షాపింగ్
పూజ అయ్యాక ఏదో చదువు తూ కూర్చుంటే మా బేబీస్ తెగ అరుపులు, మనము ఎట్లాగూ సోఫా లోనుంచి లేవము. ఆమెజాన్ ఏదో పార్సెల్ వచ్చి ఉంటుందిలే, అనుకుంటూ డబ్బులు ఇవ్వాలా అన్నాను. ముందే ఇచ్చారుట, అంది నా చెలీ.
మా కుక్కలు ని కుక్కలు ఆంటే మా గ్రాండ్ చిల్డ్రన్ ఒప్పుకోరు .
అందుకని వాళ్ల లాగా ముద్దు చేయలేను కానీ రెండిటిని కలిపి బేబీస్ అంటాను
రోజూ బ్లింక్ ఇట్, ఆమెజాన్ ఇలా రకరకాలుగా యాప్ లు వాటిల్లో ఏవో ఒకటి వస్తూనే వుంటాయి. కుక్కర్ గాస్కెట్
పాడు అయింది అనీ చెప్తే ఇలాగే అమజాన్ లో తెప్పించింది మా కోడలు.
ఆ గాస్కెట్ పెట్ట గానే విజల్ కన్నా ముందే పెద్ద సౌండ్ వచ్చింది మూత ఎగిరి పడుతుందేమో అనీ గ్యాస్ ఆపేసాను.
. కవర్ దాచి పెడితే వెనక్కి ఇవ్వచ్చు. కానీ కవర్ ఎక్కడో పడేసారు
ఇలా రోజూ ఏవో పాకెట్స్ వస్తూ వుంటాయి.
ఒక పది రోజులు మా పెద్ద అమ్మాయి ఇంట్లో ఉంటే అక్కడ ఉదయం ఏడు గంటలకు కి మొదలవుతుంది , ఈ బ్లింక్ ఇట్
పాలు, కూరలు ఒకటేమిటి ఇలా అనుకోవటం అలా ఫోన్ లో కొట్టటం , బెల్ మోగుతుంది ఒక పెద్ద కవర్ వాకిట్లో వుంటుంది.
డ్రైవర్ గాని నీవు కానీ వెళ్ళచ్చు ఆంటే, నా ఫ్యాక్టరీ నే దూర మ్ ఇంక ఈ ట్రాఫిక్ లో ఈ గొడవ లు ఎవడు పడతారు అంటుంది.
ఇంక అల్లుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ లో బిజీ ఆయన తొమ్మిది కల్లా బిజీ. అందుకే ఈ బ్లింక్ ఇట్ ఈజీ.
ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఆంటే ఇలా ఏదయినా కావాలి ఆంటే ఒక అరగంట లో వాకిట్లో ప్రత్యక్షం అవుతుంది.
మాయా బజార్ లో మంత్ర దండం లాగా . ఇవ్వన్నీ చూస్తూ ఉంటే మన చిన్నప్పటి రోజులు గుర్తు రావటం సహాజమే కదా.
మా చిన్నప్పుడు మా పెద్దనాన్న గారు ప్రతి ఆదివారం మార్కెట్ కి వెళ్ళి కూరలు తెచ్చేవారు అయన వెంబడి ఎవరో పని వాడు ఉండేవాడు. ఆ కూరలు అన్నీ . ఏరి పెద్ద వెదురు ఫల్లిక ల్లో వేసి పెట్టే వారు.
ఆరోజుల్లో ఫ్రిడ్జ్ లు ఉండేవి కాదు కదా.
ఆ మార్కెట్ కి మేము ఎప్పుడూ వెళ్ళలేదు, మా బామ్మగారు మా మేనత్త గారింటికి వెళ్తూ ఉంటే ఆ మార్కెట్ దగ్గర ఆగి పండ్లు కొనే వారు., అదీ మేము దిగే వాళ్లము కాదు డ్రైవర్ వెళ్లాల్సిందే.
పెద్దనాన్న గారి తర్వాత అన్నయ్యలు, తమ్ముడు వెళ్ళే వారు . మా వదినకు మార్కెట్ కి వెళ్లాలని చాలా సరదాగా ఉండేది.
కానీ ఆ ఊర్లో మాత్రం వెళ్ళేవాళ్ళము కాదు.
పంజాబ్ వెళ్ళాక మొదట్లో మా వారితో కూరలకు వెళ్ళటం అవీ కొనటం , వండటం మొదట్లో అన్నీ ఎక్సపెరిమెంట్ చేయటం మే.
సింగిల్ ఫ్యామిలీ నుంచీ వచ్చారు కాబట్టి వంట లో ఏ బీసీ డి లు తెలుసు సో అయన ట్రైనింగ్ లో నేర్చుకున్నాను.
ఇంక హైదరాబాద్ వచ్చాక మొదట్లో ప్రతిదీ కోఠి నుండీ తెచ్చుకోవాల్సి వచ్చేది. అప్పటికీ మలక్ పేట అంత డెవలప్ కాలేదు. 90 డి బస్సు ఖాళీగా ఉండేది.. ఆలా సుల్తాన్ బజార్ లో దిగి కూరలు పండ్లు అన్నీ కొనుక్కుని
తాజమహల్ లోనో, ఆనంద్ భవన్ లోనో మసాలా దోశ తిని మెల్లగా యింటికి చేరే వాళ్లము.
అన్నయ్య వాళ్ల ఫ్యామిలీ ఇక్కడికి వచ్చాక మార్కెట్ కి వెళ్ళి రోజు ఫ్రెష్ కూరలు కొనాలి అనే మా వదిన కోరిక నెరవేరింది.
అప్పటికీ మలక్ పేట లో కూడా కూరల మార్కెట్ వచ్చింది.
మా వదిన రోజూ వాకింగ్ అవుతుంది , ఫ్రెష్ కూరలు తెచ్చుకోవచ్చు అనీ బయలు దేరేది. ఒక్కొక్క రోజు అబ్బా ఏం వెళ్తాము లే అనుకున్నా వదిన ఊరుకునేది కాదు. అప్పటికీ ఫ్రిడ్జ్ లు వచ్చేసాయి.
కూరలు చవకగా దొరుకుతాయి అనుకుంటూ మండీ లు కి తిరిగిన రోజులు కూడా వున్నాయి. మొదట్లో మంచి ఆవకాయ కాయ కోసం శాలి బండ వెళ్లాల్సి వచ్చేది.. సికింద్రాబాద్ లో మో ండా మార్కెట్, లోనే దొరికేవి.
అవపిండి, కారం కోసమే బేగం బజార్ వెళ్లాల్సి వచ్చేది. స్వస్తిక్ బ్రాండ్ కారం అవపిండి కి జనం క్యూ కట్టి వుండే వారు
నూనె కూడా అక్కడే స్పెషల్ గా దొరికేది.
ఇప్పుడు ఆ కారాలు అవీ అలవాటు గా అమ్మే షాపు వాడు కూడా నేను పంపుతాను మీరు ఈ ట్రాఫిక్ లో ఏం వస్తారు అంటాడు.
మంచి
మామిడి పండ్లు కోటీ ఉమెన్స్ కాలేజీ దగ్గర వరసగా బండ్లు పెట్టీ అమ్మే వారు.. ఒక్క అరటి పండ్లు , సితా ఫలాలు .
ఇళ్ల ముందరికి వచ్చేవి.
ఆ రోజుల్లో సరదాగా అన్నింటికి తిరిగి తెచ్చుకునే వాళ్లము. ఇప్పుడు అయితే ఒక ఫోన్ ఉంటే చాలు బ్లింక్ ఇట్, అమెజాన్ , ఇంక స్విగ్గి లు కి అంతు లేదు.
మరలా. మా బేబీస్ అరుస్తూ ఉంటే నా లోకం లో నుండీ ఈ లోకం కి వచ్చాను. రాపిడో లో పాప కి బుక్స్ వచ్చాయిట అన్నది నా నెచ్చలి.
ఓహో ఇది ఇంకోటి ఉంది కదా మర్చిపోయాను. అనుకుంటూ లంచ్ మనమే తినాలి కదా అని లేచాను.
Comments