top of page
Search

పూల బాలలు

  • murthydeviv
  • Aug 26
  • 2 min read

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలు ఇమ్మని రెమ్మ రెమ్మకు ఇంత సున్నితంగా ఇంకెవరు రాయగలరు కృష్ణ శాస్త్రి గారు తప్పితే అనుకున్నా.


ఒక రెండు రోజులు నుండీ పడిన కొద్దీ పాటి వాన కే పూల చెట్లు కళ కళ లాడుతూ

కొద్దిగా మొగ్గలు వస్తూ వున్నాయి.


నేను కూడా కొంచెం వేడి తగ్గింది కదా అనీ ఆ చెట్లు చూసికుంటూ వాకింగ్ లాంటిది చేస్తూ ఆ చెట్ల ను చూస్తూ ఉంటే ఈ పాట గుర్తు వచ్చింది..


రెండు నెలల నుండీ బోర్ లో నీళ్లు రాక, ట్యాంకులు కొన్నా సరిపోక చెట్లు అన్నీ వాడి పోయి ఉంటే ఏదో బాధ వచ్చేస్తుంది.


చిన్నప్పటి నుండీ పూల చెట్లు పెంచటం , పూసిన పూలు చూసి మురిసిపోవటం అలవాటు..


మూడు బుట్ట ల నిండా వచ్చే మందారాలు, గరుడ వర్ధనం, శంఖు పూలు , తో

పూజ చేయటం అలవాటు అయ్యాక , పూలు లేక పొతే ఏదో లోపం గా వుంటుంది.


ఆషాడం నుంచీ మొదలు అయ్యి కార్తీకమాసం వరకు. లేత గులాబీ రంగులో పూసే చమేలి, ఆకారంలో చిన్నదాన్ని అయినా , సువాసన లో నాతో ఎవరు పోటీ

అనే విరజాజి , ఏ కాలం అయినా పుస్తాను అంటూ సన్నజాజి

అమ్మవారి సహస్ర నామాలకు మా తో ఎవరు సాటి అంటూ విరగ పూ స్తూ

వుంటాయి.


మా చిన్నప్పుడు దేవ గన్నేరు అనే వాళ్లము ఒకటే లేత పసుపు రంగు లో పూసేవి.

కొమ్మలు చాలా పెలుసు గా వుంటాయి, ఎక్కకండి పడతారు అనీ పెద్ద వాళ్ళు చెప్తూ వుండే వాళ్ళు


ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ రక రకా ల రంగుల్లో దొరుకుతున్నాయి. ఎర్రటి ఎరుపు, ఎరుపు, పసుపు కలిసిన రంగులో అన్నీ రోజులు పూయవు కానీ చూడటానికి అందంగా ఉండి ఒక్క పువ్వు పెట్టినా కళ గా వుంటుంది.


ఇప్పుడు హై వేస్ లో వేస్తున్నారు పొడవుగా పెరిగి తెల్ల పూలు పూస్తూ వుంటాయి.

మా ఇంట్లో కూడా వేశారు ఆకాశానికి పెరిగాయి. పూలు వున్న అందవు.

ఎన్ని మల్లె చెట్లు వున్నా నీళ్లు. లేక. ఎక్కువుగా పూయలేదు.

సూర్యకాంతం లాగా అజమాయిషీ చేస్తూ వంటింట్లో వాడే నీళ్లు పోయిస్తూ. రోజుకి. ఒక పది పూలు వస్తె సంతోషించి ఆహా నా మల్లె.

మొగ్గ తొడిగింది అనుకుంటా.

ఈ వయసు ప్రభావం మనం ఏది చేయలేము.

ఏ పని అయినా. ఇంకొక రీ చేత చేయించాలి. అదే మేనేజ్ మెంట్

టెక్నిక్ , అనే మా వారు తను sofa లోనుంచి లేవకుండా, అన్ని

మేనేజ్ చేయడం బాగా అలవాటు.

ఇప్పటికి నేర్చుకున్నా ను


మామూలు గులాబీలు అయితే ఎప్పుడూ పూస్తాయి హైబ్రిడ్ అలా పూయవు

నవంబర్, డిసెంబర్ లో తప్ప , వాటికీ పోషణ మాత్రం చేయాలి


ఇదివరకు ముద్ద గన్నేరు, పింక్ కలర్ లో అలాగే గన్నేరు లేత గులాబీ రంగులో ఒంటి రెక్క ఉండేవి.

ఇప్పుడు వాటిల్లో కూడా ఎన్ని రకాలు హైబ్రిడ్ లో దొరుకుతున్నాయి.


పసుపు రంగులో సువర్ణ గన్నేరు కూడా ఇంకో రెండు నెలలకు పూస్తుంది


మరువం కనకకాంబర ము అన్నీ చూసుకుంటూ ఆలా చెట్ల మధ్య తిరుగుతూవుంటే

ఏదో తెలియని ఆనందం నాలో అనే పాట గుర్తు వచ్చింది.


లాన్ నిండా రాలిన అగ్ని పూల రేకులు ఆకుపచ్చ లాన్ మీద ఎర్రగా మెరుస్తూ


ఉంటే తివాచి మీద డిజైన్ లాగా వున్నది.


మొన్న ఎప్పుడో కారులో బయటి నుంచీ వస్తూ ఉంటే బిల్వ దళాలు చెట్టు నిండా రాలిన ఎర్రటి రేకులు సడన్ గా చూస్తే పూలు పూసిందా అన్నట్లు వుంది.


ఆ చెట్టు కొమ్మల నిండా విరగ పూసిన ఆ అగ్ని పూల అందం వర్ణించ లేము.


మేము ఈ జూబ్లీహిల్స్ లోనే ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ గారి ఇల్లు చూసాము.

పెద్దవాళ్ళు అయిపోయి మెయింటైన్ చేయలేక అమ్మేస్తున్నాము అనీ చెప్పారు.


నేను వాళ్ళింట్లో చూసిన గార్డెన్, అంత పెద్ద పూజ రూమ్ మరలా ఎక్కడా చూడ లేదు..


వాళ్ళు ఎన్నో యాత్రలు చేసారుట, ఆ యాత్రల్లో చూసిన అన్నీ దేవుళ్లు.

విగ్రహం రూపం లోనో ఫోటో గానో వున్నాయి.

అన్నీ పూల తోటి కళ కళ లాడుతూ వెలుగులు చిమ్మతూ, సువాసన తో నిండి వున్నాయి.

ఎవరైనా మా పూజ రూమ్ చూసి ఆమ్మో ఇన్నీ ఫోటోలు విగ్రహాలు ఎలా చేస్తావు అనీ అడిగితే నేను వాళ్ళింట్లో పూజ గది గురించి చెప్తాను.


ఎంతో టైమ్ ఎన్ని విధాలుగా వేస్ట్ చేస్తూ ఉంటాము.


ఈ సేవ అన్నిటికంటే ఎక్కువ అనుకుంటాను


అమ్మ కు మనం చేసే ఉపచారం ఏ పాటిది, ఒక్క మందార పువ్వు పెడితేనే

కళ కళ లాడుతూ చిరునవ్వు చిందిస్తుంది.


పారిజాతం సుమ దళలా అనీ పాట వున్నది గుర్తు రావటం లేదు,


పూల బాలల తో కబుర్లు తో ఊహల్లో ఉయ్యాల ఊగుతూ

 
 
 

Recent Posts

See All
మేజు వాణి

శ్రావణమాసం అంతా చాలా హడావిడి గా గడిచి పోయింది. ఇంట్లో పూజలు కాకుండా పెళ్లిళ్ళు , పుట్టినరోజు, ఉయ్యాల ఫంక్షన్స్ పైగా వర్షాలు అలాగే అన్నింటికీ హాజరు వేయించుకోవాలి కదా అలా చాలా బిజీగా

 
 
 
ఆంధ్ర వాల్మీకి

రెండు మూడు రోజుల నుంచీ వీర తాడులు మిస్ అవుతున్నాను. అయితే ఈ రోజు మిస్ అయినందుకు చాలా బాధ అనిపించింది. వావిలి కొలను సుబ్బారావు గారిని ఆంద్రా వాల్మీకి అనే వారు. మా చిన్న తనంలో మా చిన్న నాయనమ్

 
 
 
ఛలో ఆంధ్రా

ఈ మధ్య విజయవాడ వెళ్ళాము. ఎన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రా లోకీ వెళ్ళగానే ఏదో సొంత వాళ్ళను చూసిన ఆనందం వస్తుంది. అందులో ఇపుడు కోదాడ దాటగానే చెక్ పోస్ట్ కూడా వస్తుంది ఇంకా ఎక్కువగా ఆహా మన ఆంధ్రా క

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page