top of page
Search

బాపు రమణీయం

  • murthydeviv
  • Jun 30
  • 2 min read

మేము కాలేజీ చదువు అయిపోయి ఉద్యోగం వెలగ పెడుతున్న రోజుల్లో గుంటూరులో , బెజవాడ లో సాక్షి సినిమా రిలీజ్ అయింది.. పెద్ద హీరోలు సినిమాలు తప్పితే ఈ సినిమాలు మావూరు ఫస్ట్ రిలీజ్ రావు.


అసలు ఈ సినిమా వస్తుందో రాదో అనే డౌట్ బాపు రమణల సినిమా చూడక పొతే ఎలా అనే ఒక దిగులు.


గుంటూరు, కానీ బెజవాడ గాని వెళ్ళ టానికి నాన్నగారి పెర్మిషన్ ఎలా సంపాదించాలి

అనే బాధ.


ఆరోజే నా కొలీగ్ వాళ్ళ నాన్నగారి కి వైజాగ్ నుండీ గుంటూరు ట్రాన్సఫర్ అయింది , శని ఆదివారా ల్లో వెళ్ళాలి, గుంటూరు ఏమీ తెలియదు నాకు తోడు

వస్తావా అనీ అడిగింది


ఇంకేముంది ఆలా నాన్నగారి పెర్మిషన్ తో ఇలా గుంటూరు చలో.


సాక్షి సినిమా డైలాగ్స్, పాటలు ఆ వెన్నెల లో గోదావరి అందాలు. ఎంతో సహజము

గా వుంటాయి.

అసలు బాపు రమణలు అంటేనే ఆ రోజుల్లోని మధ్య తరగతి సంసారాల్లో వుండే

సున్నితమైన బంధాలు , అలమగల మధ్య వుండే చిలిపి , చిలిపి తగాదాలు,

అలకలు ఎంత మధురంగా రమణ గారు రాస్తే బాపు గారు రాధ ఇలా వుంటుంది

గోపాలం అలాగే ఉంటాడు అనీ మనకు బొమ్మల్లో చూపించారు.


చక్కటి కళ్ళు, పొడుగు జడ లో సన్నజాజి పూలు తో ఆయన రాధ వర్ణిస్తే


బాపు గారు ఇదిగో నీ రాధ ఇలా వుంటుంది అనీ ఒక బొమ్మ ని

సృష్టించి , ఆ రోజుల్లో అబ్బాయిల గుండెల్లో గులాబీలు పూయించారు.


ఇంక బుడుగు, సీ గాన పెసునాంబ, లావుపాటి పక్కింటి పిన్ని గారు,, పోజులు కోట్టే బాబాయిలు, ఓర చూపులు చూసే అమ్మాయిలు ప్రైవేట్ మాస్టర్స్

ఎన్నో మరపురాని నిజ జీవిత సొగసులు .


అన్నిటి కన్నా నాకు ఆవకాయ పెట్టినప్పుడల్లా గుర్తు వచ్చే కథ,


ఇద్దరు బామ్మగార్లు కొత్తగా పెళ్లి అయిన దంపతుల ని తీసుకుని గోపాలం ఇంట్లో

వంతులు వేసుకుంటూ కంద వేపుడు, బంగాళాదుంప వేపుడు వేయించటం


రెండు ఆవకాయ జాడిల తో ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మనవడికి ఉద్యోగం

ఇప్పించటం ఎంతో సహజంగా ముళ్లపూడి వారు రాస్తే

అంత కన్నా సహజంగా బాపు గారు బొమ్మలతో అలరించారు .


నర నారాయణుల్లాగ వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .సభల్లో , సమావేశాల్లో ముళ్లపూడి వారు ఒక పది మాటలు చెప్పితే బాపు గారు

రెండు మాటలు చెప్తారు.


ఎవరు అన్నారో గుర్తు లేదు కానీ వాళ్ళు మాటల మాంత్రికులు కాదు ,

వాళ్ళ మంత్రం చేతల్లోనే అనేది జగమెరిగిన సత్యం


ఇద్దరినీ రెండు మూడు సార్లు కలిసాము . ముళ్లపూడి వారి పుస్తకాలు , బాపు గారి బొమ్మల పుస్త కాలు వారానికి ఒకసారయినా ఏదో ఒక కథ చదివి ఆనందిస్తూ వుంటాను.


చిన్నప్పుడు పిల్లలు పుట్టినరోజు లకు బుడుగు పుస్తకాలు ఇస్తూ వుండేవాళ్ళు

మా పిల్లలు.


అన్నట్లు సాక్షి సినిమాలో అటు ఎన్నెల ఇటు ఎన్నెల అంటూ గోదావరి అందాలు .ఎంత బాగా చూపించారో వీలు అయితే చూడండి, యట్యూబ్ లో


రమణ గారి పుట్టినరోజు సందర్బంగా చిరు కానుక

 
 
 

Recent Posts

See All
ఆబ్బాయి పెళ్లి

అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే చూస్తే మా కజిన్ చాలా కంగారుగా నాలుగు గంటలకు పెళ్లివారు వస్తారే బాబూ , నీవు బావగారు త్వరగా రండి ఇక్కడే భోజనాలు అన్నది. కంగారు పడకు మేము లంచ్ కి రాము, 3 గంటలకు అక్కడ ఉం

 
 
 
మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి

పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు. నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు. ఈ మధ్య ఎప్ప

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page