top of page
Search

యాంటిక్స్

  • murthydeviv
  • Jul 19
  • 2 min read

శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు ఇచ్చిందిరా అంటూ నిర్మలమ్మ గారి దీర్ఘం హై లైట్. అలాంటి ప్రేమలు మనలో చాలామందికి వుంటాయి. నార్త్ ఇండియన్స్ దీపావళి కి అటక లు అవీ అన్నీ శుభ్రం చేస్తారు. నేను నార్త్ ఇండియాలో ఉన్నపుడు వాళ్ళ ఆ అలవాటు చూశాను. మనం కూడా అపుడు అపుడు అలా స్టోర్ రూమ్ లు లేకపోతే అటక లు సర్దుతూ వుంటాం. ఈరోజు అటక సర్దండి అని మా క్వీన్స్ కి చెప్పాను. అంతా సామాన్లు తీసి పెట్టీ ఎదో మట్టి గిన్నె ఉందమ్మా అన్నారు అది మా అత్తగారి రాచిప్ప. ఆవిడ వున్న నా ళ్ళు స్టోర్ రూమ్ సర్దుతుంటే హాల్లో నే కూర్చుని అవిడ వస్తువులు అన్నీ చూసుకుని వాటి చరిత్రలు, ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుని మరలా పైకి పెట్టించే వారు . అడ్డేడు తప్పలా మానేడు తప్పాల కంచు గిన్నె, పప్పు గిన్నె ఇలా ఏవో పేర్లు వుండేవి. వెండి పూలు వేసిన పీట ఇలాంటి వెన్నో, ఆవిడ కింద కూర్చుని భోజనం

  1. చేసిన్నాళ్ళు కంచు చెంబులో నే మంచినీళ్ళు తాగే వారు. ఏదయినా పండుగ లు వాటికి అందరూ బంధువులు వచ్చినప్పుడు ఆ మానేడు తప్పాల వాటిలో అన్నం వండేవారు. ఎపుడైనా త్వరగా పని తెములుతుందని పిల్లలు కు కలిపి ముద్దలు వేస్తే మానే డు బియ్యం అన్నం ఖర్చు అయ్యేది. మా అబ్బాయి యాంటిక్ షాపు లో చూసాడేమో ఆ గిన్నె లు అన్నీ వరండా లో షోకు గా పెట్టించాడు. ఎంత ఆవకాయ పెట్టేవారో తెలియదు కానీ మొత్తం నాలుగు పెద్ద జాడీలు రెండు మా అత్తగారివి రెండు మా అమ్మ గారు ఇచ్చినవి రెండు, ప్రస్తుతం నేను కూడా మా అత్త గారిలాగా ఆ జాడి లు చూసి మరలా పైకి చేర్పించడం.. అలాంటి సామాను ఏవో చాలా వుంటాయి ఆ వస్తువుల వెనక ఎవో జ్ఞాపకాలు. ఆ మధ్య పాండిచ్చేరి వెళ్ళాము. మేము ఉన్న రిసార్ట్ నుండి సిటీ లో వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ అంతా పాత తలుపులు ద్వార బంధాలు పెట్టీ ఉన్నాయి. అవి అన్నీ ఫ్రెంచ్ వారి ఇళ్ళు పాత పడి పోతే వీళ్లు తెచ్చి అమ్ముతున్నారు ఇంకా బాగున్న ఇళ్ళు కొంచెము రిపేర్ చేసి హోటల్ గా నడుపుతున్నారు మా పిల్లలు కూడా యాంటిక్ షాపులో బోలెడు ధర పెట్టీ ఒక కావిడి పెట్టె కొన్నారు. మా వారు కూడా ఏ ఊరు వెళ్ళినా పిల్లలు కు ఏదో బొమ్మలు తెచ్చే వారు. చిన్న కెమెరాలు, వీడియో గేమ్స్ ఇంకా చిన్న పియానో లు . మొన్న ఎపుడో నేను అలమర సర్దుతూ ఉంటే మా మనవరాలు వచ్చి అవి అన్నీ చూసి నేను అలా దాచినందుకు బోలెడు సంతోషించింది. మోడర్న్ పిల్లలు కదా వెంటనే గూగుల్ లో చూసి వాటి ధర లు చెప్పింది. ఇలా ఈ వస్తువులు కు వాల్యూ వుంటుందని మనకు తెలియదు కదా. తర్వాత జ్ఞానం కలిగింది మరి ఇలాంటి వస్తువులు తోటే కదా మ్యూజియం వుండేది అనుకున్నాను. ఇంక కొన్నాళ్ళు కి టేప్ రికార్డర్ లు వీడియో లుకూడా ఇలా అయిపోతాయి. అనుకున్నాను అయ్యో పాత ట్రాన్సిస్టర్ లు రేడియో లు రిపేర్ కి ఇచ్చి అలాగే వదిలేశాము కదా అనుకున్నాను. అయితే మన జనరేషన్ వాళ్ళం ఆ వస్తువు తో మన అనుబంధం మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాము. వాటికి వాల్యూ గురించి ఆలోచించడం తెలియదు. వాల్యూ ఉండ బట్టే ఇన్ని యాంటిక్స్ షాపులు. వచ్చాయి. ఇంకా కొన్నాళ్ళు పోతే నేను కూడా నిర్మలమ్మ లాగా, మా అత్త గారిలాగా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన జాడీలే అంటానేమో. మీ ఇంట్లో కూడా అలాంటి గిన్నెలు ఉన్నాయా ఉంటే బాగా తోమించి షోకు గా పెట్టండి.ఇంతకీ ఆ రాచిప్ప గురించి చెప్పలేదు కదా. హైదరాబాద్ వచ్చాక ఆ రాచిప్ప వాడలేదు కానీ, పల్లెటూరు లో ఉండగా ఆవిడ పొయ్యి మీద ఆ రాచిప్ప లో పప్పు, పులుసు, ఇంకా గోంగూర పులుసు స్పెషల్ గా చేసేవారు.. నిజం చెప్పాలంటే అందులో వండితే చాలా రుచిగా ఉంటుంది. గ్యాస్ మీద వండలేరు అనుకుంటాను. కానీ ఈ మధ్య ఈ రాచిప్ప లు కుండలు కనిపిస్తూ వున్నాయి. స్లో కుకింగ్ మరలా ఫ్యాషన్ అయింది కదా. కుండలు ఈ రాచిప్ప లు గ్యాస్ మీద పెట్టచ్చో లేదో నాకు తెలియదు. అదీ రాచిప్ప కధ గుడ్ నైట్.

 
 
 

Recent Posts

See All
నవలా పఠనం

పుస్తకం హస్త భూషణం అన్నారు. భూషణం లాగా ఊరికే పట్టుకొని తిరగటం కాకుండా చదివితే ఇంకా బాగుంటుంది. ఎపుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండే వాళ్ళని...

 
 
 
అపురూప చిత్రాలు 2

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు...

 
 
 
చూపులు కలిసిన శుభ వేళ

వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో పెళ్ళి ఒక ప్రహసనం లాగా మారిపోయింది అయితే నేను ఈ రోజుల్లో పెళ్ళి గురించి చెప్పడం...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page