డిటెక్టివ్ నవల
ఈ రోజు ఫేస్ బుక్ లో కొమ్మూరి సాంబశివరావు గారి గురించి రాసారు ఆయన పా త రోజుల్లో డిటెక్టివ్ నవలలు రాశారు టా .
అయితే అప్పుడు ఆయన పేరు తెలియదు కానీ ఆ నవలలు అపుడు చదివే దాన్ని.
ఆ రోజుల్లో ఆ నవలలు చదవటం చాలా తప్పు గా భావించే వారు .
పుస్తకాలు కూడ పాకెట్ సైజ్ లో ఉండేవి . మా అన్నయ్య అవి రోజూ జేబులో పెట్టుకుని తెచ్చే వాడు .
అవి అద్దెకు దొరికేవి అనుకుంటా. ఇంట్లో చందమామ , వార పత్రికలు వచ్చేవి . చందమామ అయితే రైట్ రాయల్ గా చదవచ్చు ఈ పత్రిక
మాత్రం చిన్ పిల్లల కు నీకు ఎందుకు అనే వారు .
మా పెద్ద నాన్న గారు అక్కయ్య కోసం తెప్పించే వారు . డిటెక్టివ్ నవల అయితే అన్నయ్య ను బ్రతిమి లా డి తేనే దొరికేది.
అదీ నాన్న గారు ఇంట్లో లేనప్పుడు క్లాస్ పుస్తకం లో పెట్టుకుని చదివే వాళ్ళము .
డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు చాలా సస్పెన్స్ తో. ఉత్కంట ga ఉండేవి .
చండీ రాణి అని. ఒక సీరియల్ లాగా ఒక పది బుక్స్ వచ్చినట్లు గుర్తు.
ఇప్పుడు పేర్లు అంతగా గుర్తు లేవు కానీ ఆరోజుల్లో అవి చదవటం చాలా ఇంటరెస్టింగ్ గా ఉండేది. తర్వాత అన్నయ్య చదువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయాక ఆ నవలలు సెలవుల్లో వచ్చినప్పుడు తెచ్చే వాడు .
అలా ఆ డిటెక్టివ్ నవలలు తో పుస్తకాల కి ఎడిక్ట్ అయిపోయాను
ఇప్పటికే రోజు ఏదో ఒక బుక్ చదవక పోతే ఏదో వెలితి గా ఉంటుంది.
తర్వాత అన్నయ్య బాగా ఇంగ్లీష్ అగాథ క్రిస్టీ , ఇంకా అలాంటివే ఎక్కువగా చదువుతూ ఉండే వాడు .
నేను మాత్రం ఆ క్రైమ్ నవలలు కాకుండా క్లాసిక్స్ వైపు కి మారాను
ఇప్పుడు చిన్న వయసులో నే క్రైమ్ ,హారి పాటర్ లు అందరూ చదువుతున్నారు .
ఆ రోజుల్లో ఏమిటో అలాగా రిస్ట్రిక్షన్ ఉండేవి.
నేను డిటెక్టివ్ నవలలు చదివేదాన్ని అని చెప్తే మా వారు కూడా మొదట్లో ఆశ్చర్యం పోయారు .
ఆరోజుల్లో అదొక రౌడీ లక్షణం టా ఇప్పుడు అగాథ క్రిస్టీ బుక్ చేతిలో ఉంటే గొప్ప .
ఈ రోజు ఫేస్ బుక్ లో. ఆ పోస్ట్ చూసి ఇవ్వన్ని గుర్తు వచ్చాయి .
ఆరోజుల్లో చదవటమే కానీ. ఎవరు రాసారు అనే విషయం తెలిసేది కాదు .
ఇప్పటికీ నాతో పాటు
a పెద్ద అమ్మాయి కూడా ఏ బుక్ అయినా చదువుతూ ఉంటుంది . ఆస్ట్రిక్ బుక్ నుంచి abstract దాకా .
Comments