ఇంతకు ముందు సప్తశతి లో నాలుగు అద్భుతమైన దివ్య స్తోత్రములను గురించి తెలుసుకుందాము.
మొదటి స్త్రోత్రం ము, బ్రహ్మ విష్ణువు ను మేల్కొలిపి మధు కైట బులను, అసురులను వధింప మని
ప్రార్ధించగా,విష్ణువు తన శేష తల్పము నుండి మేల్కొని ఇరువురు అసురులను వధించెను.
ఈ స్త్రోత్రము ప్రథమ అధ్యాయము లో వుంటుంది. పదహారు శ్లోకములు.
రెండవ స్త్రోత్రం, శ క్రా ది స్తుతి,, నాలుగు స్తోత్రము లలో, ఈ స్తోత్రమ్ దీర్ఘమైనది. ఇరువది ఐదు శ్లోకములు.
నాలుగవ అధ్యాయము లో వుంటుంది. మహిషాసుర వధ అనంతరం ఇంద్రాది దేవతలు దేవిని ప్రార్థించు దురు.
మూడవ స్తోత్రమ్, తంత్రోక్త దేవి సూక్తం లేక అపరాజిత స్తోత్రమ్. పంచమ అధ్యాయము లో వుంటుంది
75శ్లోకములు.
బెంగాలీ వాళ్ళు నవరాత్రుల లో ఎక్కువ చదివే స్తోత్రమ్ ఇది. శంభు నిశుంబులను వధింపుమని దేవతలు దేవిని ప్రార్థించు స్తోత్రము
నాలుగవ స్తోత్రమ్ నారాయణీ స్తుతి,, ఏకాదశ అధ్యాయము లో వుంటుంది ముప్పదిమూడు శ్లోకములు
శుంభ నిశుంభా సురల వధానంతరం,ఇంద్రుడు ,ఇతర, దేవతలు, అగ్ని దేవునితో కూడి కాత్యాయనీ దేవిని
ప్రార్ధిం తురు.
దేవీ సప్తశతి పారాయణం చేయలేని వారు ఈ స్తోత్రములు పారాయణ చేసుకున్నా మంచిదే
మా గురువుగారు అయితే చండీ నవా వర్ణ మంత్రము అక్షర లక్ష చేస్తే గాని సప్తశతి పారాయణం చేయటానికి అర్హత రాదు అనిచెప్పేవారు. కానీ ఇపుడు అందరూ నవరాత్రులలో చేస్తున్నారు.
సప్తశతి పారాయణం నియమం తో ఒక్క రోజులో పారాయణం చేయటం ఉత్తమమైనది. కానీ ఆ విధముగా
చేయడానికి సామర్థ్యము లేని వారు సప్తశతి పారాయణ ము ను ఏడు దినము లలో కూడా పూర్తి చేయవచ్చును.
మొదటి రోజు ఒకటో అధ్యాయము
రెండవ రోజు రెండు, మూడు అధ్యాయములు.
మూడవరోజు నాలుగవ అధ్యాయము
నాలుగవ రోజు ఐదు,ఆరు, ఏడు, ఎనిమిది ఆధ్యాయములు
ఐదవ రోజు తొమ్మిది, పది , అధ్యాయములు
ఆరవ రోజు పదకొండవ అధ్యాయము
ఏడవ రోజు పన్నెండు, పదమూడు అధ్యాయముల
మూడు రోజుల లో, లేక ఐదు రోజులలో పూర్తిగా పారాయణ చేయాలనుకున్నా ఈ అధ్యాయముల క్రమము ఇలాగే వుండాలి. మధ్యలో ఆపకూడదు. దేవీ సప్తశతి పుస్తకం కూడా అమ్మ వారితో సమానమైనది అని భావించాలి.
అందువలన పుస్తకము ను చేతిలో పట్టుకుని చదవ కూడదు అంటారు . శుచి, శుభ్రత, పాటించాలి. భక్తి శ్రద్ధలతో పఠించాలి.
పారాయణ క్రమము,
దేవీ సూక్తం ఎనిమిది శ్లోకములు.
దేవీ కవచము అరువది ఒకటి శ్లోకములు. భక్తుని అవయములన్నిటికి, రక్షణ, అన్నీ క్లేశముల నుండి విముక్తి కలుగును.
ఆర్గ ళా స్తోత్రము. ఇరువది ఏడు శ్లోకములు . మార్కండేయ మహర్షి తన శిష్యులకు బోధించినది. ఈ ప్రార్థన వలన
భౌతిక విషయ సమృద్ది, ఐశ్వర్యము, దేహ సామర్థ్యము, ఆరోగ్యము, శతృ హాని,విజయము, పేరు ప్రతిష్టలు, ముక్తి
ప్రాప్తించును.
కీలకము పదహారు శ్లోకములు.. మార్కండేయ మహా ముని తన శిష్యులకు బోధించినది. దీనిని పఠించుట వలన
భక్తునకు సర్వ బాధ, క్లేశ, నివృత్తి కలుగును.
రాత్రీ సూక్తం ఋ గ్వేద మందలి ఎనిమిది శ్లోకములు, రాత్రీ అనగా సుఖము నిచ్చునది. ఆనందము కలిగించునది అని అర్థం.
లేదా భక్తులు కోర్కెలు నీ డేర్చు దేవి యని అర్థము.
దేవీ సప్తశతి పారాయణం వలన కలిగే ఫలితాలు ను దుర్గాదేవి స్వయముగా పలికిన వాక్కులు ఫలశ్రుతి యై న
ద్వాదశ అధ్యాయములో దుర్గాదేవి స్వయముగా పలికిన వాక్కులు ముప్పది శ్లోకములలో వున్నవి .
సప్తశతి లోని అంతరార్ధం ముల గురించి రేపు తెలుసుకుందాము.
శ్రీ మాత్రే నమః
Comments