top of page
Search

మధుర గీతాలు తలత్ మొహమ్మద్

  • murthydeviv
  • 2 hours ago
  • 2 min read

మొన్న సురయ్యా పాటలు సెర్చ్ చేస్తూ ఉంటే రాహి మత్ వాలే అంటూ ఒక చక్కటి పాట కనిపించింది.

ట్రైన్ లో పాట సో స్పీడ్ గానే వుంది మ్యూజిక్ పాడుతున్న ది తలత్ మొహమ్మద్ అనీ కనుక్కున్నా గాని

యాక్టర్ కూడా ఆయనే అనీ తెలుసుకోలేక పోయాను.


మరలా గూగుల్ బాబా గారిని అడిగితే చాలా విశేషాలు తెలిసాయి. నాకు తలత్ మొహమ్మద్ అంటే తెల్సినవి

మూడో నాలుగో పాటలు.

జాయతో జాయ కహా అంటూ మా అన్నయ్య పాడుతూ ఉండేవాడు. ఇత్ నన ముజేసే తూ ప్యార్ బడా అనే పాట

మా కజిన్ పాడుతూ ఉండేవాడు.

జల్తీ హై జిస్ కెలియే అనే స్లో పాట సుజాత మూవీ లో సునీల్ దత్ ఫోన్ లో పాడతా డు. ఏమిటో ఆ యాక్టర్ అంటేనే పెద్ద ఇష్టం ఉండదు. కానీ ఆ పాట మా వారి ఫేవరెట్ . రికార్డు ప్లే యర్ వచ్చాక ఇంట్లో తరచూ వినాల్సి వచ్చేది.


కానీ ఈ రాహి మత్ వాలే పాట విన్నాక గూగుల్ సెర్చ్ లో చేస్తే యాక్ట్ చేసింది కూడా ఆయనే అనీ తెలిసింది.


అయన టోన్ సాఫ్ట్ గా సోబర్ గా వుంటుంది. గజల్ కింగ్ అనీ , సిల్కీ వాయిస్ అనే వారుట.


సాఫ్ట్ గా వుండే రొమాంటిక్ పాటలు, ట్రాజిక్ పాటలు పాడే వారు ట. లక్నో లో కాలేజీ అఫ్ మ్యూజిక్ లో స్టూడెంట్ ట.


ఈ రోజుల్లో ఆ పాత పాటలు వింటూ వుంటె ఇప్పుడు సినిమా సంగీతం ఎంత గా దిగజారి పోయింది అనుకుంటాను.

అందుకే ఈ మధుర గీతాలు గుర్తు చేసుకుని ఆ సింగర్స్ గురించి కూడా తెలుసుకుందాం అనే ఈ ప్రయత్నం.


పదహారేళ్ల వయసులోనే బెంగాలీ సినిమాల్లో తపన్ కుమార్ అనే పేరుతొ పాడారుట

ఏ రిమజిమ్ భరోష్ బెంగాలీ పాట గూగుల్ లో వున్నది. విన సొంపుగా వున్నది. కంపోజ్ చేసింది సుధీన్ దాస్ గుప్తా


భాష ఏదయినా రాగం బాగుంటే వినటానికి హాయిగా వుంటుంది..

సుమన్ కళ్యాణ్ పుర్ ని సినిమాలు కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తలత్ గారే ట ..


ఈయన కానన్ దేవీ, కానన్ బాల , మధుబాల, శ్యామా, నూతన్, సురయ్యా, మాలా సిన్హా యాక్టర్స్ తో ఒక పదిహేను చిత్రాలు యాక్ట్ చేసారుట .


సుమారుగా ఒక ఏడు వందల పాటలు పాడారుట . విశేషం ఏమిటంటే ఈయన పన్నెండు భాషల్లో పాటలు గజల్స్ పాడారుట .

40 సంవత్సరాలు సినిమా ఫీల్డ్ లో వున్న తలత్ గారు ఇండియన్ సింగర్ ల లో ఫారిన్ టూర్ వెళ్లిన మొట్ట మొదటి గాయకుడు ట.


1956 లో రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ లో, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ , వెస్ట్ ఇండీస్ లో ట్రావెల్ చేసారుట


ఆయన పాడినవి కొన్ని పాట లు అయినా కొన్ని మరపురాని మధుర గీతాలు వున్నాయి వినండి.


తస్వీర్ బనతా హుం , దిల్ ఏ నాదాన్ తుజే హువా క్యా హై., ఫిర్ వహి శ్యామ్ సామే గంకి కసం ,

మిలతే హై అంఖే , ఈ పాటలన్నీ స్లో మ్యూజిక్ తో , వింటూ ఉంటే చల్లటి సాయంత్రం

సన్నని చిరుగాలి జాజుల సువాసన తేలి వస్తున్నట్లు వుంటాయి.


తలత్ మహమ్మద్ గారు తెలుగు లో కూడా ఒక పాట పాడారు

అందాల సీమా సుధా నిలయం , సినిమా పేరు మనోరమ

1959 లో వచ్చిందిట ఈ సినిమా


శుభ రాత్రి











 
 
 

Recent Posts

See All
పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు

 
 
 
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 
తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page