ప్రయాణంలో పద నిసలు
జీవితమే ఒక ప్రయాణం అందులో ఏన్నో పదనిస లు
అందుకే భావుక మిత్రులు ప్రయాణ సాధనాలు ఫోటోపెట్టమన్నారు అనుకుంటా.
ప్రయాణాల్లో ఏన్నో పద నిసలు వున్నాయి.. అందులో లేడీ కి లేచిందే పరుగు లాగా
మా వారు సడన్ గా కారు లో బయలుదేర మంటే ఏన్నో పదనిస లు .
అలాంటి సాహస యాత్రలు మా పిల్లలు కీ అలవాటు అయిపోయి ఎంజాయ్ చేసే వారు.
అలాంటి వాటిల్లో శ్రీశైలం ప్రయాణాలు ఎన్ని సార్లో వెళ్ళాము. ఎప్పుడూ ఏదో ఒక
హడావిడి వుంటుంది.. మొదటి సారి లంచ్ కి వచ్చి శ్రీశైలం వెళ్ళాల నుకున్నాను
మీరు త్వరగా రెడీ అవండి , నేను కారు తీసుకుని వస్తాను.
నేను పిల్లలు మా ఆమ్మ, అత్తగార్లతో రెడీ ఇంకొక గంట కి కారు తీసుకుని రాగానే బయలుదేరాము.
ఘాట్ రోడ్డు 8 గంటలకు క్లోజ్ చేస్తారు. ఈ లోపల వెళ్లగలమా, అనీ నేను అనగానే , నీకు అన్నీ డౌట్స్ కొత్త రోడ్డు డిండి వైపు వుంది అదీ దగ్గర అంటూ ఊరు దాటాము.
ఆ రోడ్డు ఇప్పటిలాగా లేదు.
సింగిల్ రోడ్డు రోడ్డు కూడా బాగులేదు. వెళ్తూ ఉంటే మైల్ స్టోన్స్ అమంగల్ అనీ చూపిస్తూ ఉంటే నాకు ఈ వూరి పేరు ఏమిట్రా బాబూ అనీ భాధ
అమంగల్ దాటుతూనే టైర్ పంక్చర్ , టైర్ మార్చి కల్వకుర్తి చేరాము.
ఇప్పుడు మీరు ఘాట్ రోడ్డు దాట లేరు . పెట్రోల్ బంక్ దగ్గర ఏదో చిన్న హోటల్ వున్నది. అనీ కల్వకుర్తి లో చెప్పగానే ఆ బంక్ చేరుకున్నాము.
మా అమ్మగారు అల్లుడిని చూసి మాట్లాడకుండా నాకు సైగలు భయం తో, మా అత్తగారు కొడుకు తో మాట్లాడాలి అంటే భయం సో నాకే గుసగుసలు తో మద్దెల దరువు.
ఏదయినా సాధించాలి అనే పట్టుదల వున్న మావారు ఆ బంక్ ఓనర్ గారితో మాట్లాడి పెద్ద వాళ్ళని ఇద్దరినీ వాళ్లకు తోడుగా నన్ను ఆ ఓనర్ గారి ఇంట్లో పడుకున్నాము.
పిల్లలు, ఆయన టేప్ లో పాటలు వింటూ వెన్నెల రాత్రి ఎంజాయ్ చేస్తూ మర్నాడు
నేను ఎంత అడవెంచర్ మిస్ అయ్యానో వర్ణించి చెప్పారు.
ఒక రెండేళ్ల క్రితం కూడా రెండు కార్లల్లో అల్లుడు గార్లతో శ్రీశైలం బయలు దేరితే ఇప్పుడు రోడ్డు బాగున్నా ఒక కారు కి టైర్ పంచిర్.
టైర్ మార్చ గానే మా ఆబ్బాయి , మా అల్లుడు డ్రైవర్ లని పక్కన పెట్టీ
టైమ్ లోపల ఘాట్ రోడ్డు దాటించారు.
ఆరోజు వాయు వేగ మనో వేగాలు అంటే అర్ధం అయింది. తొమ్మిది గంటలకు కల్లా రిజర్వు చేసిన బంగాళా ముందు ఆపాక నేను కళ్ళు తేరి చాను.
ఇలా ఏన్నో సాహ స యాత్ర ల్లో పద నిసలు ఇంకో సారి ఇంకొక యాత్ర తో
ఏన్నో ప్రయాణాల్లో పదనిస లు వున్నా ఒక పద నిస తల్చుకుంటే ఇప్పటికీ నిరాశ గా వుంటుంది.శ్రీ శైలం ఎప్పుడు వెళ్ళినా ఏదో హడావిడి
వుంటుంది
మా వారు
ఆర్ ఎస్ ఎస్ లో యాక్టీవ్ గా ఉండేవారు. ఫ్యాక్టరీ లో బిజీ గా ఉన్నా ఏవో మీటింగ్స్ అటెండ్ అయ్యే వారు..
శ్రీశైలం లో శివాజీ స్ఫూర్తి కేంద్రం శంకు స్థాపన కీ అయన ఒక్కరే వెళ్లారు.తర్వాత దసరా ల్లో అక్కడ చండీ హోమం ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ చేస్తూ వున్నారు, రమ్మని ఆహ్వానం
ఇచ్చి వెళ్లారు. లింగ మూర్తి గారు అనే ఆయన
దసరా ల్లో కాబట్టి మీ అమ్మాయి లను తీసుకుని రండి , చాలా ప్రోగ్రామ్స్ వుంటాయి అనీ ప్రత్యేకంగా చెప్పారు.
మా అమ్మాయిలు ఇద్దరూ, మా అన్నయ్య పిల్లలు అందరం కలిసి బయలు దేరాము.
ఈ సారి డిండి రోడ్డు కాకుండా అచ్చెంపేట రోడ్డు మీద వెళ్ళాము .
షరా మాములుగా అచ్చమ్ పేట లో కారు పాడైయింది . అక్కడి మెకానిక్ డ్రైవర్ ఇద్దరూ చేతులు ఎత్తేశారు.
అప్పటికే చీకటి పడుతున్నది కనీసం బస్సు లో అయినా వెళ్దాం అనీ బస్సు స్టాండ్ కీ వెళ్ళాము.
అరోజుల్లో ఏన్నో బస్సులు ఉండేవికావు , రెండో మూడో ఉండేవి . పండగ కదా కిటకిట లాడుతూ నిల్చొని వెళ్ళే అవకాశం కూడా కనిపించ లేదు. సుఖం గా ప్రయాణాలు చేయటానికి అలవాటు పడ్డ ఈ పిల్లలు బస్సు ఎక్కటానికి తయారు గా లేరు.
నాకు ఎలాగయినా వెళ్ళాలి పూజలు చూడాలి అనీ ఉన్నా ఆ బస్సు లో రష్ చూసి వెనక్కి తగ్గాను..
అసలు సమస్య అప్పుడు మొదలు అయ్యింది . ఆ ఊళ్ళో హోటల్స్ లేవు. రాత్రికి ఏ చేయాలి అనీ సమస్య. ఆ మెకానిక్ షాపు వాడు ఆర్ ఎండ్ బి గెస్ట్ హౌస్ వుంది
అంటూ తీసికుని వెళ్ళాడు..
మాములుగా ఆ గెస్ట్ హౌస్ లు గవర్నమెంట్ వాళ్లకే ఇస్తారు. ఆ వాచ్ మెన్
ఆరుగురు పిల్లలు తో వున్న మమ్మల్ని చూసి అక్కడ వున్న గుమస్తా ని పిల్చుకు వచ్చాడు.
వాళ్ళు వెంటనే గేట్ తెరిచి మాకు అక్కడ రూములు ఇవ్వట మే కాకుండా రాత్రికి భోజనం, మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తెచ్చి పెట్టా రు
ఆ గెస్ట్ హౌస్ విశాలామైన అవరణ మధ్యలో అన్నీ వసతుల వున్న బంగళా.
మా పిల్లలు కీ తెగ నచ్చింది.
నాకు మాత్రం ఆ బంగ ళా చూసాక
అందరూ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనీ ఎందుకు అనుకుంటారో అర్ధం అయింది.
మర్నాడు కూడా మా కారు లో కావాల్సిన పార్ట్ ఆ ఊర్లో దొరకడం లేదు..
మా పాడు అయిన కారుని వెనక కట్టుకుని హైదరాబాద్ తేవటానికి ఒక పెద్ద ట్రక్ మాత్రం దొరికింది.
మేము వూరేగింపు లాగా కారు లో ముందు ట్రక్ తో అతి జాగ్రత్తగా ముందు ట్రక్ కీ అనువుగా ప్రయాణం చేస్తూ రాత్రికి యింటికి చేరాము.
నేను మా వారిని, మా వారు డ్రైవర్ ని కార్లు సరిగ్గా మైంటైన్ చేయటం లేదు అని దారి పొడవునా
ఒకరినొకరం మర్యాద చేసుకుంటూ యింటికి చేరాము.
పూజలు చూడలేకపోయాను అనే బాధ తో నేను రెండు రోజులు మూడ్ ఆఫ్ చేసుకున్నాను.
పండగ అయిన ఒక మూడు నాలుగు రోజులకు లింగ మూర్తి గారు పేరు బాగా గుర్తు లేదు, పూజ కుంకుమ ప్రసాదము తో పాటు ఒక రాజరాజేశ్వరి రూపుఁ యింటికి తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ రోజు ఆయన అవీ నా చేతికి ఇస్తున్నప్పుడు నాకు
కలిగిన ఆనందం వర్ణించలేను.
నేను వెళ్ళ లేకపోయినా అమ్మవారు తన రూపుఁ తో యింటికి వచ్చారు కదా అని.
మూర్తి గారు కూడా ఆ రోజు మావారి హడావిడి ప్రయాణాలకి పెద్దరికంగా హెచ్చరించారు.
ఆ తర్వాత శ్రీ శైలం వెళ్ళినప్పుడు స్ఫూర్తి కేంద్రంకి వెళ్ళాము. అక్కడ పేరు వేయించకపోయినా ఒక రూము మా వారు ఇచ్చిన డొనేషన్ తో వున్నది అని చెప్పారు.
అక్కడ భోజనం కూడా చేసాము.
అక్కడ నుండీ ప్రాజెక్ట్ వ్యూ కూడా చాలా అద్భుతం గా వుంటుంది. వేద పాఠశాల కూడా వున్నది.
ప్రయాణంలో పదనిస లు
ఈ పద నిస లు గురించి రెండు సార్లు రాసాను. అయితే అవీ కొంచెం మన అశ్ర ద్ద వల్ల జరిగినవి.
ఈ రెండు సంఘ టనలు మనకు సబంధము లేక పోయినా ఎదుర్కోవాల్సి వచ్చినవి.
ఆ రెండూ ఘుటన లు గుర్తు వస్తే ఇప్పటికీ ఆమ్మో ఎలా అనే భయం వేస్తుంది.
1969 లో మూడో నెల పాపాయిని, తోడుగా మా పెద్దమ్మ ని తీసుకుని జి టీ లో ఢిల్లీ బయలు దేరాను. అంత దూరం మా ఆమ్మ గారిభాషలో మగ తోడు లేకుండా.
ఒక్కదాన్నే.
మా భోగిలో కాన్పూర్ ఐ ఐ టీ స్టూడెంట్స్ చెన్నయ్ నుంచీ వెళ్ళే వాళ్ళు వున్నారు. వాళ్ళు పాపాయి తో ఆడుతూ సరదా గా
కబుర్లు చెప్పు కుంటూ భోపాల్ చేరాము.
భోపాల్ ఆగగానే ఏదో కలకలం , వాళ్ళు దిగి కనుక్కుంటే మా భోగి కన్నా ముందు భోగి లో మంటలు వచ్చాయిట.
మా భోగి కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఆ స్టూడెంట్స్ దిగి అన్నీ కనుక్కుని
మమ్మల్ని, మా ట్రంక్ పెట్టె లను దింపి వేరే భోగి లో అయితే ఎక్కించారు. కానీ సీట్లు లేవు. మా ట్రంక్ పెట్టె మీద మా పెద్దమ్మ పాపాయిని పెట్టుకుని కూర్చుంది.
మాకు కావాల్సిన పాలు పండ్లు అవీ కొని ఇచ్చి వాళ్ళు అక్కడ నుండీ బస్సు లో
వెళ్తామని దిగి పోయారు.
ఆ రోజుల్లో ఫోన్లు కూడా అరుదే కదా, ఢిల్లీ లో వున్న అన్నయ్య ఫోన్ ఇచ్చాను. వాళ్ళు
అన్నయ్య కీ ఫోన్ చేస్తాము అని చెప్పి భయ పడ వద్దని చెప్పి వెళ్లారు.
మా పెద్దమ్మ తో సుగుణం ఏమిటీ అంటే ప్రశ్నలు వేయకుండా రామనానామము చేస్తూ ఉంటుంది..
ఆ జి టీ ఎక్సప్రెస్ ముక్కుతూ రాత్రి పది గంటలకు ఢిల్లీ చేరింది. ఢిల్లీ స్టేషన్ లో అన్నయ్య, మా వారు సిగరేట్ పాకెట్స్ ఖాళీ చేస్తూ
టెన్షన్ పడుతున్నారు.
స్టేషన్ లో వాళ్ళని చూడగానే అంత దాకా వు ఈన్న దయిర్యం పోయి ఏడ్పు వచ్చింది.
ఇద్దర్నీ హగ్ చేసుకుని ఒకటే ఏడుపు. పాపాయితో వచ్చావు ఏడ్పు ఆపు అని మా పెద్దమ్మ మండలించిన దాకా. అలా ఆ పదనిస ప్రయాణం ముగిసింది.
1971 డిసెంబర్ లో మావారు ఎగ్జా మినర్ గా పీలాని వెళ్తూ నన్ను, పాప ని ఢిల్లీ లో అన్నయ్య దగ్గర దింపారు. ఒక వారం తర్వాత ఆయన వచ్చాక మూడు గంటలకు పాటియాలా ఊరుకి బస్సు ఎక్కాము. బస్సు కురుక్షేత్ర దాటుతూనే ఆపేసారు.
రోడ్డు అంతా మిలిటరీ ట్రక్కులు అంతా గంద్ర గోళం ఎవర్ని బస్సు కూడా దిగనివ్వలేదు.ఏమీ జరిగింది కూడా తెలియదు.
ఒక అరగంట తర్వాత మిలటరీ వాళ్ళు మైక్ పెట్టీ ఇందిరా గాంధీ పాకిస్తాన్ తో వార్ డిక్లేర్ చేసింది. ముందు అంబాలా కంటోన్మెట్ ఏరియా బస్సులు కదలవు
సైరన్ వస్తే అందరూ పక్కన వున్న బంకులు లో కూర్చోవాలి అని .
అని చెప్పారు.
ఆ చీకటి , మాటలు కూడా మాట్లాటానికి ఎవరికి ఆలోచన కూడా లేదు. పిల్లలు కీ ఒక గ్లాస్ పాలు ఒక బిస్కెట్ పాకెట్ ఇచ్చారు.
ఏ పరిస్థితి లో నయినా భయ పడితే మా వారికీ చికాకు , ప్రశ్న కూడా వెయకుండా హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను.. మా పాప అయితే ఆ చీకట్లో నన్ను బల్లి లాగా అతుక్కు పోయింది.
మరలా మన వాళ్ళని చూడ గలమా యింటికి వెళ్తామా లేదా అనిపించింది
మర్నాడు మధ్యహ్నం నుండీ అన్నీ బస్సులు వాళ్ళు ని మిలిటరీ ట్రక్కు ల్లో ఎక్కించి పంపారు సెంటర్ లో ఆగితే ఎస్కార్ట్ తో ఇంటి దాకా నడక
యింటికి వచ్చాక కూడా పది రోజులు కర్ఫ్యూ.
ఇంట్లో రాత్రి పూట లైట్స్ వేసుకోకూడదు , కిటికీలకు బ్లాక్ పేపర్ అంటించుకోవాలి.
సైరన్ వస్తే బంక్ లకు పరిగెత్తాలి అలా రెండు సార్లు చేయాల్సి
వచ్చింది.. ట్రాన్సిస్టర్ వింటూ న్యూస్ తెలుసుకోవటం తప్పితే ఏమీ తెలియదు.
మనవాళ్ళని చూస్తామా అనే దిగులు తో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో అనే బాధ.
ఒక పది రోజులకు ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ వచ్చిందని డిక్లేర్ చేసింది.
మేము కూడా ఊపిరి పీల్చుకున్నాము.
ఒక పదిహేను రోజుల తర్వాత మా మిలిటరీ ఆంధ్ర తమ్ముళ్లు స్వీట్స్ తీసుకుని వచ్చారు. సెలెబ్రేషన్స్ లో భాగంగా ఒక రెండు రోజులు బ్రిడ్జ్ తనివి తీరా ఆడుకుని సేద తీరారు యూనివర్సిటీ ఫ్రైండ్స్ .
ముందుగా ఆంధ్రాలో వున్న మన వాళ్లకు ఫోన్లు టెలిగ్రాములు, పంపాము
ఢిల్లీ అన్నయ్య అయితే మర్నాడే ఆదే ఊర్లో వున్న ఎస్కార్ట్స్ ఆఫీసు నుండి క్లర్క్ ని పంపాడు.
ఇలాంటి అనుభవం ఎవరికీ వద్దురా బాబూ అనిపించేది. పాలు కూరలు కూడా దొరకవు.
ఆ పది రోజులు అయితే ప్రాణాలు అరచేతిలో అంటే ఏమిటో అర్థం అయింది.
ఇప్పటికీ ఎక్కడ అన్నా వార్ అంటే ఆ రోజులు గుర్తు వస్తాయి..
దసరా వస్తే శ్రీశైలం ప్రయాణం గుర్తు వస్తుంది. మా పిల్లలు మాత్రం ఆ గెస్ట్ హౌస్ గుర్తు చేసుకుంటూ వుంటారు.
అచ్చంపేట లాంటి ఊర్లో అంత చక్కటి గెస్ట్ హౌస్ ఉన్నందుకు .
అవీ పదనిసలు పాట శుభ రాత్రి
Comments