top of page

మన సంక్రాతి:4

murthydeviv

సంక్రాతి మూడు రోజులు అయ్యాక సంక్రమయి కి ఉద్వాసన చెప్పి ఉరి చివర కాలవలో కలిపేవారు. ఆ రోజు సాయంత్రం చద్ది పులిహార కలిపి చుట్టుపక్కల బొమ్మలు పెట్టిన ఇరుగు పొరుగు వారితో కలిసీ ఊరిచివర ఉన్న బావి దగ్గరకు మేళా తాళాలతో వెళ్లి అక్కడ సంక్రమయిని బావి లో కలిపే వారు ఆ రోజుల్లో ఇరుగు పొరుగులో అన్నదమ్ముల పిల్లల ఇళ్ళు ఉండేవి. తరువాత అక్కడ బావి దగ్గరకి వచ్చిన అన్ని కులాలవారికి పెరుగన్నం, పులిహోర పంచి పెట్టేవాళ్ళు అక్కడ కులమత బేధాలు కానీ ధనిక పేద బేధాలుకానీ ఉండేవి కాదు మా ఇంట్లో ఎపుడు అలాంటి బేధాలు చూపేవారు కాదు మా అమ్మ అందరిని సమానంగా ఆదరించేది అన్నపూర్ణలాగా అందరికి అన్నదానం వేరే ఏదైనా సహాయము తనకు చేతనైనంత చేసేది. మా ఇంట్లో పూర్తి కాగానే మేము అందరం కలిసి మా మేనత్త గారి ఇంటికి వెళ్ళేవాలం . వాళ్ళ ఇళ్ళ దగ్గర కృష్ణ కాలువ ఉండేది. అది బ్రిటిష్ వాళ్ళు తవ్వించిన బకింగ్హోమ్ కాలువ అని మేము కొంచం చదువుకున్నాక తెలిసింది. అక్కడ మా కజిన్స్ అందరం కలిస ఎంత సరదాగా ఉండేవాళ్ళం అంటే అసలు ఈరోజుల్లో అలాంటి బంధాలు ఉన్నాయా అనిపిస్తుంది. ధనురుమాసం లో వచ్చే ఇంకొక విశేషం ఆరుద్ర అభిషేకము.

19 views0 comments

Recent Posts

See All

అమ్మమ్మ అమెరికా యాత్ర 2

ఇంక తప్పక ప్రయాణం ఏర్పాట్లు మొదలు పెట్టాను. అప్పట్లో ఊరగాయలు ప్యాక్ చేయటానికి ఇన్ని వసతులు వుండేవి కాదు ఎవరో గౌలిగూడా దగ్గర ప్యాక్...

అమ్మమ్మ అమెరికా యాత్ర

అమ్మమ్మ అమెరికా యాత్ర అని హెడ్డింగ్ పెట్టినా ఫస్ట్ టైమ్ అమెరికా మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాను. స్కూల్లో, కాలేజీ లో చదువుకునే టపుడు...

మా అమ్మ గారి గీతోపదేశం.

ఈ టైటిల్ చూసి మా అమ్మ గారు మాకు భగవద్గీత గురించి చెప్పారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అసలు మా అమ్మ గారు ఎప్పుడయినా గీత చదివారో లేదో...

Comentarios


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page