top of page
Search

రుబ్బు రోలు

  • murthydeviv
  • Aug 7
  • 2 min read

ఊహల ఉయ్యాల

అదేమిటో మనం కొత్త కాపురం పెట్టిన రోజుల్లో కొన్న ఏ వస్తువు అయినా చాలా అపురూపం గా ఎప్పుడూ గుర్తు వస్తూ ఉంటుంది.పెళ్లి అయిన తర్వాత మా వారి తో ఢిల్లీ సాహస ప్రయాణం చేసి అక్కడ నుండీ పంజాబ్ లో ఒక చిన్న సిటీ లాంటి టౌన్ లో కొత్త కాపురం.

అసలు అలవాటు లేని చలి, కొత్త భాష, కొత్త మనుషులు అంతా గొడవ గా ఉండేది. ఆ రోజుల్లో ఆ ఊర్లో కాఫీ కూడా బయట దొరికే ది కాదు. దోశ కానీ ఇడ్లీ కాఫీ కావాలి అంటె చండిఘర్ వెళ్ళాలి.

ఇప్పటి లాగా మిక్సీలు అవీ అ పాపులర్ కాలేదు.అదేమిటో ఎప్పుడూ దొరకని వస్తువు మీద ఎక్కువగా మనసు పోతుంది. పుట్టింటిలో రోజూ కంది పచ్చడి, గొంగూర. చింతకాయ లాంటి పచ్చడి లాంటివి తినమంటె విసుగు అనిపించేది.అక్కడికి వెళ్ళాక వాటి మీద మనసు ఎక్కువగా పోతుంది.

ఈ లోపల కొత్త గా పెళ్లి అయిన మా కజిన్ బ్రదర్ మమ్మల్ని ఢిల్లీ రమ్మని పిలిచాడు. అబ్బ ఒక వారం రోజులు అన్నయ్య దగ్గర ఉండచ్చు అనుకుంటూ ఢిల్లీ వెళ్ళాము. అక్కడ వదిన దగ్గర ముచ్చట గా వున్న చిన్న రుబ్బు రోలు చూడగానే నాకు కూడా కొత్త ఆశ లు చిగురించాయి. మావారి ని అడిగితే వీటో అయిపోతుంది అని నాకు తెలుసు.

నేనూ మా వదిన ఇద్దరం వెళ్లి ఒక చిన్న రోలు కొనుక్కొన్నాము. అయితే ఆరోలు మా ఊరు ఎలా చేర్చాలి అని నా భయం. మా వదిన మాత్రం ఆరోలు పాత చీరె లో కట్టి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో కట్టింది. బస్సు స్టాండ్ లో అన్నయ్య దింపి వెళ్ళాడు.

ఆ మూట చూడ గానే మా వారు ఏమిటి ఈ మూట అంటూ ఒక చూపు చూసారు. నేను చాలా అమాయకంగా మొహం పెట్టి మీకు కంది పచ్చడి అవీ ఇష్టం కదండీ,అంటూ దీర్ఘం తీసాను.

కానీ ఆ రోలు కొని నేను

ఎక్కువ ప్రాబ్లమ్ లో చిక్కు కున్నాను.ఇంక ఆ తర్వాత మా వారు తో రోజూ డిన్నర్ కి వస్తున్న పంజాబీ కొలీగ్ లే కాక ఇద్దరు ఆంధ్ర ఫ్రెండ్స్, మరో ఇద్దరు తమిళ్ వాళ్లకి కంది పచ్చడి రుచి చూపించాలి అని తీస్కొని వచ్చే వారు

ఇంక ఆలా రోలు కొనుకున్న సంతోషం కొంచెం ఆవిరి అయిపొయింది.


ఇంకా మధ్య మధ్యలో లో వచ్చే మిలిటరీ లో పని చేసే తెలుగు తమ్ముళ్లు వాళ్లకి తెలుగు వాళ్ళల్లో ఆడవాళ్లు

అందరూ అక్కలే , ఆదివారం వస్తే వాలి పోయే వారు.

అయితే మన పిల్లలు ను ఆడిస్తూ , బ్రిడ్జ్ ఆదుకునే వాళ్ళ కు చాయ్ లు అందిస్తూ ఇతోధికంగా సహాయం చేసే వారు

పాప ను చూసుకోనా, పచ్చడి చేయనా అక్కా అనే వారు , ఎలాగూ పచ్చడి చేయించము కదా.


రుబ్బు రోలు కొన్నాక రూర్కేలా నుంచీ వచ్చిన అన్నయ్య, ఢిల్లీ అన్నయ్య అబ్బా కంది పచ్చడి తిని ఎన్ని రోజులయిందో

అని మురిసి పోయారు.. ఢిల్లీ అన్నయ్య అయితే మీ వదినకు కూడా నేర్పవే అని అడిగాడు.


ఆలా రుబ్బు రోలు తో పచ్చళ్ళు, దోశ లు బాగానే తిన్నాము.


ఆదివారం కార్డ్స్ పార్టీ లకు మాత్రం నో దోశ లు అని రూల్ పెట్టాను.


ఇన్ని చిన్న చిన్న అనందం లు ఇచ్చిన నా ప్రియమైన రుబ్బు రోలు మాత్రం ఆంధ్ర కు వస్తూ తెచ్చుకోలేక పోయాను. హైదరాబాద్ వెళ్ళ గానే గ్రైండర్ కొందాము.ఇంకా ఈ రోలు ఎందుకు అంటూ అక్కడ తెలుగు ఫ్రైండ్స్ కి ఇచ్చారు. కానీ ఎక్కడ చిన్న రుబ్బు రోలు చూసినా నా ప్రియమైన రుబ్బు రోలు గుర్తు వస్తుంది

 
 
 

Recent Posts

See All
ఉయ్యాల ముచ్చట్లు

మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి

 
 
 
బిమల్ రాయ్

ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు.. అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు.. ఇండియా కు రష్యా

 
 
 
పెళ్లి వంటలు, గాడి పొయ్యి కథ

ఎక్కువగా ఉదయాన్నే మా అత్త కోడళ్లము డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగేటప్పుడు ఏవో కబుర్లు వస్తూ వుంటాయి. మాట ల్లో ఇప్పటి కేటరింగ్ భోజనాలు ముచ్చట్లు వస్తే నేను పూర్వం రోజుల్లో వంటలు గు

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page