వంట ల కబుర్లు
- murthydeviv
- 2 hours ago
- 2 min read
ఈ మధ్య మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. ఉదయాన్నే కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్ళ గానే, అక్కడే వున్న కుక్ రాణి గారు అయ్యో నేను ఇస్తా కదండీ, అంటూ మర్యాద చేసింది. నా కాఫీ నేను కలుపుకుంటె కానీ నచ్చదు కదా అదే ఆవిడ తో చెప్పి మెల్లగా బయటికి వస్తుంటే, అమ్మాయి గారు వంట మిమ్మల్ని అడగమ్మన్నారు అంటూ ధీర్గం తీసింది.
ఎదో నాకు తోచిన ఆకుకూర పప్పు,కూర చెప్పి బయటికి నడిచాను.
ఆవిడ నా వేనకాల వస్తూ, కూరలో అవ పెట్టాలా రవ్వ పులుపు వేయాలా, పప్పు లో పచ్చి కారమా అంటూ లిస్ట్ చదువుతూ వుంటె నేను పేపర్ పట్టుకుని
మా అమ్మాయిని అడగండి అంటూ వరండా లోకి చేరాను.
ఈ వంటల్లో రకాలు ఎవరయినా చెప్పగానే మా అన్నయ్యలు అందరూ గుర్తుకు
వస్తారు. పంజాబ్ నుంచి హైదరాబాద్ లో చేర గానే ఇద్దరు కజిన్ బ్రదర్స్ , ఒక ఓన్ అన్న గారు సదరు వారితో ఉండే రూమ్ మేట్స్ అందరూ ఆదివారం రాగానే
ఉదయం పదకొండు గంటల కల్లా మలక్ పేట్ మా ఇంటికి వచ్చే వారు.
పంజాబ్ లో ఆదివారాలు బ్రిడ్జ్ మహోత్సవం జరిగేది. ఇక్కడ మాత్రం రమ్మీ
వుత్సవం జరుగుతూ ఉండేది.
అడే వాళ్ళు ఆడుతున్నా ఆడని వాళ్ళు ఇతోధికం గా నాకు హెల్ప్ చేస్తూ ఉండే వారు
కాఫీలు, టీ లు అందిచటం వాళ్ళ పని. భోజనాలు కీ కూడా గోంగూర, ఆవకాయ
చింతకాయ, ఇలాంటి ఊరగాయలు ఎదో ఒక కూర గాని, పప్పు గాని వుంటె
ఎదో విందు భోజనాలు పెట్టినట్లు సంతోష పడే వాళ్ళు.
సాయంత్రం దుకాణం కట్టిపెట్టి అందరమూ కోటి వైపు తాజ్ మహల్, కామత్
హోటల్ ల్లో గాని చక్కటి మసాలా దోశ తిని దిలషాద్ హాల్లో ఎదో ఒక పాత హిందీ సినిమా, చిక్కడపల్లి అయితే సుధా హోటల్ లో వెజిటబుల్ దోశ
తెలుగు సినిమా చూసి ఆ వారానికి జనగణమన పాడటం జరిగేది
ఒక ఆరు నెలలకు ఒక కజిన్ కీ పెళ్లి అయింది. పెళ్ళికి అందరమూ వెళ్ళాము. మద్రాస్ లో, ఇంకో నెల కు ఇద్దరూ వచ్చి కాపురం పెట్టారు.
మరుసటి ఆదివారం వదిన తో సహా వచ్చిన అన్నగారు కొంచెం మా ఆవిడకు మన వంటలు నేర్పవే సాంబార్ లో పులుపు కారం ఏమీ ఉండదు, రోజు కొక రకం సాంబార్ అంటూ వాపోయాడు.
ఇంకో రెండు నెలల కు ఇంకొక కజిన్ పెళ్లి నర్సాపూర్ లో, రెండు బస్సుల్లో వెళ్ళాము.
లాంచి లో గోదావరి దాటి అంతర్వేది వెళ్ళాము.
అక్కడ కూడా రమ్మీ పండగ బాగా చేసుకున్నారు.
ఈ పెళ్లి కొడుకు నా ఈడు వాడు. ఒక నెలరోజులు కల్లా భార్య మణి తీసుకుని వచ్చాడు.
రమ్మీ బాగా ఆడతాడు. మిస్ కాలేక వచ్చాడు అనుకున్నా.
మెల్లగా నా పక్కన చేరి అన్నీ చట్నీల్లో మా ఆవిడ బెల్లం వేస్తుంది అని
వాపోయాడు. కొంచెం చెప్పవా అని రిక్వెస్ట్..
అసలే గుంటూరు వాళ్ళము ఆవకాయ లో కూడా ఎర్రటి నూనె వంపుకుని తింటారు, ఇద్దరూ
ఇంక మా అసలు అన్న గారి భార్య వంటల్లో దిట్ట ఏలూరు నుంచి వచ్చింది.
మా ఇంట్లోనే దిగారు.
అవ పెట్టి అరటికాయ కూర చేయనా అంటూ అడిగింది.
వెంటనే మా అన్నయ్య కొంచెం నిక్కచ్చి మనిషి. మీ ఆవులు, దూడలు మా కొద్దు,
మా వంటలు చేయండి అన్నాడు.
మా ఇంకో వదిన తెలంగాణ , మేము మిరప పండ్లు గోంగూర లో వేస్తాము
వాళ్ళు చింతకాయ లో వేస్తారు.
ఆలా ఎన్నో తేడాలు.
అయినా అందరు వదినలకు అన్నయ్యల అభిరుచులను బట్టీ వంటలు నేర్పి
వాళ్లతో స్నేహం గా వుండి మంచి ఆడబడుచు అనే బిరుదు తెచ్చుకున్నాను.ఇలా నా ఊహల్లో నేను ఊయల ఊగుతూ ఉండగా మా కుక్ రాణి గారు ఇంకా తను ఎన్ని రకాలుగా వంటలు చేయ గలదో పని అమ్మాయికి చెపుతున్నది.
ఇంక వూరుకుంటె లాభం లేదని ఏ రకంగా చేసినా రుచిగా ఉండేట్లు చేయమ్మా
అని చేప్పాను.
భావుక మిత్రులకు విజప్తి ఏ వంటలను తక్కువ చేయలేదు.
కేవలం సరదా గా నా నిజమైన అనుభవం రాశాను.
కొత్తగా పెళ్లి అయినా మా అన్నయ్య లు వారి భార్యలకు చెప్పటానికి
మొహమాటం పడి నన్ను రిక్వెస్ట్ చేయటం గుర్తుకు వస్తా నవ్వు వస్తుంది
ఇంకొకసారి ఇంకా కొన్ని కబుర్లు తో
Comments