top of page
Search

ముచ్చట్లు

murthydeviv
3 days ago
3 min read

కబుర్లు

ఇంకా దసరా నవరాత్రి పూజలు , బడలి క తీర కుండానే దీపావళి పరిగెత్తి వస్తోంది.


మా ఇంటి చుట్టు ప్రక్కల వున్న షాపు లు లైట్స్ తో ధ గ ధగా మెరిసిపోతున్నాయి.

మా అబ్బాయి 90 91 సంవత్సరాల లో ఎన్ని సార్లు జూబ్లిహిల్స్ కి తెచ్చి ఇళ్ళు చూపించినా అబ్బా ఈ కొండల్లో ఎవరు వుంటారా బాబూ అంతా నిర్మానుష్యం అంటూ వద్దు అనేదాన్ని.

ఇప్పుడు బయటికి వెళ్తే ఏ అబిడ్స్ సుల్తాన్ బజార్ లాగే షాపు లు , రెస్టారెంట్స్ ఒకటే ట్రాఫిక్ .

ఇళ్ల మధ్యలో నే చిన్న చిన్ కాఫీ షాపులు ఈ మధ్య మా ఇంటి పక్కనే ఒక కాఫీ షాపు పి కెట్ బాల్ ఆట తో c చిన్న ప్లే గ్రౌండ్ వచ్చాయి ..

రాత్రి 11 గంటల దాకా ఒకటే మ్యూజిక్ టపా టపా బాల్ శబ్దాలు

రోజు కి ఒక 20 బాల్స్ ఆయన మా కాంపౌండ్ లో పడతాయి .

చిన్న బాల్స్ కాబట్టి గొడవలేదు

మా పేట్ బేబీస్ అవి నోట్లో కర్చు కు ని ఆడుతూ ఉంటాయి .

ఇలా ఇళ్ళ మధ్యలో పర్మిషన్ ఎలా ఇస్తారో తెలియదు.


ఇంక ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో మా చీరెలు కొనుక్కోండి అంటూ హోరేత్తి పోయే షాపుల వాళ్ళు.

ఈ గోల ఇలా ఉండగా

దసరా కే గా ఇళ్లు క్లీన్ చేసాము అంటూ ఊరుకోలేము. దీపావళి లక్ష్మీ పూజ అంటూ పని వాళ్ళ వెంబడి పడాలి.


హిందూ పేపర్ వచ్చే రోజుల్లో సండే ఏవో ఆర్టికల్స్ వచ్చేవి. చిన్నప్పుడు నాన్నగారు

ఇంగ్లీష్ బాగా వస్తుంది అంటూ చదివించే వారు. ఆరోజుల్లో తిట్టుకుంటూ చదివినా

ప్రతీ ఆదివారం వచ్చే ఆర్టికల్స్ చదవటం అలవాటు అయిపోయింది.


అలా చదివిన ఒక ఆర్టికల్ లో దీపావళి కీ మర్వాడీ వాళ్ళు ఇంట్లో అటక లు, ఇంట్లో మూ ల మూలలు శుభ్రమ్ చేస్తారుట. ఎందుకూ

అంటే దీప లక్ష్మీకి స్వాగతం పలకాలి అని.


కొంచెం బద్ద కిద్దా మన్నా ఆ ఆర్టికల్ గుర్తు వస్తుంది. అలా ఇల్లు, అటక లు సామాన్లు అన్నీ శుభ్రం చేయించి దీప లక్ష్మ్మి కీ స్వాగతం చెప్పటం.తో మొదలు అవుతుంది.


మా అమ్మాయి అయితే ఇళ్లు కడిగితే గాని ఊరుకోదు.ఇల్లు కడగగానే నాకు మా ఆమ్మ, అత్తగారు గుర్తు వస్తారు. ఇద్దరూ కొంచెం పెద్ద వయసు వచ్చేదాకా పిండి కలిపి సన్నటి గుడ్డ వేలికి చుట్టుకుని రకరకా లుగా ముగ్గులు పెట్టే వారు.


పూలు కట్టటం నేర్చుకున్నాను కానీ ఈ ముగ్గులు టెక్నిక్ మాత్రం రాలేదు. చాక్ పీస్ తో

పద్మాలు వేసి ఏవో మనం నేర్చుకున్న బోటనీ లో పూల తీగలు వేసి అహా అనుకోవడం .


మా ఆమ్మ కజ్జికాయలు, కారం పూస చేస్తే , మా అత్తగారు బూందీ లడ్డు చేయటం లో ఎక్సపెర్ట్. దీపావళి వెళ్లిన ఒక నెల రోజుల దాకా యింటికి ఎవరు వచ్చినా అవే స్నాక్స్.

అటు మా అన్నయ్యలు ,ఇటు మావారు ఒక పది రోజుల తర్వాత ఇంక తినలేము వేరే ఏమైన.చేయండి అన్నదా కా .


నాకు మాత్రం అత్త గారి దగ్గర నుండి

బూందీ లడ్డు చేయటం ఎంత ప్రయత్నంచినా లడ్డు మాత్రం రాదు , ఇంక ఇప్పుడు

కజ్జికాయలు అలవాటుగా చేసి , కాస్త బూందీ చేసి స్వర్గం లో వున్న మా అత్తగారిని, అమ్మ ని తృప్తి పరుస్తాను.


అసలు ఇప్పుడు స్వీట్స్ తిన కూడదు అంటూ చాలా మంది డ్రై ఫ్రూట్స్ పంచుతున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ లో కూడా పిస్తా, కాజూ ముందుగా ఖర్చు అయిపోతాయి.


బాదం , అక్రూట్ అలా మిగిలి పోతూ వుంటాయి. ఈ స్వీట్స్ పంచే అలవాటు

ఈ హైదరాబాద్ వచ్చినప్పటి నుండీ అలవాటు అయింది..


ఒక సారి మావారు ఫ్యాక్టరీ లో వాళ్లకు , కస్టమర్స్ కీ బ్యాంకు ల వాళ్ళు కీ అంటూ స్స్వీట్ పాకెట్స్ తెప్పించారు.. ఆ రోజుల్లో ఈ రాపిడో లు అవీ లేవు కదా , చాలా మటుకు ఆఫీసు బాయ్స్ తో పంపారు. దీపావళి వెళ్లినా ఇంకా కొన్ని డబ్బాలు మిగిలి పోయాయి.


పిల్లలు స్కూల్లో టీచర్స్ కీ కూడా ఇచ్చారు. మిగిలాయి కదా అని ఇంట్లో రెండు మూడు రోజులు వరసగా అందరమూ తింటూ ఉంటే , మా ఆత్త గారు మాత్రం మాకు మేము ఎంత దుబారా చేస్తున్నామో చెప్పే వారు.


నిన్న నే మా కోడలు, అమ్మాయిలు దీపావళి గిఫ్ట్స్ గా వాన్ లవినో ట అక్కడ నుంచీ

చాకొలేట్స్ తెచ్చారు. మా మనవరాలు దీపావళి గ్రీటింగ్స్ తెలుగు లో రాయనా అని అడిగింది. అహా ఏమీ నా భాగ్యం అనుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అని రాయాలి అని చెప్పాను.


సరే పూజ అయ్యాక ఒక పాకెట్ తీసి చూస్తే చక్కగా దీపావళి శుభాకాంక్షలు అంటూ ఇంగ్లీష్ లో రాసింది మా సివంగి. అలా అన మాట మా తెలుగు యొక్క సింగారం .

పండుగ అంటే ఓపిక ఉన్ననాళ్లు చేయక తప్పదు కదా .

ఏమిటో బజార్ నుండి పండగకు. స్వీట్. కొనటం నచ్చదు


అవీ ఈ పూట ముచ్చట్లు

రేపు ఉదయం పూజ గది శుభ్రం చేయాలి. ఆ తర్వాత కజ్జి కాయలు , బూందీ చేసి పెద్దలను సంతృప్తి పర్చాలి



శుభ రాత్రి

 
 
 

Recent Posts

See All
చిలకమ్మ చెప్పింది

***** *చిలకమ్మ చెప్పింది* ============== (జ్ఞాపకాల పందిరి) (నేను రాసిన ఈ కథ షార్ వాణి అనే మాస పత్రికలో 2026 అక్టోబర్ నెలలో ప్రచురితమైనది) రచన :: బుద్ధవరపు కామేశ్వరరా

 
 
 
కామాక్షి అమ్మ

శ్రీ కంచి కామాక్షి: మోక్షపురి నడుమ "కామ" ఎందుకు ఉంది? కామకోటం, కామాక్షి మరియు కోరికల రూపాంతరం కాంచీపురం సాంప్రదాయకంగా సప్త మోక్షపురీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర క్షేత్ర భూగోళం నడుమ కామాక్షి ద

 
 
 
సీ రామచంద్ర గారి మధుర గీతాలు .

ఈ మధ్య సినిమా పాటలు గురించి రాసి చాలా రోజులు అయింది. ఈ రోజు ఏదో పుస్తకం కోసం బీరువా లో వెతుకుతూ ఉంటే రమణ గారి సినీ రమణీయం బుక్ కనిపించింది. రమణ గారి బుక్ కనిపిస్తే చూడ కుండా ఎలా అనుకుంటూ తెరి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page