top of page
Search

మా అత్తయ్య గారి తోట 1

  • murthydeviv
  • Dec 14, 2024
  • 1 min read

మా మూడో అంతస్తు అంటే ఎంత క్రేజ్ ఉండే దొ ఆ తోట అంటే కూడా మ మాకు చాలా ఇష్టం వుండేది ఉదయాన్నే తోటలో వెళ్ళి ఆటలు మొదలు పెట్టమంటే ఇంక మా చిన్న అత్తయ్య కర్ర పట్టుకుంటే కానీ లోపలికి వచ్చే వాళ్ళం కాదు అక్కడ ఇంకో అడ్వాటేజ్ సపోటా జామ చెట్లు వుండేవి మాకు కోతులకు పెద్ద తేడా లేదు మా చిన్న అత్తయ్య వేరే కోతులు ఎందుకు మీరు వుండగా అనేది మా పెద్ద అత్తయ్య పెద్ద కూతురు మా అందరికీ రింగ్ లీడర్ తోట కాబట్టి మేము అక్కడే గుజ్జన గుళ్ళు అని పొయ్యి లు పెట్టీ వంటలు చేసే వాళ్లం . ఆ వంట ఉప్పో కారం ఎక్కువ అయినా చాలా బాగుంది అనుకుంటూ తినే వాళ్ళం ఆ తోటలో ఒక ఏతం బావి వుండేది మా పిల్లల సంగతి తెలిసి మా మామయ్య గారు ఆ బావి మీద ఒక జల్లెడ లాంటిది వేయించారు ఏతం బావి అంటే మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఆ బావి కి ఒక పెద్ద వెడల్పు కర్ర కట్టి వుంటుంది a కర్ర మీద మెట్లు లాగా వుంటాయి ఒక మనిషి ఎక్కి దిగుతూ వుంటే ఆ కర్ర చివర వున్న పెద్ద బిందే తో నీళ్ళు తోడి చెట్లుకు పోసే వారు మధ్య మధ్య లో మేము కూడా బిందె లు అందుకునే వాళ్ళం అపుడు అదంతా సరదాగా ఉండేది కానీ ఇపుడు తలచుకుంటే ఎంత డేంజర్ అనిపిస్తుంది ఇక చెట్లు ఎక్కటం ఎంత బాగుంటుంది కానీ నేను ఎక్కటం గబ గబ గా ఎక్కినా దిగటాని కి చాలా భయంగా వుండేది పర్వాలేదు దిగు పడితే పట్టుకుంటాము అని అన్నయ్యలు దైర్యం చెప్పినా లాభం లేదు అంత భయం అయితే అసలు ఎందుకు ఎక్కావు అని ఎవరయినా విశుక్కుంటే వెంటనే రోషం తో గబ గబ గా దిగే దాన్ని ఇంక ఉప్పాటలు కుంటి ఆటలు కు అంతు వుండేది కాదు అన్నిటికన్నా ఇంటరెస్టింగ్ ఆట ఎర్ర తంగేడు పూల మధ్య వుండే కా డ లతో ఇద్దరు ఇద్దరు గా యుద్ధం లాగ చేయటం వాటి మధ్య లో వుండే కా డలు వంకర గా వుండి ఒకదాని కొకటి ఇరుక్కునవీ ఏదో ఒకటి విరిగితే గానీ విడిపడేవి కాదు చాలా ఇంట్రెస్టింగ్ గా వుండేది ఇంక మీకుతెలియని కొన్ని ఆటలతో రేపు కలుద్దాము గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
మధుర గీతాలు తలత్ మొహమ్మద్

మొన్న సురయ్యా పాటలు సెర్చ్ చేస్తూ ఉంటే రాహి మత్ వాలే అంటూ ఒక చక్కటి పాట కనిపించింది. ట్రైన్ లో పాట సో స్పీడ్ గానే వుంది మ్యూజిక్ పాడుతున్న ది తలత్ మొహమ్మద్ అనీ కనుక్కున్నా గాని యాక్ట

 
 
 
పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు

 
 
 
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page