బిమల్ రాయ్
- murthydeviv
- Aug 10
- 3 min read
Updated: Aug 12
ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు..
అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు..
ఇండియా కు రష్యా డిప్లొమాటిక్ రిలేషన్స్ సెలెబ్రేషన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ ఆరేంజ్ చేసారుట . వాళ్ళు ఆ పాట మాత్రం చాలా బాగా పాడారు.
మధుమతి సినిమా ఎప్పుడు చూశానో గుర్తు లేదు కాని పాటలు బాగా వింటూ వుంటాను. కొన్ని సినిమాలు పాటలు బాగున్నా సినిమాలు గొప్పగా వుండవు. ఈ సినిమా మాత్రం పాటలు , కధ సినిమా చాలా క్లాసిక్ గా వుంటాయి.
వైజయంతి మాల ని ఈ సినిమా లో చూడటానికి ఎంత అందం గా ఉంటుందో అమాయకమైన పల్లెటూరి పిల్ల లాగా అంతే అందము గా నటించింది.
ఈ సినిమా కి అరోజుల్లో తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయిట. ఆ ఏడాది లోనే వైజయంతి మాల కు సాధన సినిమా కు అవార్డు వచ్చిందిట .
బెస్ట్ మ్యూజిక్ ,సలీల్ చౌదరి , డైరెక్టర్ బిమల్ రాయ్ గారు , ఎడిటింగ్ హృషికేష్ ముఖర్జీ గారు , లతా గారికి అజారే పరదేశీ పాట కు వచ్చాయిట .
అప్పట్లో సినిమాలు చూడటం తప్పితే డైరెక్షన్ ఎవరు ఇలాంటి వి తెలిసేవి కాదు..
మా చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు కు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు , హిందీ సినిమాలు కు కన్సషన్ అనీ ఇచ్చి స్కూల్ నుంచీ టీచర్స్ తీసుకుని వెళ్ళే వారు .
అలా చూసిన సినిమాల్లో కొన్ని ఇంగ్లీష్ బైబిల్ స్టోరీస్ ఉండేవి. నాకు అలా చూసిన సినిమాల్లో కా బులివాలా , జంబో అనే ఏవో రెండో మూడో గుర్తు వున్నాయి.
కాబులి వాలా ఎందుకో చాలా రోజులు గుర్తు వున్నది . కొంచెం పెద్ద అయ్యాక ఠాగూర్ గారి నవలలు చదివినప్పుడు ఈ పుస్తకం కూడా కొని చదివాను.. ఇప్పటికీ ఆ కథ గుర్తు వస్తే బలరాజ్ సహాని యాక్షన్ ఆ సినిమా గుర్తు వస్తుంది.
ఇంతకీ ఆ సినిమా కూడా బిమల్ రాయ్ గారి డైరెక్షన్ ట.
దో బిఘా జమీన్ కధ ఇప్పటికీ జరుగుతున్న వాస్తవం లాగానే వుంటుంది . అందులో కూడా బలరాజ్ సహాని
హీరో, ఆ రెండు సినిమాలు చూసాక సహాని గారు నా ఫేవరెట్ అయ్యారు.
బిమల్ రాయ్ గారి సినిమాలు అన్నీ క్లాసిక్స్ పరిణీత, బిరాజ్ బహు , దేవదాస్, సుజాత, బందిని యాహుది పరాక్ యాహుది పేరు విన్నా కానీ సినిమా చూడ లేదు .
దేవదాస్ తెలుగు దేవదాస్ అంత బాగుండదు, పరిణీత ఈ మధ్య యూ ట్యూబ్ లో చూసాను. నవల లాగానే మార్పులు లేకుండా తీశారు. కొత్త పరిణీత ఈ రోజులు కు తగ్గట్టు కొంత మసాలా తో తీసినా మరీ కొత్త దేవుదాసు లాగా కథను పాడు చే సి నట్టు చేయ లేదు .
యాహుది పేరు విన్నా కానీ చూడ లేదు . ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఆంటే బందిని , సుజాత .
సుజాత ఎప్పటికీ మార్పు రాని సమాజం లోని సోషల్ ప్రాబ్లెమ్ , ఇప్పటికైనా ఆ సమస్య కు సొల్యూషన్ వుందో లేదో తెలియదు . చక్కటి సినిమా మంచి పాటలు ఎస్. డి బర్మన్ గారి సంగీతం.
బందిని సినిమా అయితే ఒక బెంగాలీ నవల ఆధారంగా తీసిన సినిమా , ఆ రైటర్ జైలు సూపరెండెంట్ గా పని చేసాడుట . ఫ్రీడమ్ రాక ముందు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అనుభవాలు, వాళ్ళ కుటుంబాల కష్టాలు బేస్ గా రాసిన కథ. జైలు సూపరెండెంట్ గా పని చేస్తూ వున్నప్పుడు కలిగిన అనుభవాలు తో రాసిన కథ.
సినిమా చూస్తూ ఉంటే ఆ కధ లో ఎంత గా లీనం అవుతాము ఆంటే నాకు అయితే రెండు మూడు రోజులు ఆ దుఃఖం నుండీ తేరుకొలేక పోయాను చివరి పాట బర్మన్ గారి గొంతులో వింటూ ఉంటే అనూహ్యమైన భావం కలుగుతుంది
నూతన్ అశోక్ కుమార్ కోసం వెళ్తుందా లేదా అనే ఉత్కంట తో మనము అంతే టెన్షన్ ఫీల్ అవుతాము.
చాలా గొప్ప సినిమా , చక్కటి పాటలు ఇంక బిమల్ రాయ్ గారి గురించి చెప్పేది ఏముంది 1963 లో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయిట బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, స్టోరీ, నూతన్ కి హీరోయిన్ గా
ఈ సినిమా, సుజాత సినిమాలో నూతన్ యాక్షన్ సూపర్బ్ అనిపిస్తుంది .
కొత్త సినిమాల్లో కూడా తల్లి గా వేసిన పాత్రలు మేరీ జంగ్ , ఖర్మా సినిమాల్లో కూడా తల్లిగా అద్భుతమైన నటన చేసింది ..
మధుమతి సినిమా ఫేస్ బుక్ లో కొన్ని పోస్టులు చూసాను.
ఇప్పుడు ఈ సినిమా ల్లో పాటలు వింటూ వుంటాను , కానీ ఈ సినిమాలు చూసే ఓపిక లేదు మధుమతి లో ఆ సస్పెన్సు భరించాలి ఆంటే కష్టం , ఇంక బందీనిలో ఆ కష్టాలు చూడ లేను .
కానీ గొప్ప సినిమాలు , ఇప్పటి లాగా అర్థం లేని కథల తో , చెత్త పాట లతో వినలేక , చూడ లేక అవస్థ పడక్కర్లేదు
బిమల్ రాయ్ గారు పద కొండు ఫిల్మ్ ఫేర్ అవార్డు లు, రెండు జాతీయ చలన చిత్ర అవార్డ్స్ , కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా అవార్డు వచ్చిందట.
ఈ సినిమాలు అన్నీ యూ ట్యూబ్ ల్లో వున్నాయి . చూడండి ముఖ్యం గా మధుమతి , బందిని, సుజాత చక్కటి సినిమాలు రాయ్ గారి కూతురు బాసు చటర్జీ గారి భార్య ట .
ఆయన కూడా మంచి సినిమాలు తీశారు , ఆ సినిమాలు గురించి ఇంకోసారి చెప్పుకుందాం
శుభరాత్రి
Comments