యాత్ర కధనాలు
- murthydeviv
- Jul 1
- 2 min read
యాత్ర కథనాలు చదవటం అంటే చాలా ఇష్టం. అసలు ఏ పుస్తకం అయినా మొదలు పెడితే పూర్తి అయిందాక వదలను.
ఈ మధ్య చిన వీరభద్రుడి గారి నేను తిరిగిన దారులు మరలా చదివాను.
శ్రీశైలం, అరకు లో కొత్త అందాలు చూసినట్లు అనిపించింది.
శ్రీ శైలం ఎపుడు వెళ్లినా మా తాతగారు గుర్తు వస్తారు.
మనం చిన్నప్పుడు అమ్మలో, బామ్మలో, వాళ్ల కాలం లో జరిగిన
సంఘటనలు
కథ లాగా చెప్పే వారు.
మనము వినే వాళ్ళము.
ఇప్పుడు అయితే పిల్లలు పెద్దలు అందరూ తలా ఒక మొబైల్ పట్టుకుని
ఎవరి లోకం లో వాళ్ళము ఉంటాము.
మా బామ్మ గారు వాళ్ళ శ్రీశైలం ప్రయాణం ఒక కథ లాగా చెప్పే వారు..
మా అమ్మ నాన్న గారు బ్రిటిష్ హయాంలో సబ్ రిజిస్ట్రార్ గా పని చేసే వారు
మా పెద్ద అన్నయ్య బారసాల కి తన బంధువులు తో వెళ్లిన మా తాత గారు
శ్రీశైలం వెళ్ళాలి అని అడగ గానే , బంధువులు ఆందరికీ బండ్లు కట్టించి వంట సామానులు , ఎస్కార్ట్ గా కొంతమంది జవాన్లుని పెట్టి పంపారుట
ఆరోజుల్లో ఉదయం బయలుదేరితే సాయంత్రం కి చే ర గలి గారుట
ఆ రోజుల్లో వాళ్ళు చేసిన యాత్రలే నిజమైన భక్తి తో చేసిన యాత్రలు
అనిపిస్తుంది నాకు.
మా బామ్మ గారు వాళ్ళు చేసుకున్న వంటలు ,కృష్ణ లో స్నానము అన్నీ కథ లాగా చెప్పే వారు.
మా తాత గారు తన బంధుబలగం, తో సంపూర్ణ భారతదేశం యాత్రలు చేసారు.
ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ ,లేకపోతే, సత్రం లో వుండి వంటలు చేసుకుని
యాత్రలు చేసేవారు.
ఆలా బామ్మ గారు చెప్పిన కబుర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తు వస్తాయి. ఇప్పుడు మన పిల్లలు ని ఏదయినా యాత్ర గురించి అడిగితే
. ముందు వాళ్ళు చూసేది, అక్కడ మంచి హోటల్స్ గాని, రిసార్ట్స్ గాని
ఉన్నాయా అని.
తర్వాత స్పెషల్ దర్శనం ఉన్నదా అని చూస్తారు.అదీ ఇప్పటి యాత్ర స్టైల్
మా అమ్మ నాన్నగారు రిటైర్ అయ్యాక నరసరావుపేట లో సెటిల్ అయ్యారు.
మేము సెలవులు కి వెళ్ళినపుడు మాచర్ల ,గురజాల,కారం పూడి
మీద గా సాగర్ తీసుకుని వెళ్లారు.
అప్పటికి ఇంకా డాం రాలేదు. తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయి.
ఆ తవ్వకాల్లో బయట పడిన బౌద్ధ శిల్పాలు అవీ ఒక మ్యూజియం
లో పెట్టారు.
మాకు తాతగారు పల్నాటి యుద్ధం గురించి, మాచర్ల లో చెన్న కేశవ గుడిలో
బ్రహ్మ నాయుడు పెట్టిన భోజనాలు గురించి చక్కగా చెప్పారు.
ఎప్పుడు సాగర్ వెళ్లినా తాతగారు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి.
ఆ రెండు కొండలు చూపుతూ ఈ రెండు కొండల మధ్య డాం వస్తే
మన పొలాలకు నీరు వస్తుంది.
వరి పంటలు వేయ వచ్చు, తెల్ల బియ్యం అన్నం తినవచ్చు అని చెప్పారు
మనకు హైదరాబాద్ కూడా దగ్గర అవుతుంది, ఈ డాం మీదుగా బస్సులు
వేస్తారు అని ఆరోజు తాత గారు చెప్పిన మాటలు ఈ రోజుకి మనం
చూస్తున్నాము కదా అనుకుంటాను.
అప్పట్లో కోటప్పకొండ కి కూడా రోడ్డు లేదు. కచ్చా రోడ్ మీదుగా
శివరాత్రి ప్రభలు వెళ్ళేవి.
ఒక కార్తీక మాసం లో మేము కూడా నడిచి కొండ ఎక్కాము.
ఇప్పుడు మా పొలాలు కి కూడా సాగర్ నీళ్లు వస్తాయి. వరి పంట
కళ కళ లాడుతూ వున్నప్పుడు వెళ్ళితే మా తాతగారు నవ్వుతూ
ప లంకరించి నట్లే వుంటుంది.
శ్రీనాధుడు పద్యం చెప్పినట్లే పల్నాడు లో ఎర్ర బియ్యం, రాగులు, సజ్జలు జొన్నలు తో అన్నం వండే వారు.
నా చిన్న తనం లో ఎర్ర అన్నం తిన్నాను, మా తాత గారు సత్తెనపల్లి లో ఉద్యోగం లో వున్నపుడు.
మా అమ్మమ్మ గారు కథ లాగా చెప్పేవారు మేము ఆ అన్నం తినటానికి ఎంత
సరదా పడే వాళ్లమో.
ఇంతకీ యాత్ర కథనాలు ఎలా మోటివేట్ చేస్తాయో చెప్పలేదు కదా.మల్లాది గారి
నర్మదా పరిక్రమ పుస్తకం చదివి , పరిక్రమ చేద్దాం అనుకోలేదు.
నర్మదా నది చూద్దాం అనుకున్నాను. ఇండోర్ ఉజ్జయిని వెళ్ళాము.
వర్షాలు వలన నర్మదా నది వరదలు వల్ల వెళ్ళలేక పోయాము.
అప్పుడు శ్రీ శంకరాచారి గారి విగ్రహం ప్రతిష్ట కూడా
అనుకున్న రోజు కాకుండా తర్వాత జరిగింది.
కానీ ఆ పుస్తకం లో అయన స్నేహితుడు 108 వెంకటేశ్వర స్వామి గుడులు
చూసినట్లు రాశారు.
నేను అదీ చదివి నేను కూడా చూద్దాము అనుకున్నాను.
అనుకున్న విషయం మా వారి తో అంటే అన్నీ గుళ్ళు వున్నాయో లేవో
ఒకే గుడికి అన్నిసార్లు వెళ్ళు, అని ఒక ఉచిత సలహా ఇచ్చారు.
నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా అన్నీ గుడులు చూసాన
ఈ హైదరాబాద్ లోనే చాలా గుడులు వున్నాయి, కొన్ని చాలా పాత గుడులు వున్నాయి.
అన్నీ నోట్ చేసి పెట్టాను. కొన్ని పాత గుడులు గురించి ఇంకోసారి చెప్పుకుందాము..
Comments