నేను నా నోములు
- murthydeviv
- Nov 17, 2024
- 1 min read
మా అమ్మ గారు ఎక్కువ ఉపవాసాలు అవి వుండలేక పోయే వారు ఉదయం పది గంటల కల్లా భోజనం చేసి ఒక అరగంట మాత్రం విశ్రాంతి తీసుకునేవారు ప్రతి శుక్రవారం ఆడపిల్లలు తలంట్లు పోసికొని పట్టు పావ డాలు కట్టుకోవాలిసిందే తలలో పూలు పెట్టు కుని స్కూల్ కి వెళ్ళాలి అమ్మ నాన్న ఎపుడూ మమ్మల్ని మంచి బట్టలు వేసుకొని కళకళ లాడుతూ వుండాలని చెప్పే వారు ఏడ్చినా చికాకు పడినా ఏదయినా లేదు అన్నా చాలా కోప్పడే వారు మా అమ్మ రోజు రాముల వారి విగ్రహాలకు పవళింపు సేవ చేసేది మా తాతగారు మొదలు పెట్టారుట రోజూ సాయంకాలం దీపారాధన చేసి హారతి పాట పాడి పవళింపు సేవ చేసి జోల పాట పాడాలి మా చిన్నతనం లో మేము కూడా అపుడపుడు చేసే వాళ్లం అమ్మ రోజూ రాములు వారి విగ్రహాల కు పూల దండలు వేసి అలంకరించేది ప్రతి పండగకు రాముల విగ్రహాలను శుభ్రం చేసి కొత్త బట్టలు కట్టేది ఆమె చనిపోయే రెండు నెలల ముందు వరకు ఈ రాముల వారి సేవచేసేది మా నాన్న గారు కార్తీక సోమ వారం అభిషేకం చాలా బాగా చేసేవారు ఆరోజు ఇంటికీ ఎవరు వచ్చినా భోజనం చేయాల్సిందే నేను ఎక్కువ సేపు పూజ చేసి కుంటే నీకు నాన్న పోలిక వచ్చింది ఎంతసేపటికీ నీ పూజ తెమల దు అనేది మా వారు ఎక్క డి కి వెళ్ళినా వస్తూ బుట్ట లతో పూలు తెచ్చే వారు మా అత్తగారు మా అమ్మ పిల్ల లందరికీ పుల జడలు వేసేవారు అపుడు మా పిల్లలు మాట వినే వాళ్లు ఇప్పుడయితే ఏమి లాభం లేదు మా మనవ రాళ్ల తో మా అమ్మ గారు పెద్దగా పూజలు చేయక పోయినా అందరితో కలసి మెలసి వుండే వారు మా అత్తగారు అమ్మ చాలా స్నేహంగా వుండే వాళ్ళు వాళ్ళ కి పెద్దగా చదువు లేక పోయినా అంత ఓర్పు నేర్పు ఎలా వచ్చిందో అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తు న్నా నంటే భక్తి అనేది మనలో ఏర్పడటానికి మన చిన్నప్పటి సంఘటనలు దోహదం చేస్తాయి అనుకుంటాను రథ సప్తమి నాడు ఇపుడు టీవీల్లో ఇంతగా చెప్తున్నారు మన చిన్నతనంలో మనకు తెలియకుండ నే ఆ పిడకల మీద వండిన పరమాన్నం వేడి గా ఆ చిక్కడు ఆకుల మీద వేసికుని తిన్న రుచి మనసులో తలచుకుంటే ఒక తీయని అనుభూతి కలుగుతుంది
చిన్నప్పటి ఆచరణాలే పెద్దప్పటి అలవాట్లు . --- భార్గవి