నేను మా వదినలు కలిసి చిన్న చిన్న నోములు చాలా పట్టా ము మా అత్త గారికి మా అమ్మ కు ఇద్దరికీ నోములు పట్టించటం మాకు అన్నీ పనుల్లో చాలా సహాయం చేసేవారు మా అత్తగారు మా అమ్మ చాలా స్నేహంగా వుండే వారు బహుశ పూర్వపు రోజుల్లో అలాంటి సంస్కారం ఉండేది అనుకుంటాను ఆ నోములు ఇపుడు అందరికి తెలుసో తెలియదో నాకు తెలియదు మా వారు ఎక్కడి కి వెళ్ళినా బుట్ట లతో పండ్లు పూలు తెచ్చే వారు ఒక సారి మామిడి పండ్లు తెచ్చారు మా అత్తగారు గ్రామ పసుపు కుంకుమ నోము ఉద్యాపన చేసుకుంటాను 5వీధుల్లో పసుపు కుంకుమ పండ్లు అన్ని ఇళ్ళలో పంచిపెట్టారు ఆతర్వాత నా చేత కూడా నా చేత ఆ నోము పట్టించారు అయితే నేను మామిడి పండ్లు ఇవ్వ్ లేదు కానీ కమలా పండ్లు ఇచ్చాను ఇంకొక పెద్ద నోము సావిత్రి గౌరీ నోము ఈ నోము నేను పట్టలేదు కానీ చాలాసార్లు చూసాను మా పిన్ని ఇపుడు మా కోడలి బామ్మ గారు ఆవిడ ప్రోద్బలతో కొన్ని నోములు పట్టాను మా పిన్ని సావిత్రి గౌరీ నోము పట్టారు మా బాబాయ్ పిన్నిి వాళ్ళు మద్రాస్ లో వుండేవారు ఈ నోము కోసం చీరాల వచ్చే వారు ఈ నోము తొమ్మిది ఏండ్లు పట్టాలి ఉదయం సాయంత్రం పూజ నైవేద్యం వుంటుంది అమ్మ వారిని కూడా ఎవరో అలవాటు ఉన్న వాళ్ళింట్లో పెడతారు ఈ నోము ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి నీ ఊయలలో పెడతారు సంక్రాంతి పండుగ అవగానే కనుమ నాడు పెడతారు చాలా అందమైన నోము చూస్తూ ఉంటే చాలా ఆనందం గా వుంటుందితొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెడతారు చీరాల్లో మాకు తెల్సిన వాళ్ళింట్లో పెట్టే వారు పిన్ని వెంబడి పూలు పండ్లు అవి పట్టుకుని ఎస్కార్ట్ గా వెళ్ళటం లీలగా గుర్తుంది మా ఆడపడుచు అత్తగారు ఉద్యాపన చేసుకోలేదని మా ఆడపడుచు తీర్చింది తెలిసిన వాళ్ళింట్లో పెట్టారని తెలిసి వెళ్ళి అక్కడ నోము ఉద్యాపన చేశాము తర్వాత మా గురువు గారి ఇంట్లో మలక్ పేట లో పెట్టారు మా అక్కయ్య నన్ను నోచుకోమని చాలా ప్రోద్బలం చేసింది కానీ నేను మాత్రం దైర్యం చేయలేక పోయాను తొమ్మిది ఏళ్ళు రెండు పూటలు వేరే చోటికి వెళ్లి పూజ చేయాలి పూర్తి చెయ్య గలనో లేదో అని మొదలు పెట్టలేదు కానీ గురువు గారి ఇంట్లో చేస్తున్నపుడు రెండు మూడు సార్లు పూజ చూడటానికి వెళ్ళాను చాలా అందమైన నోము చూస్తూ వుంటేనే చాలా భక్తి పార వస్యం వస్తుంది పూజ అంతా అయ్యాక అమ్మ వారికి హరతులు ఇస్తూ ఏ రకమైన చింతలు వుండకూడదని అమ్మ వారిని ప్రా ర్డిస్తూ చాలా అందమైన పాటలు పాడతారు నేను ఆ పాటలు నేను నేర్చుకోలేదు కానీ వింటుంటే ఎంత ఆనందం వస్తుందో చెప్పలేను అక్కడ పూజ చేసికొన్న ముత్తైదువ లకు హారతి ఇవ్వటానికి ఇత్తడి దీప హారతులు ఇచ్చాను గురువుగారు చాలా సంతోషించారు ముక్కనుమ మొదలు పెట్టి తొమ్మిది రోజులు పూజ అయ్యాక వూరేగింపు గా తీసుకుని వెళ్లి ఏదయినా నదిలో చెరువు లో వాళ్లడిస్తారు నిమజ్జన ము చేయటం అన్నమాట e నోము చేయటానికి చాలా శ్రద్ధ వోపిక కావాలి మా చిన్న మేనత్త చేసింది తన పెద్ద కూతురి కి సావిత్రి అని పేరు పెట్టారు ఇదండీ ఈ నోము కథ నేను పట్టక పోయినా ఆ వివరాలు చెప్పాను
murthydeviv
Comentários