top of page
Search

నేను నా నోములు

  • murthydeviv
  • Dec 10, 2024
  • 2 min read

లఖడ్డి పూల్ నుండి మేధి పట్నం వెళ్లే దారిలో న్ మ్ డి సి దగ్గర లోపలికి వెళితే కాజల్ హిల్స్ అంటారు అక్కడ లోపలికి వెళితే కొండ లో వున్నట్లు వుంటుంది వేంకటేశ్వర స్వామి విగ్రహం అపుడు చాలా ప్రశాంతంగా ఉంది అన్నీ ఆలయం లు వున్నాయి , కుశాయి గూడ లో. చాలా పెద్ద గుడి విశాలం గా వున్నది పెద్ద గోపురం చాలా పాత గుడి అనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి కూడా వున్నది ఎవరో భక్తులు తమల పాకు ల మీద గంధం తో శ్రీరామ అని రాసి ఉన్న ఆకుల హారం ఆంజనేయ స్వామి కి వేశారు చాలా బాగుంది ఇప్పటికీ తలచుకుంటే కళ్ల ముందు కదులుతున్నట్లు వుంటుంది నేనూ రాయటానికి ప్రయత్నం చేశాను కానీ అలా మాత్రం కుదరలేదు శివా నంద ఆశ్రమం కవాడి గూడ నుండి పద్మ రావు నగర్ వెళుతూ ఉంటే ఈ ఆశ్రమం వస్తుంది ఇక్కడ గుడి వుందని ఎవరికి తెలియదు యోగ బాలాజీ దేవాలయం అంటారు అక్కడ అన్నదానం నారాయణ సేవ జరుగుతుంది క వాడి గూడ మెయిన్ రోడ్డు లో పెట్రోల్ బంక్ కన్నా ముందు పక్క లేన్ లో తిరిగితే అపార్ట్మెంట్స్ మీద చిన్న గుడి వేంకటేశ్వర స్వామి గుడి అది నారాయణ స్వామి సరస్వతి దేవి వున్నారు పెద్ద పూజ మందిరం లాగా వున్నది ముందు గా రాసినట్లు నేను అన్నీ గుడులు గురించి రాయటం లేదు కొన్ని పాత గుడులు గురించి ఇంకా నా మనసుకు నచ్చిన వాటి గురించి రాస్తున్నాను ఈ క వాడి గుడి వున్న వీధిని చిత్రాల వీధి అంటారు బీరం గూడ బొంబాయి హైవే లో కుడి వైపు కి తిరిగి కొంచెం లోపలికి వెళితే పెద్ద అర్చ ఉంది. శివాలయం పురాతన ఆలయం లా ఉంది కొత్తగా వేంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టినట్లు వున్నది గుడి కొంచెం గుట్ట మీద గా వున్నది ఆంజనేయ స్వామి సత్య నారాయణ స్వామి గుడి కూడా వున్నది చాలా విశాలంగా చుట్టూ చెట్లు తో ప్రశాంతం గా వున్నది ఈ మధ్యలో అంటే డిసెంబర్ 2010లో మా బంధువుల ఇంట్లో పెళ్లి కి చీరాల వెళ్ళాము వచ్చే టపుడు బాపట్ల భావ నారాయణ గుడికి వెళ్ళాము ఆ గుడి చాలా పురాతన ఆలయం ఎవరో రాజులు నిర్మించిన ఆలయం విశాలం గా ఉంటుంది ఆర్కీ యాలజీ డిపార్మెంట్ వాళ్ళు ఆ ఆ ఆలయం చరిత్ర అంతా బోర్డు పెట్టారు a గుడి చూడటం మా అదృష్టం అనుకున్నాము పొన్నూరు లో ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా పురాతన గుడి అక్కడ వేంకటేశ్వర స్వామి గుడి వుంది స్వర్ణ కవచం వేశారు చాలా బాగుంది అక్కడే దశావతార ములు. సహస్ర లింగాల గుడి కూడా వున్నాయి చిలుకూరు బాలాజీ దేవాలయం మేము 1998లో ఒకసారి వెళ్ళాము అపుడు అంత రష్ లేదు చాలా ప్రశాంతం గా వున్నది శివుడి గుడి దగ్గర కూర్చుని భోజనం చేసాము గండిపేట చెరువు వొడ్డు న వున్నట్లు వుండేది మేము అక్కడ దాకా నడిచి వెళ్ళాము ఇపుడు ప్రశాంతత లోపించింది అనిపిస్తుంది సికిందర్ బాద్ శివాజీ నగర్ చాలా పురాతన గుడి ఒక తొలి ఏకాదశి నాడు మంగళ్ హాట్ ధూల్ పేట లో గుడి చాలా చిన్న గా ఉంది విగ్రహం కూడా చాలా చిన్న గా వున్నది తలపాగా కిరీటము లాగా కట్టారు పూజారి చాలా శ్రద్ద గా పూజ చేశారు కొన్ని గుడులలో పూజారులు చాలా శ్రద్ద గా అన్నీ చెపుతూ పూజ చేస్తారు వాళ్ళ నీ చూస్తే మనకు కూడా శ్రద్ద వస్తుంది అదే దోవ లో. జియా గూడ లో రంగనాథ స్వామి గుడి కి వెళ్ళాము పురాతన గుడి చాలా బాగుంది స్వామి శయన రూపం లో దర్శనం ఇస్తారు ఆ రోజు తొలి ఏకాదశి అవటం వలన చాలామంది ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకుని రక రకాల పండ్లు పూలు బుట్టల లో పెట్టుకుని అలంకరించిన కలశ లాలో నీరు తీసికొని గుడి కి వచ్చారు గుడి అంతా కళ కళ లాడుతూ ఉంది వాళ్ళ ను చూస్తుంటే వాళ్ళ కు మన హిందూ మతము మీద ఆచారాల మీద వున్న నమ్మకం మనకు లేదు అనిపిస్తుంది ఆ ఏడుకొండల స్వామి దయ అందరి మీదా వుండాలని కోరుకుంటున్నాను రేపు మరల కలుద్దాము

 
 
 

Recent Posts

See All
రేడియో గది

రేడియో కి ఒక గది ఉంటుందా అనుకుంటారేమో, మా చిన్నతనం లో మేడ మీద ఒక పెద్ద వరండా కి పక్కగా ఒక గది వుండేది. ఈ మధ్య నేను ఏదో బుక్ రాస్తూ...

 
 
 
పెళ్ళి సందడి

ఫ్యామిలీ ఒక మంచి పూల తోట లాంటిది. మంచి పువ్వులు రావాలంటే ప్రేమ అను రాగాలతో ఆ చెట్టుకు ఎరువు వేయాలి ఈ టైటిల్ కి పూల చెట్టు కి ఏం సంబంధం...

 
 
 
అమ్మ కు ప్రేమతో

ఈ రోజు మాతృ దినోత్సవం అదే మదర్స్ డే అని ఉదయాన్నే పేపర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్ లో ఒకటే హోరు గా పోస్టులు. ప్రత్యేకంగా మనం ఒకరోజు అని గుర్తు...

 
 
 

Comentários


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page