top of page
Search

వరలక్ష్మి వ్రతము విశేషాలు

  • murthydeviv
  • 5 minutes ago
  • 2 min read

ఈ రోజు వరలక్ష్మి వ్రతము అనీ ఫేస్ బుక్ లో చాలామంది అమ్మవారి అలంకరణ , ప్రసాదాలు ఫోటోలు పెట్టారు .. అన్నీ చూడ ముచ్చట గా వున్నాయి..

ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మవారి విగ్రహలు, వెండి వీ, దొరుకుతున్నాయి. అందరూ అవే పెట్టి చీర కట్టి అలంకరణ చేస్తున్నారు.

మేము హైదరాబాద్ వచ్చిన కొత్త ల్లో మలక్ పేట లో వుండే వాళ్లము. ఆపుడు శ్రావణ శుక్రవారం చాలా హడావిడి ఉండేది.

చుట్టుపక్కల వాళ్ళు అందరూ అమ్మవారిని టెంకాయ కే కళ్ళు ముక్కు అమర్చి బిందె మీద , చెంబు మీద పెట్టి చీరే అదీ కట్టే వారు.ఒక్కోళ్ల ఇంట్లో ఒక్కక్క అలంకరణ చూడటనికి కనుల పండుగ గా ఉండేది..


చాలా మంది ఇళ్ళల్లో మగ వాళ్ళు కూడా శ్రద్ద గా అలంకరణ చేసే వారు. మా ఇంటి పక్కనే ఒక తాతగారు టెంకాయ కి

మైదా పిండిలో పసుపు కలిపి టెంకాయ కి రాసి చక్కగా కను ముక్కు చెవులు అమర్చే వారు .


బిందె మీద పెట్టి చీర కట్టి పాలవెల్లి తో రక రకాలుగా పూలు అలంకరించి , అమ్మవారు అక్కడే కూర్చుని వున్నట్లు ఉండేది. ఏ ఏడాది వ్రతము చేస్తున్నా ఆ తాత గారు , ఆ అమ్మ వారు గుర్తు వస్తారు.


అక్కడ అందరి ఇళ్ళల్లో అలాగే శ్రావణ మాసం హడావిడి ఉండేది . పేరంటం లు కూడా రాత్రి పది

గంటల వరకు సాగేవి.

మా అక్కయ్య గారింట్లో కూడా మా బావ గారు ఆ రోజు సెలవు పెట్టి పూజ అంతా శ్రద్దగా చేయించే వారు.


చిన్నప్పుడు మా అమ్మ గారింట్లో శ్రావణ శుక్రవారం నోము మా బామ్మ గారు చేయించే వారు కాదు. ఆ రోజు మాత్రం అందరం మా అత్తయ్య గారింటికి వెళ్ళేవారము.. మా అత్తయ్య కూడా అలాగే పెద్దగా బిందె అదీ పెట్టి చీర కట్టి

అమ్మవారిని అలంకరణ చేసేవారు .


హైదరాబాద్ వచ్చాక మా కజిన్ సిస్టర్ నాకు అలాగే అలంకరణ చేయటం నేర్పింది. చాలా రోజులు అలాగే చేసేదాన్ని,

ఇంక కొంచెం ఓపిక తగ్గిపోయాక నేను వెండి అమ్మవారినే పెట్టి అలంకరణ చేయటం మొదలు పెట్టాను.


ఇప్పుడు అయితే మన పిల్లల కి ఈ ఉద్యోగాలతో, హడావిడి కి అలా అలంకరణ ఈజీ గా వుంటుంది.

మా అత్త గారు తొమ్మిది రకాలు పిండివంటలు చేసి నైవేద్యం పెట్టటం అలవాటు చేసారు .


ఆవిడ కి ఆ వంట చేయటం చాలా సరదాగా ఉండేది . ఒక గంట లో చేసేవారు.. ఇప్పుడు మనము అపసోపాలు పడుతూ ఆమ్మో వచ్చే ఏడాది నుంచీ తగ్గించు కోవాలి అనుకోవటం , ఈ ఏడాది ఎలాగో చేసెయ్యటం గా వున్నది.


వ్రతము నాడు భోజనాలు అయితే ఒక ప్రహాసనమ్ గా ఉండేది. మా వారిని పూజ అయ్యేవరకు ఇంట్లో ఉండండి , ఆంటే

ఎందుకు మీ పూజలు వంటలు అయేటప్పటికి నేను వచ్చేస్తా అంటూ ఆఫీసు కి వెళ్ళి పోయే వారు.


ఇంక అక్కడి నుండీ రావాటానికి కనీసం ఒక పాతిక ఫోన్ కాల్స్ వెళ్ళేవి . నోము చేసుకుని కోపం తెచ్చుకోకూడదని అలాగే ఓపిక తెచ్చుకునేదాన్ని.


ఏదయినా పని ఉండి బయటికి వెళ్ళితే ఇంక రాత్రికే భోజనాలు.


మా అత్తగారు తను పట్టిన నోములన్నీ నా చేత చేయించే వారు. అలా ఎన్నో నోములు పట్టాను. ముప్పై మూడు పౌర్ణమి నోము కి ఉద్యపాన కి మా పిన్ని బాబాయి లను భోజనం కి పిలిచాను ఆ నోము కార్తీకమాసం పౌర్ణమి రోజున వుంటుంది బాబాయి గారు వున్నారు త్వరగా రండి అనీ ఎన్నో ప్రామిస్ ల తో గట్టు ఎక్కాను


నేను మా అమెరికా చెల్లెలు ఒకేసారి శంకర మఠం లో కై లాస గౌరీ నోము నోచుకున్నాము.

ఆనోము లో పసుపు కుంకుమలు పంచి పెట్టాలి . నోము పూర్తి అయిందాక మౌనం పాటించాలి .

తర్వాత భర్త కి నమస్కరించి మౌనం వదలాలి.


శారదాంబ సన్నిధి లో మంచిది అనీ అక్కడే నోము చేసాము. అంతా అయ్యాక మా మరిదిగారు వచ్చారు.

మా చెల్లెలు మౌనం వీడింది.


అపుడే సెల్ ఫోన్ కొత్తగా వచ్చింది మా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ఇదిగో బయలు దేరుతున్న అనీ సమాధానం.

మేము అక్కడ ఒక గంట వెయిట్ చేసి యింటికి వచ్చాము.


అప్పుడే ఈ మహానుభావుడు స్నానము చేసి రెడీ అవుతున్నారు .

ఆ తర్వాత మా వారితో కనెక్షన్ వున్న నోములు పట్టను అనే నిర్ణయం చేసుకున్నాను .

ఒక్క వినాయక చవితి మాత్రం తప్పకుండా పిల్లలు తో తర్వాత గ్రాండ్ చిల్డ్రన్ తో తప్పకుండా చేసుకునే వారు .


సాగేను జీవిత నావ అనే పాట లాగా ఎన్నో జ్ఞాపకాలు తో జీవితం సాగిపోతూ వుంటుంది.

ఎవరో మహానుభావుడు గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అన్నాడు.


నేను మాత్రం గతము తలచి మురిసే కన్నా మధురమే లేదు అంటాను.


వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు శుభ రాత్రి

















 
 
 

Recent Posts

See All
ఉయ్యాల ముచ్చట్లు

మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి

 
 
 
బిమల్ రాయ్

ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు.. అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు.. ఇండియా కు రష్యా

 
 
 
పెళ్లి వంటలు, గాడి పొయ్యి కథ

ఎక్కువగా ఉదయాన్నే మా అత్త కోడళ్లము డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగేటప్పుడు ఏవో కబుర్లు వస్తూ వుంటాయి. మాట ల్లో ఇప్పటి కేటరింగ్ భోజనాలు ముచ్చట్లు వస్తే నేను పూర్వం రోజుల్లో వంటలు గు

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page