top of page
Search

కాఫీ దినోత్సవం

murthydeviv
Oct 2
2 min read

ఈ రోజు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ట . అందుకే కాఫీ గురించి రాయక పొతే ఎలా అందులో ఒక వారం రోజుల నుండీ ఉత్తర భారత దేశంలో ఉండి కాఫీ కోసం తపన పడిపోయింది మనసు .


ఏ హోటల్ అయినా కాఫీ అనీ అడిగితే నేస్కేఫ్ ,తో కాఫీ రంగు కూడా లేకుండా పంచదార పానకం లాగా ఇస్తారు.

పంచ దార వద్దు ఆంటే ఆబ్బే అసలు పాలే తాగితే పోలా అన్నట్లు వుంటుంది.

కాఫీ అడిగి మాకు కధలు చెప్పకుండా , మట్కా చాయ్ తాగు అనీ మా పిల్లలు ఆంటే సరే కదా అనీ అదేమిటో స్పెషల్ చాయ్ అనుకున్నాను.

చిచ్చు బుడ్డి లాగా వున్న మట్టి కుండ లో చాయ్ ట మొదటి రోజు ఆ వేడి కి ఆ కుండ పట్టుకోలేక చాయ్ అంతా వొలక పోసాను. రెండో రోజు టెక్నిక్ నేర్చుకుని మెల్లగా తాగాను.

ప్లాస్టిక్ గోల లేకుండా ఈ కుండ లు బాగానే వున్నాయి అనుకున్నాను .


ఒక హోటల్ వాడు మాత్రం నేస్కఫ్ వుంది , ఎలా కలపాలో మీరే కలుపుకోండి, అన్నాడు కానీ ,కాఫీ పాఠాలు ఎక్కడ చెపుతాము అనుకుంటూ , ఆ చాయ్ ఇవ్వు నాయనా అన్నాను.


అసలు కాఫీ కధ చెప్పకుండా ఈ మట్కా చాయ్ గురించి ఎందుకూ అనుకుంటూ అసలు సిసలు కాఫీ ప్రియులు గురించి చెప్పుకుందాం.

ఉదయాన్నే అప్పుడే కాగిన పాలల్లో సమ పాళ్ళలో పంచ దార, చిక్కటి డికాషన్ వేసి నురుగు లు వస్తున్న కాఫీ తాగుతూ ఉంటే , ఎంత కవిత్వం అయినా రాయచ్చు.


వెనకటి కాలం లో కవులు కవిత్వం రాయటానికి ఏవేవో కావాలనే వారు కానీ , ఈ కాలం లో కవులకు , మంచి కాఫీ ఉంటే చాలు అనుకుంటాను నేను.


నాకు కాఫీ ఎప్పుడు అలవాటు ఆయిందో గుర్తు లేదు కానీ , మంచి కాఫీ ఇచ్చిన వాళ్లను మరచి పోను.

కాఫీ కలపడం కూడా ఒక ఆర్ట్ ,


కాఫీ కి రుచి ఏమిటీ ఏదో అలవాటు గా తాగటం తప్పితే , అనీ మా వారు ఆంటే మీరు సిగరెట్ రుచితో ఈ రుచి తెలియదు లెండి అంటాను.


అసలు కాఫీ ఆంటే మన తమిళ సోదరుల గురించే చెప్పుకోవాలి , వాళ్ళు ఆ గిన్నెలో గ్లాస్ బోర్లించి అంత సెగలు కక్కే కాఫీ ఎలా ఇస్తారా అనీ ఎప్పుడూ వింత గానే వుంటుంది


కేరళ , కర్ణాటక వెళ్ళినప్పుడు , హై వేస్ మీద మంచి కాఫీ తాగుతూ ఆహా అనుకోవటమే , ఏ గుడి కి వెళ్ళినా నడిచి నడిచి అలసి పోయి బయటికి రాగానే కాఫీ ఎక్కడ దొరుకుతుందో చూడటం నేర్చుకున్న తమిళ భాష లో సు డా కాఫీ అని.అడిగి తాగి గుడ్

అని చెప్పటం.


ఇప్పుడు మన సౌత్ ఇండియా లో ఎటు వెళ్లినా మంచి కాఫీ షాపులు కనిపిస్తూ వుంటాయి

.

ఎన్ని కాఫీ డేలు, స్టార్ బక్స్ వచ్చినా మన సౌత్ ఇండియన్ కాఫీ

ముందు బలాదూర్ . మన ఫిల్టర్ కాఫీ రుచి అమోఘం.


పిల్లలు మేకడోనాల్డ్, పిజ్జా హట్ లు వెతికి తే నేను చెన్నపట్నం , కుంభ కోణం కాఫీ కోసమే వెతుకుతాను.

మంచి కాఫీ లాంటి సినిమా అనీ అయన ఎవరో ఆంటే , ఏమిటో ఈ కాఫీ రాగాలు అనుకుంటాను నేను.

తమిళ్ కాఫీ బాగుంటుంది కదా అనీ నేను తమిళ వాళ్ళ దగ్గర కాఫీ పొడి కొంటాను. ఆ షాపు వాడు ఏదయినా ఊరు వెళ్తున్నా ఫోన్ చేసి మరీ మా ఇంట్లో కాఫీ నిల్వలు కనుక్కుంటాడు


అదీ మన కాఫీ గత ప్రాణులు చరిత్ర














 
 
 

Recent Posts

See All
చండీ ధ్వజ స్తోత్రం దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తో

ఓం నమో జగిత్ప ష్టాయై దేవ్యై భూత్యై నమోనమః. పరమానంద రూపీ ణ్యై నిత్యా యై సతం తం నమః నమస్తేస్తు మహా దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ రక్ష మాం శర ణే దేవీ ధన ధాన్య ప్రధాయిని రాజ్యమ్ దేహి ధనం

 
 
 
సినిమా బండి

ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు సరదాగా రాస్తూ ఉంటారు ఈ సినిమా బండి గురించి రాసారు వెనకటి .రోజు ల్లో మన ఊర్లల్లో రిక్షా లో మైక్ పట్టుకుని నేడే చూడండి అంటూ సినీ పేరు ,యాక్టర్స్ సినిమా గురించి వర్ణ

 
 
 
షాపింగ్

పూజ అయ్యాక ఏదో చదువు తూ కూర్చుంటే మా బేబీస్ తెగ అరుపులు, మనము ఎట్లాగూ సోఫా లోనుంచి లేవము. ఆమెజాన్ ఏదో పార్సెల్ వచ్చి ఉంటుందిలే, అనుకుంటూ డబ్బులు ఇవ్వాలా అన్నాను. ముందే ఇచ్చారుట, అంది నా చెలీ.

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page