top of page
Search

నేను నా నోములు 1

  • murthydeviv
  • Nov 17, 2024
  • 1 min read

శ్రావణ శుక్రవారం నోము అమ్మ వాళ్ళింట్లో చీరాల ల్లో చేసే వాళ్లు కాదు ఆరోజుల్లో కొన్ని పూజలు అలవాటు లేదు అనే వారు కారణం తెలియదు మా అమ్మ మా ఇంట్లో త్వరగా పూజ చేసుకుని మా మేనత్త గారింటికి తీసుకొని వెళ్ళే ది మా మేనత్త అమ్మవారిని చాలా పెద్దగా చేసి చక్కగా అలంకరించేవారు ఇప్పటికీ s పెద్ద హాలు ఆ సందడి గుర్తు వస్తుంది అత్తయ్య న చేత పెళ్లి అయాక మొదటి శుక్రవారం నోము చేయించింది ఉండ్రాళ్ళ తద్ది అట్ల తడ్డికి కూడా పెద్ద పండగ ల లాగా తెల్లవారుజామున లేవటం గోరింటాకు లు ఊయలలు ఊ గటం పిల్లలం అందరం వాళ్ళింటికి మా ఇంటికి తిరగటం అంతా చాలా సందడిగా వుండేది మా అత్తయ్య గానీ మా అమ్మ గానీ పిల్లల అందరినీ సమానంగా ప్రేమగా చూసే వారు మా అన్నయ్య లు మా బావ లు కూడా పోటీ లు పడి వుయ్యాలలు ఊగే వాళ్ళు ఆడపిల్లలు ఏ పండగ వచ్చినా జడ కుప్పేలు పెట్టుకుని జడ వేసికొని పూ లు పెట్టుకోవాల్సిందే నాకు జాజి పూలు మల్లె పూలు మాత్రమే ఇష్టం చామంతి పూలు అయినా పెట్టుకోవాలిసిందే వద్దు అనటానికి వీలు లేదు మా అత్తయ్య అయినా అమ్మ అయినా అంత పెద్ద ఇల్లు అయినా ఇంటి నిండా ప్రతి పండగకు ముగ్గులు స్వయంగా పెట్టేవారు ఎంత ఓపిక అనిపిస్తుంది ఇపుడు e పండగ వచ్చినా ఆ హాలు అమ్మ హడావిడి గా తిరగటం ఇంటినిండా రాలిన చేమంతి రేకులు తడి కాళ్ళతో తొక్కిన పిండి ముగ్గుల అడ్డులు మామిడి తోరణాలు పిండివంటలు ఘుమ ఘుమ లు నాన్న మంత్ర పుష్పం చెపుతుంటే చేతిలో పూలు పట్టుకుని వరుసగా నిలుచుని పాట పాడ మంటే అమ్మ గొంతు తో కలిపి వచ్చి రాకుండా పాడ టం దేవుడు ఊరే గింపు వస్తుంది అనితయారు గా పెట్టు కున్న హారతి పళ్ళాలు అదంతా ఒక పాత సినిమాలా గా మాయ బజార్ అధ్బు తంగా అనిపిస్తుంది ఇపుడు పండగ సందడి అంతా t

టివి లో నో బట్టల షాపు లో ను కనిపిస్తుంది ఇప్పటికీ ఎవరయినా మంత్రపుష్పం చదువుతుంటే నాన్న అక్కడ వున్నట్లు అనిపిస్తుంది ఏ మనిషికైనా అపురూప బాల్యము ఉండాలి ఆ బాల్యాన్ని ఇచ్చి న తల్లి తండ్రుల కు శత కోటి వందనాలు

 
 
 

Recent Posts

See All
హ్యాపీ హోలీ కబుర్లు

మనకు ఆంధ్ర లో ఈ హోలీ పండగ గురించి తెలియదు. మా వారు హైదరాబాద్ లో చదువుకున్నా అప్పుడు ఇంత హడావుడి ఉండేది కాదేమో. మేము పంజాబ్ వెళ్లిన నాలుగు నెలలకో ఏమో ఈ పండగ వచ్చింది. యూనివర్సిటీ లో వున

 
 
 
అత్తా కోడళ్ల సరాగాలు

రోజూ ఉదయాన్నే మా కుక్ రాగానే ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను ఏదో ఆకుకూర పప్పు చెపితే నిన్న ఆకు కూర నే కదా అంటుంది.. నాకు వెంటనే మా అమ్మ, మా పెద్ద వదిన గుర్తు వస్తారు. కూరలకు వెళ్ళినపుడు

 
 
 
శివరాత్రి

శివరాత్రి అనగానే ఎన్నో జ్ఞాపకాలు ఆలా తరుముకుంటూ వస్తాయి. అన్నీ పండగ లాగా ఈ పండుగ కీ పిండివంటలు హడావిడి ఉండదు కదా ఉపవాసం ఉండాలి అనే ఉత్సహం చిన్నప్పుడు చాలా ఉండేది. పిల్లలు మీరు ఏమీ ఉంటారులే

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page