top of page

శ్రీమన్నారాయణీయం

murthydeviv

ఈ పుస్తకము గురించి రాయాలని ఒక కోరిక రాయగలనో లేదో తెలియదు. మావారు ఒకసారి తిరుపతి వెళ్ళినపుడు

ఈ పుస్తకము కొన్నారు. ఏ వూరు వెళ్ళినా ఏవో పుస్తకాలు తెస్తూనే వుంటారు. కానీ ఆ పుస్తకము మీద మాత్రము నా పేరు వ్రాసి ప్రజెంట్ చేస్తున్నట్లుగా వ్రాశారు. అపుడపుడే మా అక్కయ్య సలహా తో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అనే ఆలోచన తో పుస్తకం చదవటం మొదలు పెట్టాను. ఆ పుస్తకం వ్యాస భాగవతానికి సంగ్రహ రూపము. భగవంతుని ఎదుట ఒక మహా భక్తుడు ప్రకటించుకున్న మనోవేదనకు ఇది ప్రతిరూపంగా వెలసిన గ్రంథ రాజం. ఆ పుస్తక పీఠిక లో గురువాయూర్ క్షేత్రము గురించి అక్కడ వెలిసిన నారాయణుని గూర్చి చదవగా ఒక్కసారి అయినా ఆ క్షేత్రము చూడాలనీ చాలా కోరికగా అనిపించింది. అపుడు మా మేనకోడలు ఫ్యామిలీ కొచ్చిన్ లో ఉండే వాళ్ళు ఎండా కాలం సెలవుల్లో మా యింకో అన్నయ్య పిల్లలు మా చెల్లెలు కొచ్చిన్ వెళదామని, వాళ్ళ కు తోడుగా నన్ను రమ్మని గొడవ. అందరం కలిసి కొచ్చిన్ ఎక్సప్రేస్ లో బయలుదేరి వెళ్ళాము. వున్న నాలుగు రోజులలో మా మేనకోడలు, తన శ్రీవారు మమ్మల్ని గురువాయూర్ , కా లడి, త్రి సూ ర్, క్షేత్రాలను చూపించారు. అలా అనుకోకుండా గురువాయూర్ క్షేత్రము చూడటం జరిగింది.

ఈ గ్రంథానికి ఒక మహా క్షేత్రము, ఒక మహ పురాణము ఆధారం. మహా క్షేత్రము గురువాయూర్. ఈ నారాయణీయం శ్రీమహా భాగవతం కేరళ లో నిత్య పారాయణ గ్రంధము. ఈ గ్రంథం రాసినది శ్రీ నారాయణ భట్టతిరి వ్రాసింది నారాయణుని గురించి, వినిపించింది కూడా నారాయణను కే, అలా ఈ గ్రంథం నారాయణ కవి వ్రాసి నారాయణను కే వినిపించిన నారాయణ కథ.

గురువాయూర్ క్షేత్రము యొక్క ప్రసక్తి భాగవతము లోని చతుర్థ స్కంధమునకు సంబంధించినది. స్థల గాధ ల ప్రకారం ధ్రువుడు వంశస్తులైయి న ప్రచేతసులకు రుద్ర భగవానుడు శ్రీ రుద్ర గీతను ఉపదేశించిన చోటు. ఇక్కడ కృష్ణుని గుడి కి దగ్గరలో ఒక అమ్మవారి గుడివుంటుంది., ఈ గుడి కి వచ్చిన వారు ఆ గుడి తప్పక దర్శించాలని చెప్తారు. మొదటి సారి వెళ్ళినపుడు వెళ్లామో లేదో ఈ అమ్మ వారిగుడి కి రెండో సారి గురువాయూర్ వెళ్ళినపుడు వెళ్ళాము.

  • గురువాయూర్ లో ఆరాధించబడుతున్న అర్చామూర్తి శ్రీ మహా విష్ణువు, శ్రీకృష్ణుడు ఈ మూర్తి నీ ద్వారక లో ప్రతిష్టించి పూజించెను. ద్వాపర యుగాంతం లో ద్వారక సముద్రంలో మునిగి పోవునపుడు, శ్రీకృష్ణుని అజ్ఞ చే ఉద్దవుడు , దేవ గురువైన బృహస్పతి,వాయువు సహాయంతో, పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఈ క్షేత్రంలో ప్రతిష్టించారు. గురువు వాయువు సహాయంతో ప్రతిష్టించిన ఆలయం కాబట్టి గురువాయూర్ గా ప్రసిద్ది చెందింది.

  • ఆధునిక కాలంలో ఈ మందిరం పాండ్య రాజుల చేత పునరిద్దబడింది. కేరళ రాష్ట్రము లో ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఈ క్షేత్రము లోనే నారాయణ భట్ట తిరి ఈ గ్రంథం వ్రాయ టం వలన,ఇది ఒక మహి మన్వితమైన స్తుతి కావ్యం గా ప్రశస్తి పొందింది. అక్కడ సామాన్య జనుల కూడా ఈ గ్రంధాన్ని నిత్య పారాయణ చేస్తారు. అక్కడ ఆలయంలో చాలా మంది భక్తులు కూర్చుని పారాయణ చేయటం చూస్తుంటే కనుల పండుగగా ఉంటుంది.

  • గురువు మనలోని బుద్ధి శక్తి,, వాయువు ప్రాణ శక్తి, బుద్ధి, ప్రాణములు మసిలే చోటు మన దేహం ఒక గురువాయుపురం. ఈ రెండింటినీ ఏకాగ్రపరిచే సాధనతో మన హృదయం కేంద్రము లోని అప్ప ను ప్రత్యక్షం చేసుకోవాలి . గురువాయూరప్ప, దేహ బుద్ధి ప్రాణా థీసు డైన ఆత్మ స్వరూపుడు.

  • అధి వ్యాధులకు కారణం బుద్ధి ప్రాణాల వ్యవస్థల లో ఏర్పడిన అసమత్వమే. వాటిని చక్కబరచే దేవతలు గురువు, వాయువు లు. మన గ్రంథాలలో చాలా ఆసక్తికరమైన అంశాలు, మనకు తెలియని రహస్యాలు వుంటాయి. మన

  • వాటిని గ్రహించ లేక అవివేకము తో విమర్శ చేస్తాము. ఈ గ్రంథ పారాయణము మహా మహిమాన్విత మైన ది

  • నేను వ్రాసిన ఈ విశేషాలు అన్నీ గీతా ప్రెస్ వారి నారాయణీయం పుస్తకము నుండి తెలుసుకున్నాను.

30 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page