అట్ల తదియ ముచ్చట్లు
మా అమ్మమ్మ గారు ఆమ్మ దగ్గర వుండే వారు. ఎప్పుడైనా ఆమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరిస్తే ఏవో చిన్నప్పటి
కబుర్లు చెప్తూ ఉండేవారు. దగ్గర కూర్చుని వింటే ఆవిడ కు తృప్తి గా ఉండేది.
ఆవిడ చిన్నప్పటి కబుర్లు ఏవో చెప్పే వారు. లేకపోతే మేము వెళ్ళినప్పుడు ఎంత అల్లరి చేసే వాళ్లమో అలా ఉండేవి ఆవిడ కబుర్లు.
మా అమ్మగారు రోజూ ఏమీ వుంటాయి కబుర్లు అనే వారు , రామా కృష్ణ అనుకో అని చెప్పే వారు.. వెంటనే ఆవిడ ఎంత సేపు అనుకుంటాను రామ రామ అనీ అని విసుక్కునే వారు.
పండగ కబుర్లు చెప్పకుండా ఈ సోది ఏమిటీ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పండగ ల గురించి పెద్ద గా ఎవరికీ తెలియదు . కడ్వా చౌత్ అంటే అర్ధం అవుతుందేమో హిందీ సినిమా పుణ్యం అనీ
అయితే మనకు అమ్మమ్మ లాగా ఏవో విశేషాలు గుర్తు వస్తూ వుంటాయి. ఇదివరకు అయితే గుర్తు వచ్చినప్పుడు డైరీ లో రాస్తూ వుండే దాన్ని . ఇప్పుడు కోతి కీ కొబ్బరి కాయ లాగా బ్లాగ్ , ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ఇలా ఏన్నో మన ఆలోచనలు
పంచు కోవటానికి.
అలా ఈ రోజూ ఈ తదియ కబుర్లు చెప్పుకుందాం . ముందు గా మన వెనకటి తరం అమ్మ గారు వాళ్లకు
ప్రతీ చిన్న పండగ కానీ, ఫంక్షన్స్ కానీ ఎంతో శ్రద్దగా ఓపిక గా చేసే వారు.
మా ఆమ్మ గారికి తోడుగా మా ఆత్త గారికి కూడా అంతే సరదా ఉండేది. అందుకే ఏ పండగ వచ్చినా
చాలా ఓపికగా , ఇంటరెస్టింగ్ గా చేసే వారు. ఇంకా మా ఆత్త గారు అయితే పిండి వంటలు కూడా బాగా చేసే వారు.
నేను మాత్రం ఏమీ నేర్చుకోలేదు . ఆవిడ దగ్గర మొదట్లో పూజలు కీ సహాయం చేసే దాన్ని , అలా అసిస్టెంట్ గా ఉండి
పూజలు అలవాటు అయిపోయాయి. ఇంక తదియ కబుర్లు వినండి
అన్నీ పండగ లాగానే ఈ పండగ కూడా మా చిన్న తనము లో చాలా హడావిడి ఉండేది. ముందు రోజు భోగి తలంట్లు, గోరింటాకు పెట్టుకోవటం.
మర్నాడు తెల్లవారుజామున లేచి షరా మాములుగా జడ కుచ్చులు తో జడలు పట్టు లంగాలు తలలో చేమంతుల తో తయారు అయిపోయి భోజనాలు గోంగూరపచ్చడి , కంది పచ్చడి వగైరా లతో .
జడ లో చేమంతి పూలు అంటే నాకు చికాకు గా ఉండేది, కానీ జడ లో పూలు పెట్టు కోవాల్సిందే
సన్న జాజులు, మల్లెలు అయితే ఇంట్రెస్ట్ గా ఉండేది. ఇప్పడు జడలే లేవు , ఇంక పూ లు ఎక్కడ
ఏ అడపిల్ల ని చూసినా నాకు సీ నా రే గారి పాట లు గుర్తు వస్తాయి చుక్కలతో నొక్క సారి సూచింతును నా కన్ని యా
నల్లని వాల్ జడ లోపల మల్లియ నై నవ్వా లని , తల దండ పూ దండ దాల్చిన రాణి చక్కటి భావ గీతా లు
కాలం తో ఏన్నో మార్పులు.
కొంచెం కాలేజీ కీ వచ్చిన దాకా అన్నయ్య లు ఈ పండగ కూడా లేచే వారు.
అసలు హుషారు ఉయ్యాల లు ఊగటం లో ఉండేది.
ఈ పండగకి ఊర్లోనే వున్న అత్తయ్య పిల్లలు మా యింటికి రావటమో మేము అక్కడికి వెళ్ళ టమో జరిగేది.
అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద వేప చెట్లు ఉండేవి. వాటికీ వేసే ఉయ్యాల లో ఊగటం చాలా హు ఇంకా హుషారుగా వుంటుంది.
ఊ గే వాళ్లకు , ఊపే వాళ్లకు ధై ర్యం ఉంటే ఇంకా హుషారుగా వుంటుంది. ఉయ్యాల ఊపే టప్పుడు పెద్దగా ఊప వద్దు
అన్నా ఎవరూ వినరు కదా అలాగే భయ పడుతూ ఊగటం.
నాకు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఉదయాన్నే లేవటం అంటే చాలా బాధ గా వుంటుంది.
ఈ పండగకి మాత్రం ఎలాగో చికాకు పడుతూ లేచే దాన్ని
ఇంక మా ఇంట్లో అయితే చెట్లు లేవు మా ఆమ్మ గారు మేడ మీద వరండా కే చిన్న ఊయల వేయించే వారు.. అదయితే పెద్దగా ఊగు దాం అన్నా ముందుకు పోదు. ఆలా అన్నయ్య లతో అత్తయ్య పిల్లలు తో ఉయ్యాల పేచీ లేదు.
అయితే మా డాబా మీద తదియ వెన్నెల్లో ఏన్నో ఆటలు ఆడే వాళ్లము.. ఆటలు, కబుర్లు, నవ్వులు ముచ్చట్లు ఎంతో హాయిగా ఉండేది.
భయ పడుతూ. వూగే ఉయ్యాల కన్నా ఈ ఆటలు బాగుండేవి.
మా అత్తయ్య కూతురు, మా అన్నయ్య లు పొడుగ్గా వున్న చేతుల్లో ఉప్పాట ఆడితే ఎప్పుడూ వోడి పోవటమే
ఆ రోజుల్లో ఆడిన ఆటలు తల్చుకుంటే ఇప్పటి పిల్లలు ఎన్ని మిస్ అయ్యారు అనిపిస్తుంది
తెల్లవారా కా గౌరీ దేవీ ప్ర సాదం అని అట్లు బెల్లము వేసి పెట్టే వారు. ప్ర సా దం తినాల్సిందే కదా .
ఒక్కొక్క సారి మా తాత గారు ఈ పండగకు కూడా పిల్లలు ని పంపమని ఉత్తరం రాసే వారు.
అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎప్పుడూ డిస్నీ ల్యాండ్ వెళ్తున్న ట్లు హుషారుగా ఉండేది.
అక్కడ ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉండేది, ఆకు కోసి పెద్ద రోట్లో వేసి రుబ్బుతుంటే పక్క నే ఉండి మధ్య మధ్యలో ఆకుని నెడుతూ చేయి ఎంత పండిందో చూసు కుంటూ ఉండేవాళ్ళము.
అక్కడ వంట బామ్మగారు మా కోసం స్పెషల్ గా బంగాళాదుంప వేపుడు చేసే వారు.
అక్కడ మా పెద్దమ్మ , అమ్మమ్మ దగ్గర మా కు బాగా గారాబం సాగేది , అక్కడ కూడా వేప చెట్లకు ఉయ్యాల వేసినా మా పిన్ని కొడుకులు అంతగా విసురుగా ఉయ్యాల ఊపే వారు కాదు.
అలా అమ్మమ్మ దగ్గర పండగ హడావిడి ఉండేది
ఈ తదియ కూడా ఏవో నోములు ఉండేవి.. మా ఆమ్మ గారు నా చేత రెండు తదియ నోములు చేయించారు. నోము నోచుకునే ముందు రోజు అందరి యింటికి వెళ్ళి గోరింటాకు కుంకుడు కాయలు అవీ ఇచ్చి రావాలి. తదియ నాడు ఉదయం గౌరీ పూజ చేసి వాళ్లకు అట్లు వాయనం ఇవ్వాలి..
మేము హైదరాబాద్ వచ్చాక మా ఆత్త గారు మా ఆడబడుచు చేత ఈ నోము చేయించారు. అయితే అందరం ఇంట్లో వాళ్ళమే తెల్ల వారుజామున భోజనాలు, అట్లు వాయినాలు ఇప్పించారు.
ఉద్యా పన కీ అయితే పదకొండు మంది కీ ఇవ్వాలి. ఆ రోజుల్లో దగ్గర్లో చాలా మంది వుండే వాళ్ళు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు.
అన్నీ అట్లు పోసి వాయినాలు ఇప్పించిన మా అమ్మగారి, అత్తగార్ల ఓపిక కు మెచ్చుకోవాలి.
సావిత్రి గౌరీ నోములో కూడా అమ్మవారికి ఒక రోజు అట్లు నివేదన చేస్తారు..
ముప్పై మూడు పౌర్ణమి ల నోము లో కూడా అట్లు నివేదన చేయాలి.
ఆ నోము గురించి ఇంకో రోజు ముచ్చట చెప్పుకుందాం.
మా పిల్లలు చిన్నప్పుడు మా ఆత్త గారు ఆమ్మ వున్నారు.. చాలాసార్లు ఈ తదియ ల పండగ చేసాము.
ఇప్పుడు మా అమ్మాయి లకు చెప్తే అబ్బా అంత పొద్దున్నే ఎక్కడ లేస్తాం అంటారు.
హిందీ సినిమా పుణ్యం మా అని ఇప్పటి వాళ్ళ కు కడ్వా చౌతి తెలుసు కానీ
ఈ పండగ తెలియదు.
అట్ల తద్దోయ్ ఆరాట్లోయ్ అంటూ ఊహల ఉయ్యాల ఊగుదాం
అట్ల తదియ శుభాకాంక్షలు
Comments