాంతి నికేతన్ కొన్ని నవలలు చదివాను అన్నీ గుర్తు లేవు . అసలు తెలుగు వాళ్ళ కు నవలలు చదవటం అలవాటు చేసిన శరత్ బాబు, టాగూర్, ఛటర్జీ గారు వాళ్లను మర్చిపోతే ఎలా అవ్వన్నీ ఇంకొక సారి. మేము హైదరాబాద్ వచ్చాక ఏ ఇల్లు మారినా ఆ పుస్తకాలు ప్యాక్ చేసే వాళ్ళు ఎవరు చదువుతా ర మ్మ ఇన్ని పుస్తకాలు అని అడుగుతారు . అందుకే నేను ఏ బుక్ మొదలు పెట్టినా ఆరోజు డేట్ వేసి పూర్తి చేసిన డేట్ కూడా వేస్తాను . కానీ కొన్ని పుస్తకాలు మరలా చదవాలని అనిపిస్తుంది అలాంటి వాటిల్లో అమరావతి కథలు, నాహం కర్తా హరి కర్తా మన ఇల వేలుపు రమణ గారు ఇంకా కొన్ని గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
అపురూప చిత్రాలు 2

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు...

 
 
 
యాంటిక్స్

శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు...

 
 
 
చూపులు కలిసిన శుభ వేళ

వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో పెళ్ళి ఒక ప్రహసనం లాగా మారిపోయింది అయితే నేను ఈ రోజుల్లో పెళ్ళి గురించి చెప్పడం...

 
 
 

Commentaires


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page