top of page
Search

మర చెంబు

  • murthydeviv
  • Jul 3
  • 2 min read

శంకరా భరణం సినిమా లో నిర్మలమ్మ

చంద్ర మోహన్ తో అయ్యో అదీ నా పుట్టింటి వాళ్ళు

ఇచ్చిన మర చెంబు రా అనే డైలాగ్ ఆందరికీ గుర్తు వుండే ఉంటుంది.

అలాంటి గిన్నెలు మా ఇంట్లో వున్నా నేను వాడను.

చాలా రోజుల క్రితం ఏదో పెళ్లి షాపింగ్ కి వెళ్ళినపుడు ముచ్చటగా

వున్న చిన్న మర చెంబు కనిపిస్తే సరదాగా కొన్నాను.

ఈ రోజు మా పని అమ్మాయి ఆ కప్ బోర్డు సర్దుతూ సామాను అంతా తీసి బయట

పెట్టింది.

ఆ మర చెంబు చూసి అదీ ఏమిటి అనే డౌట్ ఆందరికీ వచ్చింది.

అందులో మంచినీళ్లు తీసుకుని వెళ్తారు అని చెప్పితే

మా మనవరాలుకి బోలెడు డౌట్స్.


అందులో నీళ్లు చల్లగా ఉండవు కదా అని ఫస్ట్ డౌట్ , ఎండాకాలం లో

ఆ చెంబుకి తడి బట్ట గాని, చిన్న గొనె సంచి ముక్క గాని కడతారు అని చెప్పాను.


ఒక పది పదిహేనేళ్ల క్రిత వరకు ప్రయాణాల్లో మర చెంబులు, కూజా లు వాడే వాళ్ళము. పెద్ద స్టేషన్ లో ఆగినప్పుడు నీళ్లు పట్టుకుని వచ్చే వాళ్లము.

ఫ్లాస్క్ లో పాలు, కాఫీలు కూడా పట్టుకెళ్లే వాళ్ళము


హాస్పిటల్ లో ఎవరైనా ఉంటే అన్నీ ఇంటి నుండే తీసుకుని వెళ్ళే వాళ్ళము.

అప్పుడు ఈ మర చెంబులు, ఫ్లాస్క్లుతో చాలా అవసరం ఉండేది


మా మనవరాలికి ఇలా చెప్పితే చాలా వింత గా ప్రశ్నలు వేస్తూ వుంటుంది


రోడ్డు ట్రిప్ లు వెళ్లినా, ఫ్లైట్స్ లో వెళ్లినా వాటర్ బాటిల్స్ విరివిగా గా


వాడుతూ ప్లాస్టిక్ చెత్త కి ఇతోధికం గా సహాయం చేస్తున్నాము కదా.

ఈ మధ్య ఇంట్లో ఏ చి న్న ఫంకషన్ జరిగినా ఈ చిన్న మంచి నీళ్ల బాటిల్స్

తెస్తారు. ఇంక బయట ఫంక్షన్స్ లో అయితే కేటరింగ్ వాళ్ళు బాటిల్స్


మాత్రమే పెడతారు. ఒక చేత్తో తింటూ ఇంకో చేత్తో బాటిల్ ఓపెన్ చేసుకోవాలి.


ఈ మధ్య ఏ షాపు కి వెళ్లినా ముందు ఒక మంచి నీళ్ల బాటిల్ ఇస్తారు.

కొంచెం తాగి మిగతా నీరు వేస్ట్ చేయాలి ఆంటే బాధ గా వుంటుంది.


ఇంట్లో కూడా బాటిల్స్ లో మిగిలిన నీళ్లు లాన్ మీద చల్లమని చెప్తే

మా పనివాళ్లకు ఏదో వింత గా వుంటుంది.

ఇలా నీరు వేస్ట్ చేస్తే. ముందు తరాలకు నీళ్లు వుండవు అని చెప్తే

ఓకే ఈ పాయింట్ నేను స్కూల్లో కూడా చెప్తాను అని మాత్రం ఒప్పుకుంటుంది

నా మనవరాలు.


మా పిల్లలు మాత్రం ఏదో నీ తాపత్రయం అంటారు.

చూసారా మర చెంబు తో ఇంత కథ వచ్చింది.


కానీ మన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం చూస్తే మాత్రం చాలా బాధ

కలుగుతుంది.

కనీసం రోడ్డు ట్రిప్ ల్లో ట్రైన్స్ లో ఇంటి నుండీ వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళండి

అని సలహా ఇస్తాను.

 
 
 

Recent Posts

See All
ఆబ్బాయి పెళ్లి

అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే చూస్తే మా కజిన్ చాలా కంగారుగా నాలుగు గంటలకు పెళ్లివారు వస్తారే బాబూ , నీవు బావగారు త్వరగా రండి ఇక్కడే భోజనాలు అన్నది. కంగారు పడకు మేము లంచ్ కి రాము, 3 గంటలకు అక్కడ ఉం

 
 
 
మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి

పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు. నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు. ఈ మధ్య ఎప్ప

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page