top of page
Search

పెళ్ళి సందడి

  • murthydeviv
  • May 18
  • 3 min read

ఫ్యామిలీ ఒక మంచి పూల తోట లాంటిది. మంచి పువ్వులు రావాలంటే ప్రేమ అను రాగాలతో ఆ చెట్టుకు ఎరువు వేయాలి

ఈ టైటిల్ కి పూల చెట్టు కి ఏం సంబంధం అనుకుంటున్నారు కదా. ఈ సందర్భంగా ఒక పాట గుర్తు వస్తుంది మనసే ఒక మల్లె దొంతర మన ఊసే విరజాజి దొంతర అంటూ ఇంత చక్కటి పాటలు కృష్ణ శాస్త్రి గారు తప్పితే ఎవరు రాయగలరు. ఆ పెళ్ళి లో నాకు ఈ పాట ఎందుకు గుర్తు వచ్చింది అంటే అక్కడ పెళ్ళి కూతురు తల్లిదండ్రులు మిగిలిన బంధువులు అందరూ చిరునవ్వుతో ఉన్నారు పెళ్ళి కూతురు తల్లి మాత్రం ఎపుడూ ఖుషీ ఖుషీ గా నవ్వుతూ అనే పాట లో లాగానే వుంటుంది. అందుకే నాకు విరజాజి దొంతర మల్లె ల దొంతర గుర్తు వచ్చింది. ఇంతకీ ఆ పెళ్ళికూతురు ముత్తాత గారు మంచి కవి ఆల్ ఇండియా రేడియో లో పనిచేశారు మా కాలేజ్ డేస్ లో ఆ లలిత సంగీతం పాటలు నేర్చుకుని పాడుతూ వుండేవాళ్ళం. తాతగారు కూడా ఫిజిక్స్ లెక్చరర్ గా చేసినా కొంత కవిత్వం కూడా రాసారు. పెళ్ళి సందడి అనే పేరు పెట్టీ కవిత్వం గురించి పాటలు గురించి రాస్తున్నాను కవులు ను తలుచుకుంటే మనకు కూడా ఇలా విరజాజి సువాసన లాగా కొంచెం కవిత్వం వస్తున్నది ఇంక పెళ్ళి సందడి గురించి రాస్తున్నాను. పెళ్లి వారు ఉండటం కర్ణాటక అయినా వాళ్ళ పద్దతులు మాత్రం మహారాష్ట్ర అనిపించింది. వాళ్ళకు మనకు వేదం ఫాలో అవటం లో కొన్ని తేడాలు ఉన్నాయట. ఆ పెళ్ళి చేయించిన పురోహితుడు చెప్పాడు. ఎదురుకోలు అపుడు మగ పెళ్ళి వారు ఆడ పెళ్ళి వారిని మెడ లో ఉత్తరీయం వేసి తల మీద ఒక టోపీ లాంటిది పెట్టీ సత్కారం చేశారు. తర్వాత బారాత్ లో అబ్బాయి గుర్రం మీద వస్తూ పిల్లలు పెద్దలు అంతా డ్యాన్సులు సరదాగానే వున్నది. అది నార్త్ ఇండియా లో వుండగా చూసాను. ఇపుడు సినిమాల్లో చూసి సరదాగా బారాత్ చేస్తున్నారట. బారాత్ అయ్యాక సరే ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ ఇప్పుడు ప్రతి పెళ్ళి లో సంగీత్ అనే కార్యక్రమం తప్పక చేస్తున్నారు. ఈ సంగీత్ కు పెళ్లికూతురు తప్పనిసరిగా గాగ్రాచోలీ వేసుకోవాలి కదా అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ లో మిగిలిన బంధువులు పిల్లలు రక రకాలుగా అవే డ్రెస్సులు వేసుకుని కనులు పండుగగా ఉన్నారు. పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ మా మనవళ్ళు అంతా నల్ల షర్ట్ లు వేసుకొని వచ్చారు. కొన్ని పాటలు అర్థం కాకపోయినా మొత్తం మీద అందరూ బాగా డ్యాన్స్ లు చేశారు పెళ్ళి కూతురు కజిన్ బ్రదర్, సిస్టర్ U S వాళ్ళు అయినా తెలుగు పాటకు బాగా డ్యాన్స్ చేశారు . పెళ్లి జంట కన్నా నాకు పెళ్లి కూతురి పెదనాన్న లు , వాళ్ళ అమ్మ నాన్న చేసిన పాత కాలం పాటలకు చేసిన డ్యాన్స్ లు చాలా బాగున్నాయి. మాయాబజార్ పాటలు ఎవర్ గ్రీన్ కదా. ఆ పాటలు వింటూ ఆ డాన్సులు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇంక చివరకి అందరూ స్టేజ్ ఎక్కి మొత్తం మీద డాన్స్ అనుకుంటూ ఎగురుతారు. మా అమ్మాయి ఫిఫ్టీ ఇయర్స్ అయినా బాగానే డాన్స్ చేసింది. ఆ పాటలు అర్థం కావు కానీ ఆ మ్యూజిక్ తో వాళ్లు రిథమిక్ గా డాన్స్ చేయటం బాగానే ఉంది. చివరిగా మా మేనల్లుడు కూతురు చిన్న పాప జైహింద్ అని చెప్పడం ఇంకా బాగుంది. మర్నాడు ఉదయం పెళ్ళి లో వాళ్ళ కొన్ని ఆచారాలు చాలా ముచ్చటగా ఉన్నాయి. పెళ్ళి అవగానే పెళ్ళి కూతురు చేత ఐదుగురు ముత్తైదువులకు చేట ల్లో చీరెలు అవీ పెట్టీ వాయనం ఇప్పించారు. తమిళియన్స్ లాగానే వీళ్ళు కూడా మంగళ సూత్రం ఒక ముడి అత్తగారు కానీ ఆడపడుచు కానీ వేస్తారు. తర్వాత వియ్యపురాలు కు స్వీట్స్ అవీ ఇవ్వడానికి కూడా ఒక పూల పందిరి లాగా వేసి దానికి కాకరకాయలు కట్టారు ఆ పందిరి కింద అత్త గారిని కూర్చోపెట్టి ఆ స్వీట్స్ మిగిలిన లాంఛనాలు అన్నీ చేశారు. అన్నిటి కన్నా హై లైట్ ఏమిటంటే సప్త పది అని డెకరేషన్ వాళ్ళ చేత పూల తో ఏడు అడుగులు వాటి అర్థం కూడా వ్రాసి అడుగులు డిజైన్ వేసి అలంకారం చేశారు. అక్కడ ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చేత అడుగులు వేయించటం చాలా బాగుంది. అలా మన ఆచారాలు వాళ్ళ పద్దతులు తో పెళ్ళి అంతా సందడిగా సరదాగా సాగింది. పెళ్ళి అంటే ఒకరి తో అయ్యే పని కాదు కదా అక్కడ మా ఇంట్లో వున్న యంగర్ జనరేషన్ అంతా తలా ఒక పని చేస్తూ పెళ్లి అంతా సందడిగా సరదాగా జరగటానికి సహాయం చేశారు. అక్కడ ఉన్న అందరూ ఎపుడూ చిరునవ్వుతో అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు అయితే ఎపుడూ నవ్వుతూ సరదాగా వుంటారు. పెళ్లి కూతురి అమ్మ గారు మా అన్నయ్య కూతురు, సో నేను అక్కడే ఉండి మా అన్నయ్య ను వదినను తలచుకుంటూ వాళ్ళు ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ వాళ్లని ఆశీర్వదించాను మీ జీవితం అంతా ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ గాడ్ bless your family

పెళ్ళి వారు పెళ్ళి కూతురును విడిది లోకి తీసుకొని వెళ్లి బాగ్యద లక్ష్మీ రావమ్మా అనే పాట పాడారు. అది కూడా చాలా బాగుంది.

 
 
 

Recent Posts

See All
రేడియో గది

రేడియో కి ఒక గది ఉంటుందా అనుకుంటారేమో, మా చిన్నతనం లో మేడ మీద ఒక పెద్ద వరండా కి పక్కగా ఒక గది వుండేది. ఈ మధ్య నేను ఏదో బుక్ రాస్తూ...

 
 
 
అమ్మ కు ప్రేమతో

ఈ రోజు మాతృ దినోత్సవం అదే మదర్స్ డే అని ఉదయాన్నే పేపర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్ లో ఒకటే హోరు గా పోస్టులు. ప్రత్యేకంగా మనం ఒకరోజు అని గుర్తు...

 
 
 
యజ్ఞము

ఇలా రాయగానే నేనూ ఎదో యజ్ఞం చేశాను అనుకునేరు.ఇది ప్రతి ఎండాకాలంలో చేసే ఆవకాయ యజ్ఞము. ఒక వారం క్రితం కొత్త ఆవకాయ అంటూ ఒక బాటిల్ తెచ్చి...

 
 
 

Kommentarer


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page