top of page
Search

పడక కుర్చీ

  • murthydeviv
  • 3 hours ago
  • 2 min read

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో

వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని

సంఘటన లు గుర్తు వచ్చాయి.


కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఇంకా

మగ పిల్లలు పెళ్లిళ్లు ఇంత సమస్య కానీ రోజుల్లో జరిగిన విషయం


అరోజుల్లో ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆంటే కొంత విలువలు వున్న రోజులు. మా చెల్లెలు, మా ఆడపడుచు ఇద్దరూ మా ఇంట్లో వుండే వారు.


మా అన్నయ్య ఇంకా వంటరివాడు అవటం తో చెల్లెలు ఎం ఏ ప్రైవేట్ గా చదువుతూ మా ఇంట్లో ఉండేది.


ఆరోజుల్లో పెళ్లి సంభందం ఆంటే తెలిసిన వాళ్ళు చెప్పటమే , ఈ మ్యారేజ్ భ్యూ రోలు గట్రా ఉండేవి కావు.


ఎవరైనా సంబంధం చెప్పగానే కృష్ణా అర్జునులు లాగా ఇద్దరూ బయలు దేరే వారు.


ఇద్దరికీ కొంచెం అభిజాత్యం ఎక్కువే, కానీ ఆరోజుల్లో అమ్మా యిల వైపు

వాళ్ళు ఆంటే కొంచెం చిన్న చూపు ఉండేది.


ఇలాగే ఒకరోజు ఎవరో చెప్పితే ఇద్దరూ అప్పుడే డెవలప్ అవుతూ వున్న

సెంటర్ ఎక్సజ్ కాలనీ లో సంభందం కోసం వెళ్లారు.


పెళ్లి కొడుకు ఇన్కమటాక్స్ లో యూ డీ సీ అనుకుంటా , ఫోటో లు, జాతకాలు


గట్రా అయ్యాక ఇద్దరూ వెళ్లారు. ఆ పెళ్ళికొడుకు తండ్రి నరసరావుపేట

పడక కుర్చీలో కూర్చుని కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని, ముందు


వీళ్లిద్ద రి ని శల్య పరీక్ష చేసి, అప్పుడు రెండూ కుర్చీలు తెప్పించి వేయించారుట.


మా ఆబ్బాయి ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగం ఆంటే మీకు తెలుసుగా

అనీ చెప్పి, ఆ ఎక్సజ్ కాలనీ లో గజం విలువ ఎంత వుందో చెప్పి,


మీ అమ్మాయి ఫోటో లో కొంచెం కలర్ తక్కువగా వున్నా , మీది పెద్ద ఫ్యామిలీ

మర్యాద లు బాగా తెలుస్తాయి అనీ అనుకుంటున్నాను.

కట్నం కూడా ఏభయి వేలు దాకా ఇస్తామని వస్తున్నారు అనీ

కొస మెరుపు లాగా చెప్పారుట .


వీలు చూసుకుని అమ్మాయిని వచ్చి చూస్తాము అని చెప్పారుట.


ఇంతకీ వీళ్ళు వెళ్లిన టైమ్ కి ఆదివారం అయినా ఆ సదరు పెళ్ళికొడుకు

ఇంట్లో లేడుట.


ఆబ్బాయి అమ్మగారు మాత్రం కాఫీ ఇస్తూ మా వారికీ కొంచెం చాదస్తం

ఏమీ అనుకోవద్దు అనీ చెప్పిందిట..


ఇంక మా కృష్ణా అర్జునులు ఇద్దరూ యింటికి వస్తూనే అగ్గి మీద గుగ్గిలం లాగా

అసలు ఈ మ్యాచ్ నీకు ఎవరు చెప్పారు అంటూ నాకు ఒక క్లాసు .


ఆ తర్వాత మా వారికీ ఎక్కడ పడక కుర్చీ , పొరపాటున సినిమా లో చూసినా


ఇంక ఆ రోజు నాకు ఒక చక్కటి పాఠం ఉండేది.


నేను మాత్రం కల గన్నానా ఆ పెళ్ళికొడుకు తండ్రికి పడక కుర్చీ ఉందని


మా వాళ్ళు ఇద్దరూ నాకు ఎన్ని పాఠాలు చెప్పినా , మా అడపడుచుకు

మా దూరపు బంధువుల్లో బ్యాంకు ఆఫీసర్ తో పెళ్లి కుదిరింది.

వాళ్ళ నాన్న గారు గాంధి గారి శిష్యుడు , అసలు కట్న కానుకలు వద్దు అన్నారు.


మా చెల్లలు కి మా ఫ్రైండ్ వాళ్ళ చుట్టాలు అమెరికా నుండీ వచ్చి

వారములో పెళ్లి కుదిరితే మాఘ మాసం సత్రాలు దొరకక మా ఇంట్లో నే పెళ్లి చేసాము. ఆ యన కూడా కట్న కానుకలు కు వ్యతిరేకం

అలా ఇద్దరికీ పెళ్లి అయినా మా వారికీ మా అన్నయ్య కు

ఆ నరసరావుపేట పడక కుర్చీ మాత్రం నైట్ మేర్ లాగా

గుర్తు ఉండి పోయింది.


నా ఉద్దేశ్యం లో కథ ఆంటే మనము ఏదయినా ఒక సంఘటన చూసో

ఏదయినా చదివి మనసుకు నచ్చితే ఫీల్ అయ్యి రాయాలి అనుకుంటాను.


కొన్ని మాటలతో కొన్ని పదాలలో బం దించి రాయలేను .


ఈ సంఘటన నిజముగా జరిగిన దే , అరోజుల్లో ఆలా వుండే వారు , ఇందులో


ఏ డిపార్టుమెంటు ని కానీ, ఏ ఉద్యోగా న్ని కానీ కించ పరిచే ఉద్దేశ్యం లేదు.


 
 
 

Recent Posts

See All
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 
తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ

 
 
 
స్లో కుకింగ్

వారణాసి సుధాకర్ గారి పోస్ట్ కుంపటి ని, పొట్టు పొయ్యిని గుర్తు చేస్తే , ఈ రోజు జగదీష్ గారి పోస్ట్ పచ్చి జీడిపప్పు లు గుర్తు చేసింది. ఆ రోజుల్లో పొయ్యి, కుంపట్లు మీద వంట నిదానంగా అయినా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page