top of page
Search

నా పోస్ట్ గ్రాడ్యుయేషన్

  • murthydeviv
  • Aug 26
  • 2 min read

ఒక యాబై అరవై ఏళ్ల క్రితం ఆడపిల్లలు డిగ్రీ తర్వాత బయటి ఊర్లకు పంపించి చదువు చెప్పించాలంటే తల్లి తండ్రులు అంతగా డైర్యం చేసే వాళ్ళు కాదు.


డిగ్రీ అయ్యాక విశాఖ పట్నం లో అన్నయ్య తో పాటు నేనూ ఎమ్ స్సీ కి అప్లై చేశాను. మా అన్నయ్య నా కన్నా ఒక ఏడాది సీనియర్ అయినా తనకు ఎగ్జామ్స్


ముందు హెల్త్ ప్రోబ్లమ్స్ తో నా తో పాటే డిగ్రీ అయింది. తను ముందే వెళ్లి

పిజిక్స్ లో జాయిన్ అయ్యాడు. ఒక వారం తర్వాత నీ పేరు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ రెండు , సీట్ వస్తుంది బయలు దేరమని టెలిగ్రామ్ ఇచ్చాడు.


ఈ లోపల అన్నయ్య కు అనంతపురం జే న్ టీ యూ లో సీట్ వచ్చింది

తన ఫ్రైండ్ టెలిగ్రామ్ ఇచ్చాడుట, నేను పెద్ద అన్నయ్య తో ఈవెనింగ్ హౌరా

మెయిల్ కి వెళ్దాం అనీ అన్నీ సర్ది పెట్టుకున్నాను, ఆ రోజు ఉదయాన్నే

చిన్న అన్నగారు దిగారు వైజాగ్ నుండి.


ఇంక అమ్మ, నాన్న గార్లు తర్జన బర్జన లు , నన్ను ఒక్క దాన్ని ఎలా హాస్టల్ లో ఉంచటం అనీ, నాన్న గారు ఎలాగో ఒప్పుకున్నా అమ్మ గారు మాత్రం

స సి మే రా ఒప్పుకోలేదు.


నాన్నగారు నన్ను ఓదార్చటానికి గుంటూరు లో బి ఎడ్ చదువు అమ్మా

అక్కయ్య బావ వున్నారు కదా అనీ నచ్చ చెప్పారు.


కానీ నాకు అదేమిటో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీదే ఉండేది. ఇంకా ఆ రోజుల్లో


గుంటూరు లో యూనివర్సిటీ రాలేదు. ఆలా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ

తప్పిపోయింది..


ఆ ఏడాది మా ఊర్లోనే కొత్తగా లేడీస్ కాలేజీ పెట్టారు. నేను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ తో రికమెండ్ చేయుంచుకుని ఆ కాలేజ్ లో జూయలోజీ, కెమిస్ట్రీ కి


డిమాన్స్టరేటర్ గా ఉద్యోగం సంపాదించాను.


మా నాన్న గారు సంతోషించినా , మా అమ్మ గారు మాత్రం ఉద్యోగం చేస్తూ ఉంటే

బంధువులు ఏమనుకుంటారో, పెళ్లి అవుతుందో లేదో అనీ ఒకటే కంగారు పడుతూ ఉండేది .


మా అన్నయ్యల సపోర్ట్ తో మా వూరి కాలేజీ లో , మా బంధువుల మొత్తం లో

మొదటి, గ్రాడ్యుయేట్ గా, ఉద్యోగస్తు రాలిగా ఒక పేరు తెచ్చుకున్నాను.


మరుసటి ఏడాది గుంటూరులో యూనివర్సిటీ పెట్ట గానే అప్లై చేశాను , ఎలాగూ అక్కయ్య వున్నది ఇంక ఆటంకాలు వుండవు అనుకుంటూ.


సీట్ వచ్చింది, ఇంత లో కే మా పెద్ద నాన్న గారు మా స్నేహితుడు కొడుకు , మంచి ఫ్యామిలీ ఆ ఆబ్బాయి ఇంజినీర్ అనుకుంటూ పెళ్లి సంబంధం తెచ్చాడు.


వాళ్ల ఫ్యామిలీ వచ్చిన రోజున నా మొహం చూసి మా అమ్మ గారు , వదిన

కొంచెం నవ్వు మొహం పెట్టు అనీ బతిమిలాడారు.


అంత లా మొహం ముడుచుకుని కూర్చున్నా, ఏమిటో వాళ్లకు మా ఫ్యామిలీ,

నేను తెగ నచ్చేసాం .


తర్వాత ఆరోజుల్లో ఏ ఆడపిల్ల కయినా ఒకటే డైలాగ్ వుంటుంది.


ఆ డైలాగ్ కూడా తెలుగు సినిమా లో గుమ్మడి లాంటి బాబాయి వచ్చి నచ్చ చెపుతాడు


అమ్మా నాన్న పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా నీ తర్వాత ఇద్దరు అడపిల్లలు


ఇంకా అన్నయ్య , తమ్ముడి చదువు అంటూ మా బాబాయి చెన్నై నుంచీ వచ్చి చెప్పారు.


ఆరోజుల్లో తల్లి తండ్రులు మంచి పొజిషన్ లో వున్నా ఆడపిల్లలకు చదువు చెప్పించిటం ఆంటే భయ పడేవారు.


నాన్నగారు మాత్రం నీవు తెలివి కల దానివి పెళ్లి అయ్యాక అయినా ప్రైవేట్ గా చదువుకోవచ్చు అనీ చెప్పారు.


నేను బయటి ఊర్లకు పంపి ఎందుకు చదివించరు అనీ నాన్న గారిని అడిగితే నీవు ఉద్యోగం చేస్తూ ఉంటేనే , అందరూ విమర్శించారు .


నేను లెక్క చేయక పోయినా , అమ్మ భాధ పడ్తుంది కదా అనీ చెప్పారు.


ఆలా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెట్టు ఎక్కింది.


నేను మాత్రం తర్వాత మా అమ్మకు గట్టిగా చెప్పి ఒక చెల్లెలుని, స్కూల్లో టీచర్ గా, , ఇంకో చెల్లెలుని బ్యాంకు లో చేర్పించాను

మనవరాళ్లు ని అందర్నీ డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా , బ్యాంకు ఆఫీసర్స్ గా

చూసి సంతోషిస్తూ ఉంటే నేను మా అమ్మగారిని


నన్ను మాత్రం నీవు చదువు కోనివ్వ లేదు అనీ సాధిస్తూ ఉండేదాన్ని. నీ


నీ వు ఇంట్లో ఉండి అందర్నీ ప్రోత్సహించి బాగా ఫ్యామిలీ ని పైకి తెచ్చావు


అనీ పొగుడుతూ ఉండేది.


ఏం చేస్తాం అదీ మన చదువు కథ

 
 
 

Recent Posts

See All
మేజు వాణి

శ్రావణమాసం అంతా చాలా హడావిడి గా గడిచి పోయింది. ఇంట్లో పూజలు కాకుండా పెళ్లిళ్ళు , పుట్టినరోజు, ఉయ్యాల ఫంక్షన్స్ పైగా వర్షాలు అలాగే అన్నింటికీ హాజరు వేయించుకోవాలి కదా అలా చాలా బిజీగా

 
 
 
ఆంధ్ర వాల్మీకి

రెండు మూడు రోజుల నుంచీ వీర తాడులు మిస్ అవుతున్నాను. అయితే ఈ రోజు మిస్ అయినందుకు చాలా బాధ అనిపించింది. వావిలి కొలను సుబ్బారావు గారిని ఆంద్రా వాల్మీకి అనే వారు. మా చిన్న తనంలో మా చిన్న నాయనమ్

 
 
 
ఛలో ఆంధ్రా

ఈ మధ్య విజయవాడ వెళ్ళాము. ఎన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రా లోకీ వెళ్ళగానే ఏదో సొంత వాళ్ళను చూసిన ఆనందం వస్తుంది. అందులో ఇపుడు కోదాడ దాటగానే చెక్ పోస్ట్ కూడా వస్తుంది ఇంకా ఎక్కువగా ఆహా మన ఆంధ్రా క

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page