top of page
Search

ఆర్యా ద్విశతి

murthydeviv
3 minutes ago
2 min read

ఆర్యాద్విశతి


పూర్వకాలంలో ఆస్తికులు ఉదయం స్నానం చేయగానే ఆర్యాద్విశతిని మననం చేసేవారుట. అదే వారికి కంఠాభరణంగా వుండేది. అని చంద్రశేఖరస్వామి వారి పలుకులు. తెలుగులో శ్రీచక్ర నగర వర్ణనమే దుర్వాస మహర్షి రాసినది ఆర్యాద్విశతి.


జగన్మాత లలితాంబ రూపంలో అనేకమంది మహాకవుల చేత, ఋషుల చేత కీర్తించబడింది. ఆమెకు దుర్గ, కాళి, అన్నపూర్ణ వంటి అనేక రూపాలు వున్నప్పటికీ, శ్రీ విద్యా తంత్రానుసారం లలితాంబ రాజేశ్వరి, కామేశ్వరి, కామాక్షి, త్రిపురసుందరిగా అర్చించబడుతున్నది. త్రిపురసుందరిని కీర్తించిన అనేక స్తోత్రములలో శంకరుల సౌందర్యలహరి, మూకకవి విరచితమైన మూకపంచశతి, దుర్వాస మహర్షి చేత ఆర్యాద్విశతి ముఖ్యమైనవి. కాలాన్ని పట్టి చూస్తే ఆర్యాద్విశతి పురాతనమైనది. ఆర్యాద్విశతి, సౌందర్యలహరి, మూకపంచశతి, ఈ క్రమంలో సౌందర్యలహరి కేంద్రస్థానాన్ని పొందింది. ఈ ముగ్గురూ మన పీఠాధి దేవత కామాక్షితో ప్రత్యేక సంబంధం కలవారే! కామకోష్టపు పూజా విధానం ఏర్పరచినది దుర్వాస మహర్షి. ఈనాటికీ ఆ మహర్షిచే విధింపబడిన విధానంలోనే పూజలు సాగుతున్నాయి.


కామాక్షిదేవికి, కామకోటి పీఠంతోనూ, ఆచార్యులువారి అనుబంధం జగద్విదితమే కదా! మూకకవి కామాక్షి కటాక్షం వలన కవిత్వం చెప్పగల శక్తి పొంది అయిదు వందల శ్లోకాలతో స్తుతించారు.


ఆర్యాద్విశతి అన్నది లలితాంబికపై వ్రాయబడిన రెండువందల శ్లోకముల కూర్పు. ఈ ఆర్యాద్విశతి అరుదైన ఆర్యా చంధస్సులో ఆర్యా మహాదేవిపై వ్రాయబడిన అపురూపమైన స్తోత్రము. ఆర్యా అన్నది అంబిక నామము ఆర్యా చంధస్సులో ఆర్యా మహాదేవిపై వ్రాయబడిన ఈ రెండువందల శ్లోకములు ఆర్యాద్విశతి అనటం ఎంతో సబబుగా వున్నది. దీనికే లలితాస్తవ రత్నము అని ఇంకో పేరు వున్నది. అంబికకు భట్టారిక అని మరో పేరు వున్నది. భట్టారక అంటే పూజనీయమైనది. భట్టారక శబ్దానికి స్త్రీ లింగము భట్టారిక. అయితే విశిష్టులైన అంబికా భక్తులు ముగ్గురూ భట్టారుకులగా పిలవబడ్తున్నారు. వారిలో పరమేశ్వరుడు ప్రథముడు. ఆయనకు పరమశివ భట్టారకుడు అన్న పేరు వున్నది. ఇంకొక భట్టారకుడు మహాకవి కాళిదాసు. ఉజ్జయినీ మహాకాళి అనుగ్రహం వలన అశేష శేముషీ వైభవమును, కవితా పౌఢిని పొందిన ఈయన శ్యామలా దండకం వ్రాసారు. ఈయనను శృంగార భట్టారకుడు అంటారు. ఒక భట్టారకుడు దైవము, ఒకరు మనుష్యుడైన కాళిదాస భట్టారకుడు. లఘుభట్టారకుడు.


దేవతలలోని ఋషులకు దేవర్షులని పేరు. మానవులలో కూడ అనేకమంది మహర్షులు వున్నారు. దేవతల్లో ఒక భట్టారకుడు, ఋషుల్లో ఒక భట్టారకుడు. ఋషుల్లో అంబిక అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవారు దుర్వాసమహర్షి. ఈయన జగత్ప్రసిద్ధుడైన ముక్కోపి. అందువలన ఈ భట్టారకునికి క్రోధ భట్టారకుడని పేరు. ఈ లోకానికి చెందినవారిలో అంబికను శ్లోకములతో మొట్టమొదట స్తోత్రం చేసినవారు ఈ క్రోధ భట్టారకులవారే వీరు. అంబికపై శక్తిమహిమ్న స్తోత్రం అనే యింకొక కృతి చేసారు. ద్విశతి చదివిన వారికి ఆయన వాక్కులలో అంబిక సాక్షాత్కరించిందన్న విషయం అవగతమవుతుంది.


శ్రీచక్రం నలభై మూడు కోణములతో ఒక శిఖరం వలె వున్నది. కేంద్రస్థానంలో వున్న బిందువు చుట్టూ మూడు, అయిదు, ఏడు కోణములుగా మూలస్థానాన్ని (దేవాలయంలోని మÖలవిరాట్టుని) చుట్టివుండే అనేక ఆవరణ దేవతల వలె చుట్టి వుంటాయి. బిందుస్థానంలో కామేశ్వరుని వామాంకరూఢయై వివిధ వవరణలలో నివశించే దేవతలందరి చేత నిత్యమూ పూజలు అందుకునే రాజరాజేశ్వరిదేవిని అభివర్ణిస్తుంది ఆర్యాద్విశతి. ఈ స్తోత్రం అత్యద్భుతమైనది. చదివినవారు భగవత్ కృపకు ముఖ్యంగా కవితా రూపమైన ఆమె ప్రసాదానికి పాత్రులు అవుతారు. ఈ స్తోత్రం చదివినవారు ఆనంద ప్రవాహంలో ఓలలాడుతారు. ఒక గొప్ప చిత్రకారుడు జీవితమంతా కష్టపడి వేసిన అందమైన చిత్తరువు వంటిది ఈ గ్రంథము. కంటికి అందని అమ్మ రూపాన్ని మనకు దగ్గరగా తీసుకొని వచ్చి, మనోనేత్రంతో దర్శింప చేస్తుంది.


ఈ వ్యాసం అంతా మహా పెరియవ శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతిగారి వుపన్యాసానికి, చల్లా విశ్వనాథశాస్త్రిగారి అనువాదం. వారికి అనేక వేల నమస్సులతో.



 
 
 

Recent Posts

See All
మూక పంచ శతి లో ని కొన్ని శ్లోకాలు నవరాత్రుల సందర్భంగా

నవరాత్రులు శుభాకాంక్షలు మూక పంచ శతి లోని అమ్మవారిని కొన్ని రూపాల్లో స్తుతి చేసిన శ్లోకాలు. మహానుభావులు ఎవరో గుర్తించి పలానా దేవత రూపం వర్ణించి రాసినవి అనీ నాకు చెప్పితే నేను శుక్రవారాల్లో

 
 
 
చండీ ధ్వజ స్తోత్రం దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తో

ఓం నమో జగిత్ప ష్టాయై దేవ్యై భూత్యై నమోనమః. పరమానంద రూపీ ణ్యై నిత్యా యై సతం తం నమః నమస్తేస్తు మహా దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ రక్ష మాం శర ణే దేవీ ధన ధాన్య ప్రధాయిని రాజ్యమ్ దేహి ధనం

 
 
 
సినిమా బండి

ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు సరదాగా రాస్తూ ఉంటారు ఈ సినిమా బండి గురించి రాసారు వెనకటి .రోజు ల్లో మన ఊర్లల్లో రిక్షా లో మైక్ పట్టుకుని నేడే చూడండి అంటూ సినీ పేరు ,యాక్టర్స్ సినిమా గురించి వర్ణ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page