top of page
Search

స్లో కుకింగ్

  • murthydeviv
  • 1 day ago
  • 2 min read

వారణాసి సుధాకర్ గారి పోస్ట్ కుంపటి ని, పొట్టు పొయ్యిని గుర్తు చేస్తే , ఈ రోజు జగదీష్ గారి పోస్ట్ పచ్చి జీడిపప్పు లు గుర్తు చేసింది.


ఆ రోజుల్లో పొయ్యి, కుంపట్లు మీద వంట నిదానంగా అయినా రుచి మాత్రం చాలా బాగుండేది.


పొట్టు పొయ్యి మా ఇంట్లో లేదు కానీ , మా అక్కయ్య గారింట్లో గుంటూరు లో వాడేవారు. అక్కయ్య గాని, పిల్లలు కానీ మద్యలో రోకలి పెట్టి పొట్టు కూరుతూ ఉంటే చూడటానికి సరదాగా ఉండేది కానీ కొంచెం లూస్ గా కూరినా రోకలి తీయగానే అంతా విడిపోయేది .


నేను ఎన్ని సార్లు సరదాగా చేద్దాం అన్నా నీకు రాదు వద్దు అనేది అక్కయ్య..


ఉదయం వెలిగించారంటే వంట త్వరగా అవటమే కాక , కొంచెం లేట్ గా పసిపిల్లలు కు నీళ్లు పోయటానికి నీళ్లు ఆ పొయ్యి మీదే పెట్టే వారు..

.

కుంపటి వెలిగించిటం కూడా ఒక టెక్నిక్ లాగా ఉండేది , సన్న టి సెగ మీద

పాలు బాగా మీగడ కట్టిందాకా అలాగే ఉంచే వారు.


మా నాన్నగారు మొదట గా హైదరాబాద్ లో మా కజిన్ సిస్టర్ ఇంట్లో గ్యాస్


స్టవ్ చూసి చాలా మోజు గా కొందామని అనుకున్నారట .

కానీ అప్పటికే గ్యాస్ స్టవ్ బుక్ చేస్తే ఒక ఏడాది కో ఎప్పుడో ఇచ్చేవారు..


హైదరాబాద్ నుండి వచ్చి ఎంతో వింత గా మాకు చెప్పారు.


పొయ్యి మీద వంట చేస్తూ రోజూ తడి కట్టెలు తెచ్చా ర ని మా వంట బామ్మ గారు మా అమ్మ గారి మీద విసుక్కుంటూ ఉండేది.


ఆవిడ వంట ఒక్కటే చేసేవారు. ఇంక కుంపట్ల మీద అమ్మ గారు కాఫీలు, ఉదయం టిఫిన్లు చేసే వారు


దోశ లు , ఇడ్లీ, మిన ప రొట్టె అన్నీ ఆ కుంపటి మీదే చేసే వారు.

అన్నయ్యలు సెలవులు కు వస్తే ఆ కుంపటి చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ , టిఫిన్లు తినే వాళ్లము.


శని, ఆదివారం ల్లో ఆ కుంపటి లో చిక్కుడుకాయలు, చిల్కడ దుంపలు, బంగాళాదుంప లు, పనస గింజలు ఒకటేమిటి ఆ సన్న సెగ మీద


కాల్చి తినే చిరు తిండి కి అంతు ఉండేది కాదు. మా ఊరు చుట్టూ అరోజుల్లో


జీడి మామిడి తోట లు బాగా ఉండేవి. ఎవరో ఒకరు ఆ పచ్చి జీడి కాయలు


తెచ్చి ఇచ్చే వారు అవీ ఆ నిప్పులు మీద కాల్చి అవీ కొట్టి ఆ పప్పులు

తీసి తింటూ ఉంటే , ఆ రుచి ఇప్పుడు కూడా గుర్తు వస్తుంది.


ఆ కాల్చిన కాయలు కొడుతూ ఉంటే ఒక్కొక్కసారి చేతులు ఆ జిగురుకి

మంట , జిల వచ్చేది.

మా అమ్మ గారు జాగ్రత్తగా కొట్టండి , ఆ రసం కళ్ళ ల్లో పడుతుంది

అంటూ అరుస్తున్నా మా తిండి యావ మాత్రం తగ్గేది కాదు.


ఆ పచ్చి జీడిపప్పు కూరల్లో వేయాలంటే మా వంట బామ్మ గారికి మేము, కానీ , మా అమ్మగారు కానీ పప్పు తీసి ఇవ్వాల్సిందే.


ఈ ఉదయం నుండీ ఆ రోజులన్నీ గుర్తు వచ్చాయి..


ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం మా వారికీ పొలం డబ్బులు వసూలుకు వెళ్ళటానికి

వీలు కాక మా అబ్బాయిని పల్లెటూరు కి పంపారు.


అక్కడ మా దూరపు బంధువులు ఇంట్లో నాలుగు, ఐదు రోజులు వున్నాడు.


ఊరు నుంచీ రాగానే వాళ్ళింట్లో దోసకాయ పప్పు, గోంగూర పప్పు చాలా బాగుంది, మనింట్లో ఆలా ఉండదే అనీ అడిగాడు.


అదీ స్లో కుకింగ్ , కుంపటి లో అనీ చెప్పాను. మీరు కూడా అలాగే వండండి

అనీ చెప్పాడు కానీ, మేము అంత ధైర్యం ఇంకా చేయలేదు.


నా ఫ్రైండ్ ఒకావిడ జే. ఎన్ టీ యూ లో లెక్చరర్ గా చేసింది .


ప్రతి ఆదివారం కుంపటి లో నే పప్పు చేసేది. ఇప్పుడు ఢిల్లీ కొడుకు దగ్గర కి


వెళ్లారు. కుంపటి ఏం చేసిందో నేను అడగ లేదు.


కుంపటి గురించి చెప్పుకుంటూ మన ఆంధ్రుల అభిమాన బాపు రమణ లను


తల్చు కోక పొతే ఎలా రాధ గోపాలం కధల్లో సరసాలు అన్నీ ఆ కుంపటి చుట్టూ నే కదా.


పెళ్లి పుస్తకం సినిమా తీసిన నిర్మాత మా వారి ఫ్రెండ్ ముహూర్తం షాట్ కి


పిలిస్తే వెళ్ళాము. అక్కడ బాపు గారిని మాకు ఇంట్రడ్యూస్ చేయ గానే

మా అమ్మాయి మీ సినిమా లో కుంపటి సీన్ పెట్టచ్చు కదండీ అనీ అడిగింది.


మిత భాషి అయినా బాపు గారు అలాగే పెడదాం లేమ్మా అంటూ నవ్వారు


ఈ రోజు ఆ కుంపటి చూడగానే ఇవ్వన్నీ గుర్తు వచ్చాయి.


బార్బక్యూ ఆంటే కాల్చుకుని తినటమే గా ,


ఈ హైదరాబాద్ లో బార్బక్యూ నేషన్ అనీ హోటల్స్ చూసిన్నట్లు గుర్తు .

కుంపటి మీద మా పెద్దమ్మ బంగాళాదుంప అల్లం పచ్చిమి ర్చి వేసి


కూర లో కొద్దిగా నిమ్మకాయ రసం పిండేది. ఆరోజుల్లో అల్లుడు కూర అనే వాళ్ళు.


ఎన్ని సార్లు చేసినా ఆ రుచి రాదు. అదీ కుంపటి మహిమ

 
 
 

Recent Posts

See All
తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ

 
 
 
మధుర గీతాలు సురయ్యా, నూర్జాహన్

దూర్ దర్శన్ వచ్చిన కొత్తలో శనివారం పాత హిందీ సినిమాలు వేస్తూ వుండే వారు. ఆలా చూసిన సినిమాల్లో మీర్జా గాలిబ్ ,రుస్తుం సోహెరాబ్ అనే ఇంకా శాంతా రామ్ గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు

 
 
 
ఆవకాయ 2

అబ్బా ఈ రోజుతో అవకాయ రుచులు చూసి, చూసి ఇంక అన్నీ సరిపోయి నేలే అనుకుంటూ జాడిల్లోకి ఎత్తి అమ్మయ్య ఇంక ఈ ఏడాదికి అవకాయ పని అయిపోయింది అనీ ఊపిరి పీల్చుకున్నాను. ఇంక అందరికి రుచి కోసం పంపే

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page