ఆంధ్ర వాల్మీకి
- murthydeviv
- 4 days ago
- 2 min read
రెండు మూడు రోజుల నుంచీ వీర తాడులు మిస్ అవుతున్నాను. అయితే ఈ రోజు మిస్ అయినందుకు చాలా బాధ అనిపించింది.
వావిలి కొలను సుబ్బారావు గారిని ఆంద్రా వాల్మీకి అనే వారు.
మా చిన్న తనంలో మా చిన్న నాయనమ్మ ప్రతి శనివారం రాముల వారి పూజ చేసే వారు.
ఆ పూజ ఒక వ్రతము లాగా ఏదో ఒక కథ ఉండేది. మాకు చేతికి అక్షతలు ఇచ్చి ఆ కథ వినమనేవారు.
తర్వాత గోధుమ పిండి నెయ్యి ల్లో వేయించి అందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసిన ప్రసాదం పెట్టే వారు..
ఆ పూజ ఆంధ్రాలో సుబ్బారావు గారు మొదలు పెట్టించారు అని చెప్పే వారు.
మా చిన్న నాయనమ్మ, అన్న గారు నెల్లూరు లో వుండే వారు. .
మంచి ఆస్తిపరులు అయినా ఆయనకు హరి కధలు చెప్పటం హాబీ గా ఉండేది.
ఆయన సుబ్బారావు గారి శిష్యులు , ఒంటి మిట్ట గురించి అప్పుడే విన్నాము.
సుబ్బారావు గారు వ్రాసిన వాటిని హారికధ గా చెప్పే వారుట .
ఆ రోజుల్లో ఆయన కార్తీకమాసం , మాఘ మాసం లో వచ్చి మా ఇంట్లో ఉండి గుడిలో చెపుతూ ఉండేవారుట .
హైదరాబాద్ వచ్చాక మా అత్త గారు వాళ్ళు, మా కజిన్ సిస్టర్ రామాయణ
మందరము చదువుతూ వుండే వారు.
మా కజిన్ సిస్టర్ ప్రోదబ్లమ్ తో ఆ రామాయణం చదివాను. నాకు రెండేళ్లు పట్టింది .
పది ఏళ్ల క్రితం కల్ప వృక్షము, ఈ మందరము కొన్నాను..
మా వారి ఫ్రెండ్ ఐ ఏ స్ ఆఫీసర్ తమిళయన్ అయినా తెలుగు వచ్చు.
శ్రీ రాముల వారు అయోధ్య నుండీ లంక కు ఎలా ప్రయాణం చేసారు ,
ఏ ఏ దారుల , ఏ ఏ ఊర్లు , ఏ క్షేత్రాలు ఏమిటీ అని రీసెర్చ్ చేసి పెద్ద బుక్
పబ్లిష్ చేసారు .
ఆ సందర్బంగా నా రామాయణం మందరం, కల్ప వృక్షము ఆయనకు ఇవ్వటం
జరిగింది.
రీసెర్చ్ చేసిన పుస్తకం నాకు గిఫ్ట్ వచ్చింది కానీ నా పుస్తకాలు మాత్రం వెనక్కి
రాలేదు.
ఆయన్ని మరలా అడగండి ఆంటే నీ దగ్గర ఎన్నో రామాయణం లు
వున్నాయి కదా, అవీ చదువు అనే వారు మా శ్రీవారు.
ఇప్పుడు కల్ప వృక్షం అయితే దొరుకుతుంది కానీ , మందరము దొరుకుతుందో లేదో కనుక్కోవాలి .
ఆలా సుబ్బారావు గారు అన్నా , రామాయణం అన్నా , ఆ ఆశ్రమము అన్నా ఏదో అభిమానం.
ఎందరో మహానుభావులు ఆందరికీ వందనములు
Comments