Untitled
- murthydeviv
- Jul 3
- 2 min read
ఈ రోజు భావుక పోస్ట్ ఆ కోకిల ఆ పూల తో నిండిన ఆ చెట్టు చూడగానే నాకు ఎంకి పాట కొమ్మలో కోకిలా పాట గుర్తు వచ్చింది.
మేము కాలేజీ రోజుల్లో ఎక్కువగా సినిమా పాటలు, హిందీ పాటలు పాడుతూ ఉండేవాళ్ళము. బాల సరస్వతి గారి కొన్ని లలిత గీతాలు, రాజేశ్వర రావుగారి,
పాట పాడుమా కృష్ణ, ఓహో విభావరి, ఇవే తెలుసు.
గ్రాడ్యుయేషన్ అవగానే ఊర్లో లేడీస్ కాలేజీ కొత్తగా పెట్టారు, అందులో
ఒక ఐదు ఆరుగురు ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లెక్చరర్స్ గా, నేనూ
డిమాన్ స్ట్రేటర్ గా చేరాము.
లెక్చరర్స్ అందరూ వైజాగ్ నుంచే ,నాకు స్థానం బలం కదా త్వరగా స్నేహం కుదిరిపోయింది , అందులో మా అమ్మగారు ఆడపిల్లలు ఒంటరిగా అంత దూరం నుండీ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు అనీ ఆప్యాయంగా చూసే వారు.
వాళ్ళ ల్లో ఇద్దరు ఈ ఎంకి పాటలు బాగా పాడేవారు, ఇంకా విద్వాన్ విశ్వమ్ గారి
అదే పెన్న, సి నా రే గారి ప్రైవేట్ పాటలు, దాశరధి గారి మాట్లాడని మల్లె మొగ్గ,
కందుకూరి రామ భద్ర రావు గారి వి, ఒకటేమిటి ఎన్నో లలిత గీతాలు నేర్చుకున్నాను.
కొమ్మలో కోకిల చిట్టీ బాబు గారు వీణ మీద వాయించిన ట్యూన్ లో మాథ్స్ లెక్చరర్
పాడేది , అచ్చు ఆయన ట్యూన్ లో చివరగా కూ కూ అన్నట్లే అద్భుతంగా పాడేది.ఆ పాట కు తనకి ఎన్నో ప్రైజెస్ వచ్చాయిట,
ఈ నాటికీ తనతో స్నేహం అలాగే వున్నది.
, ఆపలేనే ఎంకి ఈ పడవ విసురు అనే పాట ఎమ్ ఎస్ రామారావు గారిది ఉండాలి .
మా మూడో వదిన నండూరి సుబ్బారావు గారి మనవరాలే .
పెళ్లి కుదిరినప్పుడు ఇంకా కొత్త ఎంకి పాటలు నేర్చుకోవాలి అనీ సరదా పడ్డాను.
కానీ తనకు పాటలు రావు అనీ చెప్పింది. మా వదిన మేనత్త కూతుర్లు మాత్రమే ఆయన పాటలు బాగా పాడే వారు.
ఎప్పుడయినా అన్నయ్య ఇంట్లో కలిస్తే ఆ పాటలు , కబుర్లు కల బోసుకునే వాళ్ళము.
ఆ నాటి నా వోడు చందూరుడా , అరిపేయవే దీపము, ఏంతెంత దూరాన,
గుండె గొంతుక లోన కొట్లాడుతాది, పది మందిలో ఎంకి పాట నే పాడంగా
ఎంకి వంటి పిల్ల లేదోయి, నీ తోటే వుంటాను నాయుడు బావా ఇలా ఎన్ని ఎన్నోన్నో పాటలు ఆలా ఉదయం నుండీ మనసులో మె దులుతూ వున్నాయి.
చిత్త రంజన్ గారు , ఆయన భార్య మా వదిన కో లీ గ్స్ , ఆవిడ కూడా బా గా పాడే వారు.
ఆవిడ దగ్గర కూడా కొన్ని పాటలు నేర్చుకున్నాను.
ఘంటసాల గారు కూడా కొనకళ్ళ గారి రావోయి బంగారి మామ పాడారు గాని
ఈ పాటలు పాడలేదు.
నండూరి సుబ్బారావు గారి భార్య చాలా అందము గా ఉండేవారుట, అందుకే తాతగారు ఆలా పాటలు రాయగలిగారు అనేది మా వదిన .
ఎందుకో ఈ పాటలు అంత ప్రాచుర్యం పొంద లేదు అనిపిస్తుంది నాకు.
ఈ రోజు ఉదయం నుండీ ఈ పాటలు కూని రాగాలు తీస్తూ ఉంటే
ఈ రోజు హారతి పాట పాడలేదే అంటూ వచ్చింది మా సివంగి.
పండిత పుత్ర లాగా ఒక్క పాట కూడా నేర్చుకోలేదు నా గ్రాండ్ గాడిదలు
మా రెండో అమ్మాయి మాత్రం ఏదో కాస్త నాతో పాటు కాస్త రాగం తీస్తుంది.
టెక్నాలజీ వాడి పాటలు అన్నీ రికార్డు మాత్రం చేసారు.
భా వుక కోకిలమ్మను చూడగానే చిట్టిబాబు గారి కొమ్మలో కోకిల ఆ కోకిల కు జీవం పోసిన సుబ్బారావు గారు గుర్తు వచ్చారు.
Comments