1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. హైదరాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో డిల్లీ వెళ్ళి అక్కడ నుండీ నేరుగా చికాగో ఫ్లయిట్ లో వెళ్ళాను. ఈ ప్రయాణాలు గురించి ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే అక్కడ ఇమ్మిగ్రేషన్ లో నాకు ఎపుడూ ఏదో ఒక ప్రాబ్లెమ్ అయ్యేది. అందు వలన నాకు అమెరికా ప్రయాణం అంటే విసుగు అనిపించేది.2006కల్లా ఊరగాయలు అన్నీ ప్యాక్ చేయటానికి చాలా షాపులు వచ్చాయి. నాలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఫ్లయిట్ లో వున్నారు. చాలామంది దంపతులు వెళ్తూ వుంటారు. ఎన్నిసార్లు వెళ్ళినా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా ఆఫీసు లో ట్రావెల్ ఏజెంట్ టికెట్ బుక్ చేశాడు. అతను రానుపోను రెండు టిక్కెట్స్ బుక్ చేశాడు. మనం అక్కడ వుండటానికి ఆరు నెలలు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అతను పొరపాటున ఏడు నెలల తర్వాత రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. మేమూ ఆ టికెట్ ను అంత వివరముగా చూడలేదు. చికాగో లో ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆపేశారు. మనం ఎంత రిచ్ గా లుక్ వున్నా వాళ్ళు మనల్ని ఏదో దొంగల లాగానే చూస్తారు. ముందు వాళ్ళ భాష మనకు అర్ధం అయి ప్రాబ్లెమ్ తెలిసిన వెంటనే అప్పటికి సెల్ఫోన్ వచ్చింది కాబట్టి బయట వైట్ చేస్తున్న మాచెల్లెలు కు మా అమ్మాయి కి ఫోన్ చేశాను, వాళ్ళు కంగారు పడ్డా ఏమి చేయలేరు కదా. పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినపుడు నేను ఒక పేపర్ తీసికొని అంతా ఇంగ్లీష్ లో రాసి చూపించాను. వాడు అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్ లో సమాధానం చెప్పాను. నేను కొంచెం ఎడ్యుకేటెడ్ అనో ఏదో మొత్తానికి స్టాంపింగ్ చేశాడు. ఎలాగో ఎయిర్పోర్ట్ లోనుంచి బయటపడ్డాను. ఆ ప్రయాణము లో ఆరు నెలలు పూర్తిగా వున్నాను. అమెరికాలో ఫిట్స్ బర్గ్, చికాగో మినియపోలీస్, కాలిఫోర్నియా, సియా టెల్ చూసాను. ఈ 11ఏళ్ళ లో చాలా మంది మా కజిన్స్ పిల్లలు మా అన్నయ్య పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారు. నేను ఉన్నానని అందరూ నా దగ్గర కు వచ్చారు. ఇంక అక్కడ హాస్పిటల్స్ అవీ చాలా శుభ్రము గా వుండేవి. మనం చీరలు కట్టుకొని వెళితే వాళ్ళు కొంచెం వింత గానే చూస్తారు. కొంత మంది మాత్రమ్ మెచ్చుకుంటూ బ్యూటీఫుల్ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఈస్ట్ కోస్ట్ లో ఆ మంచు కొండలు చూస్తే విరక్తి వస్తుంది. మా మనవరాలు కి రెండో నెల అనుకుంటాను కొంచెం ఎండ గా వుంటే ఆయిల్ రాసి కిటికి దగ్గరగా ఎండ వస్తుంటే పడుకోపెట్టాను. మా అమ్మాయి ఆఫీసు కి వెళ్ళింది. ఇంత లో ఆ అపార్ట్మెంట్ లో ఫైర్ అలారమ్ మోగింది. నాకు తోడు గా మా కజిన్ కొడుకు ఉన్నాడు పాప ను ఒక వూల్ షాల్ తో కప్పుకుని ఆరో అంతస్తు నుంచి మెట్లు మీద నుండి కిందకి వెళ్ళాము. కింద అంతా స్నో లేదు కానీ ఒకటే చలి, మాతో పాటు కిందకి వచ్చిన ఒక నైబర్ తన కారు లో హీటర్ ఆన్ చేసీ మమ్మల్ని కూర్చోమన్నాడు. ఆ సమయం లో అతనే భగవంతుడు లాగ అనిపించాడు. మా మనవరాలు పుట్టాక ఏదో హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చింది. ఆమెరికా లో కాబట్టి ఆ డాక్టర్స్ చాలా శ్రద్ధ గా వైద్యం చేశారు. ఆ 20రోజులూ మా చెల్లెలు, నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వుండే వాళ్ళం. అక్కడ డ్రైవింగు రాకపోతే లైఫ్ లేనట్లే. ఎక్కడికి వెళ్లలేము అక్కడ వెళ్లిన వాళ్ళు తప్పక డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే. మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చాక ఇండియాలో ఆటోలు మిస్ అయ్యాము అనేవాళ్ళు.a పాప పుట్టిన మ్యాగీ వుమెన్ హాస్పిటల్ ఎపుడూ గుర్తు వస్తూ ఉంటుంది. అలా ఎన్నో అనుభవాలు, అనుభూతుల తో అమెరికా లో ఆరు నెలలు వుండి పాపాయి తో ఇండియా వచ్చాము.
అమ్మమ్మ అమెరికా యాత్ర 4
murthydeviv
Comments