top of page
Search

బామ్మ గారి బొమ్మలు

  • murthydeviv
  • Aug 6
  • 2 min read

ఈ రోజు ఒక గంట సేపు సెల్ ఫోన్ జోలికి పోకుండా

ఏదయినా పుస్తకం చదువుదాం అని భానుమతి

అత్త గారి కధలు తీసాను. అందులో అత్త గారు కృష్ణుడు బొమ్మ కి ఉదయాన్నే లేవగానే

నమస్కారం చేసుకుంటారని, ఆ బొమ్మ లో కృష్ణుడు కంసుడు చంపు తున్న ట్లు

కూడా ఉందని రాశారు. ఆది చదవ గానే నా మనసు కూడా ఉయ్యాల ఊగుతూ

గతం లోకి పరిగె త్తింది.

అసలు ధను ర్మా స ము అన గానే మన చిన్నప్పటి రోజులు గుర్తు వస్తూ ఉంటాయి

తెల్లవారుజామున లేవటం, ముగ్గులు వేయటం, గోబ్బెమ్మ లు పెట్టటం, నెల రోజులు సందడే సందడి.సంక్రాంతి కి బొమ్మలు పెట్టటం అనే హడావుడి తో సెలవులు పూర్తి అయి పోయేవి .

మా ఇంట్లో మా నాయనమ్మ కాలం నుండి వున్న బొమ్మలు కాకుండా అన్నయ్య లు

తెచ్చిన బొమ్మలు, ఇంకా మేము కొనుక్కున్న మోడరన్ బొమ్మలు అన్నీ

కొలువు లో ఉండేవి. పాత బొమ్మల్లో ఎక్కువగా కృష్ణుడు బొమ్మలు ఉండేవి.

వాసుదేవుడు బుట్ట లో పెట్టుకున్న బొమ్మ మొదలు,రాస లీలలు వరకు ఎన్నో

కృష్ణులు. భానుమతి గారు చెప్పిన కంస కృష్ణుడు కూడా వున్నారు.అన్నీ పాత బొమ్మలు అయినా మా అమ్మ గారు కొన్నిటికి రంగులు వేయించి రెడీ చేసే వారు.

ఇంక దోగాడుతున్న కృష్ణులు అయితే ఎన్ని వుంటాయో.

గోబ్బెమ్మ ల మాట ఎలా వున్నా బొమ్మల కొలువు పెట్ట టానికి నాకు కొంచెం హుషారుగా ఉండేది. ఈ పాత బొమ్మలు వద్దులే అంటె మా అమ్మ గారు

వప్పుకునే వారు కాదు. అవీ అన్నీ బామ్మ గారు కొన్న బొమ్మలు అచ్చి వచ్చినవి

అనేవారు. బామ్మ గారికి కృష్ణుడు అంటె ఇష్టము,అందుకే అన్నీ ఆ బొమ్మలు ఉండేవి. ఆ బొమ్మలు అన్నీ ఒక మూడు అరల్లో సర్ది ఇంక మా బొమ్మలు,

కింద పార్క్ కట్టి తృప్తి పడే వాళ్ళము.

ఇప్పటికీ మా మనవరాళ్ల చేత బొమ్మలు కొలువు పెట్టిస్తాను, కానీ చెన్నై లో గాని, ఇక్కడ గాని అప్పుడు వున్న బొమ్మలు రకాలు ఎక్కడా చూడ లేదు.


చుక్కల్లో చంద్రుడు లాగా ఆ పాత బొమ్మల్లో ఒక శివుడు బొమ్మ గణపతి ని

ఎత్తుకుని పక్కన పార్వతి దేవి తో వున్న బొమ్మ వున్నది. అలాంటి బొమ్మ నేను మరల ఎక్కడా చూడలేదు. నేను మా పుట్టింటి నుండి ఆ బొమ్మ అపురూపంగా తెచ్చుకున్నాను.మా అమ్మ గారి లాగానే రంగులు వేయించి కొలువు తీరుస్తూ

వుంటాను.

అన్నీ కృష్ణావతారం బొమ్మలు కొన్న మా బామ్మ గారు ఈ శివ పార్వతులను ఎందుకు కొన్నారో అనుకుంటూ వుంటాను. అన్నట్లు మా బామ్మ గారు భానుమతి అత్తగారి లాగానే ఉదయం లేవగానే ఎదురుగా వున్న రాధ కృష్ణులు ఫోటో చూసి

నమస్కారం చేసుకునే వారు.

ఆ ఫోటో మా అన్నయ్య తెచ్చుకున్నాడు. ఓల్డ్ ఈస్ గోల్డ్ కదా.


ఇప్పటికీ నాకు మా అమ్మ గారికి ఆ పాత బొమ్మలు అంటె ఎందుకు ఇష్టమో అర్ధము అయింది. భానుమతి గారి కథ తో నా ఊహల ఉయ్యాల ఆలా ఊగింది

.

..

 
 
 

Recent Posts

See All
వరలక్ష్మి వ్రతము విశేషాలు

ఈ రోజు వరలక్ష్మి వ్రతము అనీ ఫేస్ బుక్ లో చాలామంది అమ్మవారి అలంకరణ , ప్రసాదాలు ఫోటోలు పెట్టారు .. అన్నీ చూడ ముచ్చట గా వున్నాయి.. ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మవారి విగ్రహలు, వెండి వీ, దొరుకుతున్నాయి. అందర

 
 
 
ఉయ్యాల ముచ్చట్లు

మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి

 
 
 
బిమల్ రాయ్

ఈ మధ్య యూ ట్యూబ్ లో st పీటర్స్ బర్గ్ లో అనుకుంటా ఏదో ఒక గ్రూప్ వాళ్ళు కొన్ని హిందీ పాటలు పాడారు.. అందులో మొదట గా మధుమతి లో దిల్ తడప్ అనే పాట చక్కగా పాడారు.. ఇండియా కు రష్యా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page