top of page
Search

సీ రామచంద్ర గారి మధుర గీతాలు .

murthydeviv
5 days ago
3 min read

ఈ మధ్య సినిమా పాటలు గురించి రాసి చాలా రోజులు అయింది. ఈ రోజు ఏదో పుస్తకం కోసం బీరువా లో వెతుకుతూ ఉంటే రమణ గారి సినీ రమణీయం బుక్ కనిపించింది. రమణ గారి బుక్ కనిపిస్తే చూడ కుండా ఎలా అనుకుంటూ తెరిచాను

సీ రామచంద్ర గారి గురించి ఆర్టికల్ కనిపించింది. మొదటి వాక్యమే చదువుతూనే ఆహా అనుకుంటూ మొత్తం చదివేసాను ఆయన మాటల్లో లలిత సంగీత ప్రియులు ఉదయం లేస్తూనే శ్రీరామ బదులు ఆయన పేరు అరచేతిలో చుట్టుకుంటారుట.

లలిత క్రమం లో స్వరా లను అమర్చి హాయి గొలిపే వరుసలతో వళ్లు పులక రింప చేస్తారుట. రాగాలకు రాగాలకు పెళ్లిళ్లు చేసి మధుర స్వర వరుసలునూ, పరవశింప చేయటం ఆయన హాబీ ట.


నేను ముందే చెప్పిన ట్లు పాటలు వినటం తప్పితే ఆ మ్యూజిక్ ఎవరు చేసారు అనే జ్ఞానం చిన్నప్పుడు అసలు లేదు.

ఈ వ్యాసం చదివాక నవ రంగ్ కీ శాంతరామ్ గారి స్త్రీ పిక్చర్ కీ ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసింది

నవరంగ్ లో పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. స్త్రీ లో కూడా రెండు నాకు ఇష్టమైన పాటలు వున్నాయి.

శాంతారా మ్ గారి జనక్ జనక్ పాయల్ బాజే కీ వసంత్ దేశాయ్ అని విన్న గుర్తు. అసలు శాంతా రామ్ గారి సినిమా అంటేనే నాకు చాలా ఇష్టం.

నవరంగ్ లో అన్నీ పాటలు ఎన్న తగినవే అయినా నాకు మాత్రం తూ మేరీ అంటూ హీరో ఊహల్లో తేలిపోతూ

ఉంటే ఆశా భో న్సలే గారు పాడిన పాట సుతి మెత్తగా చాలా మధురం గా వుంటుంది.


ఇంక హోలీ పాట ఎంత హడావిడి గా వుంటుంది అంటే ఎప్పుడు హోలీ పండగ నాడు ఆ పాట వింటాను.

ఆ సినిమాలో అన్నీ మంచి మ్యూజిక్ తో వున్న పాటలే. ఇంక స్త్రీ సినిమాలో మూడు పాటలు నాకు చాలా నచ్చుతాయి .

రమణ గారు చెప్పినట్లు లలితమైన పాటలు ఓ నిర్దయే ప్రీతం, కౌనహో , తుమ్ కౌన్ హోం , ఆజ్ మధు వా థా స్ డో లే

మూడు ఆణిముత్యాల లాంటి పాటలు .


ఇంత లలితమైన పాటలు చేసిన రామచంద్ర గారు ఈ నా మీనా డీ కా అనే పాట చేశారు అంటే నమ్మటం కొంచెం కష్టమే

భగవాన్ సినిమా అల్బేలా డోర్ దర్శన్ వచ్చిన కొత్తలో టీవీ లో వచ్చింది అందులో పాటలు సరదాగా ఉంటాయి

హీరో భగవాన్ గీత బాలి అనుకుంటా హీరోయిన్ అందులో పాటలు హుషారు గా వుంటాయి.

ఇదే సినిమా లో లాలీ పాట ధీరే సే అజారే అనే లాలీ పాట కూడా చాలా మధురం గా వుంటుంది. ఒక వైయలెన్ తో బంగారం తీగ లాంటి కంఠం తో మ్యూజిక్ లో మ్యాజిక్ అని రమణ గారి వాక్యం ..

ఇదే వరస లో తెలుగు లో కూడా ఒక లాలీ పాట వున్నట్లు గుర్తు .


కితనా హసీన్ ఏ మౌసమ్ అనే పాట ఎప్పుడూ వి నే ఇష్టమైన పాట . ఈ రోజే తెలిసింది ఆ పాట లతా గారు రామచంద్ర గారు పాడారుట. ఆయన పాటలు పాడుతారు అ ని కూడా ఈ రోజే తెల్సింది.


అనా ర్కలి సినిమా కు కూడా రామచంద్ర గారు మ్యూజిక్ చేసారుట. అ సినిమా లో పాటలు అన్నీ ఇప్పటికీ వింటూ ఉంటాము. ఏ జిందగీ ఉసికి హై , హేమంత్ లతా జాగ్ దర్ద్ ఇవీ కొంచెం మనకు తెల్సిన సినిమాలు.


మరీ పాత సినిమా లో యాస్మీన్ ట బే చైన్ నజర్ బేతాబ్ జిగర్ అంటూ తలత్ గారి పాట ఏ రోజే విన్నాను ఆయన పాట అంటేనే మల్లెపూవు లాగా సుతి మెత్తగా వుంటుంది.

ఆయన తీసిన సినిమాలు గురించి కూడా రాశా రు .సీఎంసీ నా కీ బాబ్లూ ట అందులో తూ క్యా జానే తుమారి యాద్ మే హామ్ కితనా రోయే లతా గారి పాట వుంది ట


ఇలా రాస్తే ఏన్నో ఆ పాత మధురాలు వుంటాయి. అన్నీ యూ ట్యూబ్ లో వెతికి వినాలి..

అన్నట్లు లాస్ట్ ఇయర్ లో సూపర్ స్టార్ సింగర్ ప్రోగ్రామ్ లో ఇద్దరు చిన్న పిల్లలు అప్లం బప్లం అంటూ ఒక ఫాస్ట్ సాంగ్ చక్కగా పాడారు. ఆ పాట అజాద్ సినిమాలో ట .ఈ రోజే విన్నాను. సినిమా లో కూడా ఇద్దరూ చిన్న పిల్లలు క్లాసిక ల్

డాన్స్ వేస్తూ పాడారు. చాలా బాగుంది.


మీకు కూడా పాత పాట లు వినటం ఇష్టం ఉంటే వినండి మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దగ్గర గా వున్న గుడిలో

రోజూ దేఖ్ తేరే సంసార్ కీ హల త్ అనే పాట వినిపించేది. ఆ పాట నాస్తిక్ అనే సినిమా లో ట.


ఇంతకీ రామచంద్ర గారికి కుడి భుజం తబలా వాయించే లాల్. అయితే ఎడమ భుజం వేణువు మధురంగా పలికించే సుమంత్ రాజ్ ట

అలా ఇంకొక సారి ఇంకా ఎవరైనా వీనుల విందు గా సంగీతం వినిపించే వారి గురించి తెలుసుకుందాం


శుభరాత్రి

 
 
 

Recent Posts

See All
చిలకమ్మ చెప్పింది

***** *చిలకమ్మ చెప్పింది* ============== (జ్ఞాపకాల పందిరి) (నేను రాసిన ఈ కథ షార్ వాణి అనే మాస పత్రికలో 2026 అక్టోబర్ నెలలో ప్రచురితమైనది) రచన :: బుద్ధవరపు కామేశ్వరరా

 
 
 
ముచ్చట్లు

కబుర్లు ఇంకా దసరా నవరాత్రి పూజలు , బడలి క తీర కుండానే దీపావళి పరిగెత్తి వస్తోంది. మా ఇంటి చుట్టు ప్రక్కల వున్న షాపు లు లైట్స్ తో ధ గ ధగా మెరిసిపోతున్నాయి. మా అబ్బాయి 90 91 సంవత్సరాల లో

 
 
 
కామాక్షి అమ్మ

శ్రీ కంచి కామాక్షి: మోక్షపురి నడుమ "కామ" ఎందుకు ఉంది? కామకోటం, కామాక్షి మరియు కోరికల రూపాంతరం కాంచీపురం సాంప్రదాయకంగా సప్త మోక్షపురీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర క్షేత్ర భూగోళం నడుమ కామాక్షి ద

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page