top of page
Search

సినిమా బండి

murthydeviv
3 days ago
2 min read

ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు సరదాగా రాస్తూ ఉంటారు


ఈ సినిమా బండి గురించి రాసారు వెనకటి .రోజు ల్లో మన ఊర్లల్లో రిక్షా లో మైక్ పట్టుకుని నేడే చూడండి అంటూ సినీ పేరు ,యాక్టర్స్ సినిమా గురించి వర్ణిస్తూ చెప్పే వారు . చివరగా రంగు కాగితాలు గాలిలో ఎగరేసి వెళ్ళే వాడు.

ఈ కాగితాలు కోసం పిల్లలు రిక్షా వెంబడి పరిగెత్తూ వుండే వారు.


మా ఇంట్లో సాయంత్రం పూట కొసరు వంట మనిషి కూతురు వచ్చి ఇడ్లీ పిండి రుబ్బటానికి వచ్చేది. వచ్చేటప్పుడు ఒక సినిమా కాగితం

పట్టుకుని వచ్చేది . తనకు పెద్దగా చదవటం రాదు . మేము చదివి అందులో టూకీగా రాసిన కథ చెప్పాలి.


ఆ పిండి రుబ్బటం అవగానే మా అమ్మగారి దగ్గర నాలుగు చివాట్లు తిని అయినా సినిమాకి కావల్సిన పావలా సోడా కోసం ఒక అర్ధ నా

సంపాదించేది. మా అమ్మ గారు నాలుగు చివాట్లు పెట్టినా డబ్బులు అయితే ఇచ్చేవారు .

మర్నాడు రాగానే పిండి రుబ్బుతూ మాకు సినిమా కథ పేర్లు దగ్గరనుండి చివరి ఫైటింగ్ లతో సహ వర్ణించి చెప్పేది

ఒక్కొక్క సారి సినిమా పాటల పుస్తకం తెచ్చేది .

అప్పట్లో మంచి సినిమా అయితే పెద్ద నాన్నగారు నన్ను అక్కయ్య నీ తీసుకుని వెళ్ళేవారు. అన్నయ్య లకు అయితే పర్మిషన్ ఉండేది ఆదివారం సినిమా కి ,మాక్ మాత్రం పెద్దనాన్న గారితోనే.

రెండో అన్నయ్య బయట ఊర్లో చదువుకునేవాడు .


తను వచ్చినప్పుడు మాత్రం సినిమా లే సినిమాలు అయితే అన్నయ్య కు రాజులు కత్తి యుద్దాలు అలాంటి జానపదాలు కి తీసుకుని వెళ్ళేవారు .మా చెల్లెలు ఎప్పుడూ భక్తి సినిమాలు కే ఓటు

నాకు మాత్రమే సాంఘీక సినిమాలు ఇష్టం గా ఉండేవి.


సినిమా కి వెళ్లినా వెళ్లక పోయినా మా వంట అమ్మాయి వర్ణించి చెప్పే కథలు మాత్రం విన సొంపు గా ఉండేవి.


ఇంక మా అక్కయ్య పిల్లలు తో వస్తే మా కు చేతి నిండా పని. అత్తగారింట్లో పిల్లలు తో iమామ గారు చాలా డిసెప్లిన్ గా వుండే వారు

ఇంక ఇక్కడికి రాగానే వాళ్ల అల్లరి కి అంతు ఉండేది కాదు , అందులో మొదటి గొడవ సినిమా బండి రాగానే ఆ రిక్షా వెంబడి పరిగెత్తే వారు.


ఒక డజన్ కాగితాలు ఏరుకుని వస్తే కానీ వాళ్లకు తృప్తి ఉండేది కాదు. ఇంట్లో అన్నయ్య లో మెమో వాళ్ల వెంబడి పరిగెత్తి పట్టుకోవాల్సిందే . చెట్లు ఎక్కటం ఏదో ఒక అల్లరి చేస్తూనే వుండే వాళ్ళు..


సినిమాకి వెళ్ళినా ప్రశాంతం గా సినిమా చూడనిచ్చే వాళ్ళు కాదు..ఒక్కొక్క సారి ఇంట్లోనే వదిలి వెళ్ళే వాళ్లము.

ఆ సినిమా బండి కధ చదవగానే నాకు ఆ రోజులు గుర్తు వచ్చాయి.


భూమి గుండ్రంగా ఉండును అన్నట్టు మేము మా అమ్మాయి పెళ్ళికి ఇంట్లో వుండే వంట మనిషి కోసం చూస్తూ ఉంటే మా బంధువులు పంపిన వంట మనిషి చిన్నప్పుడు మా ఇంట్లో వున్న ఆవిడే . అందర్నీ బాగా గుర్తు పెట్టుకుని చక్కగా మాట్లాడింది.. బాగా వంటలు కూడా చేసేది.


సినిమా పిచ్చి పోలేదు, దానికి తోడు టీవీ సీరియల్స్ తో పాటు క్రికెట్ కూడా చూసేది..

సినిమా లో జోక్స్ కి నవ్వులతో , ఫైటింగ్ లకు రియాక్షన్ కామెంట్స్ తో సీరియల్ లో కష్టాలకి కన్నీళ్లు

ఇంక క్రికెట్ కి చప్పట్లతో మా హాలు దద్దరిల్లి పోయేది.


మా ఆత్త గారు మా అడబడుచులు వస్తే ఈ వంట అమ్మాయి క్రికెట్ కూడా చూస్తుందే అనీ వింత గా చెప్పే వారు..

ఆవిడ నీకు క్రికెట్ అర్ధం అవుతుందా అంటే ఆవిడకి క్రికెట్ గురించి ఎక్సప్లయిన్ చేసేది.


నా బదులు మా ఆత్త గారికి వివరంగా కధ చెప్పేది.


మా అదృష్టం కొద్దీ ఒక మూడు నెలలు మాకు సినిమా చూపించింది .


అవీ ఈ నాటి కబుర్లు శుభ రాత్రి










 
 
 

Recent Posts

See All
చండీ ధ్వజ స్తోత్రం దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తో

ఓం నమో జగిత్ప ష్టాయై దేవ్యై భూత్యై నమోనమః. పరమానంద రూపీ ణ్యై నిత్యా యై సతం తం నమః నమస్తేస్తు మహా దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ రక్ష మాం శర ణే దేవీ ధన ధాన్య ప్రధాయిని రాజ్యమ్ దేహి ధనం

 
 
 
షాపింగ్

పూజ అయ్యాక ఏదో చదువు తూ కూర్చుంటే మా బేబీస్ తెగ అరుపులు, మనము ఎట్లాగూ సోఫా లోనుంచి లేవము. ఆమెజాన్ ఏదో పార్సెల్ వచ్చి ఉంటుందిలే, అనుకుంటూ డబ్బులు ఇవ్వాలా అన్నాను. ముందే ఇచ్చారుట, అంది నా చెలీ.

 
 
 
కాఫీ దినోత్సవం

ఈ రోజు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ట . అందుకే కాఫీ గురించి రాయక పొతే ఎలా అందులో ఒక వారం రోజుల నుండీ ఉత్తర భారత దేశంలో ఉండి కాఫీ కోసం తపన పడిపోయింది మనసు . ఏ హోటల్ అయినా కాఫీ అనీ అడిగితే నేస్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page