కుక్కర్ బిర్యానీ
- murthydeviv
- Aug 6
- 2 min read
ఈ రోజు ఎవరో పేస్ బుక్ లో రక రకాలుగా దొరికే బిర్యానీ ల గురించి పోస్ట్ పెట్టారు. అదీ చూస్తే నేను ఈ మధ్య ఎదో కొత్త హోటల్ లో కుక్కర్ బిర్యానీ అని మెనూ లో పెట్టాడు.
అసలు మా ఇంటి చుట్టూ రకరకాలుగా వున్న పేర్లతో రోజు కొక హోటల్ వెలుస్తూ వుంటుంది. అందులో కొన్ని పేర్లు తెలుసా, ఇంతే రా, ఇట్లు, ఐదు, చిట్టీ గారె కోడి కూర ఇంకా ఇలా ఏవో పేర్లు.
ఒకప్పుడు పోష్ ఏరియా గా పేరు గల ఈ కొండల్లో ఇప్పుడు హోటల్స్, పబ్ లు.
అడుగడుగున గుడి వుంది అన్నట్లుగా చీర ల షాపులు, నగల షాప్స్ కి కొదవ లేదు.
ఈ మధ్య హోటల్ కి వెళ్ళాలి అన్నా విసుగు వస్తుంది. మనం తెలుగు దేశం లో వున్నామా లేక ఏ ఉత్తర భారతం లో వున్నామా అనే వంటలు.
ఇంక పిజ్జా లు పాస్తా లు చెప్పక్కర్లేదు.పిల్లలు తినేవి అవే.
ఇంతకీ ఆ హోటల్ వాడు నిజంగానే ఒక చిన్న కుక్కర్ లో వెజ్ బిర్యానీ తెచ్చి పెట్టాడు. మా పిల్లలు చిన్నప్పుడు పండగ అంటే ఎప్పుడూ పులిహోర నా అని గొడవ పెడితే వాళ్ళ మటుకు ఉల్లిపాయ వేయకుండా కూరలతో టమాటో వేసి
చిన్న కుక్కర్ లో వెజ్ పలావు చేసేదాన్ని.
మా అత్తగారు పలావు, లేదా బిర్యానీ అని పలకటం గాని, పండగ నాడు
ఆ మసాలా తో వండటం నచ్చేది కాదు.
పిల్లలు కు ఆవిడకు మధ్యలో నా బాధ చూసి, మా అమ్మ గారు తెలివిగా
కూరలు అన్నీ వేసి అమ్మాయి వండింది కదా కూరలు అన్నం అందాము లెండి
అని వదిన గారికి నచ్చ చెప్పింది.
ఆలా మా ఇంట్లో ఆ కూరల అన్నం వండే కుక్కర్ వేరే గా ఉండేది.
ఆ కుక్కర్ ఇంక దేనికి వాడే వాళ్ళము కాదు.
తర్వాత ఆలా ఉల్లిపాయ వెయకుండా వెజ్ పలావు వండటంలో
నేను ఎక్సపెర్ట్ అయ్యాను.
పండగల్లో ఎవరైనా బంధువులు వచ్చినపుడు చేసి మంచి కాంప్లిమెంట్స్
తెచ్చుకునేదాన్ని.
ఎన్ని సార్లు చేసినా మా అత్తగారు అసలు తినే వారు కాదు.
పులిహోర రారాజు అందులో చింత పండు పులిహోర మహారాజు
అదీ తప్ప నేను ఇంకేమి తినను, అనే మా వారు కూడా ఆ కూరల అన్నము
తినే వారు కాదు.
దసరా నవరాత్రులు ల లో ఆరవ రోజు షష్టి నాడు హరిద్రాన్నం నై వేద్యం
పెడతారు. ఆరోజు జీలకర్ర లవంగం వేసి నెయ్యి తో కొంచెం పసుపు వేసి
అన్నం నైవేద్యం చేయటం కొన్ని చోట్ల పూజల్లో చూసాను.
నేను కూడా ఆలా చేస్తున్నాను,
ఇంతకీ హోటల్ లో మా అమ్మాయి తెప్పించిన కుక్కర్ బిర్యానీ మసాలా ఎక్కువగా ఉండటంతో ఎవరమూ తినలేక పాక్ చేయించాము.
ఆ పాక్ ని కూడా ఎదో అంటారుగా గుర్తు లేదు.
ఆ కుక్కర్ చూడగానే నాకు, మా అమ్మాయికి బామ్మ, అమ్మమ్మ ఇద్దరూ గుర్తు వచ్చి
పిల్లలు కు ఆ కథ చెప్పింది.
అయినా హోటల్ లో చక్కగా ఎదో అందమైన బౌల్ లో సర్వ్ చేయక
కుక్కర్ లో తెచ్చిపెట్టంటం ఏమిటో.
Comments