వన భోజనం
కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్లో పూజలు , మా ఆత్త గారు చేసిన పూజలు అన్నీ గుర్తు వస్తాయి .
ఈ రోజు ఫేస్ బుక్ లో ఏదో గ్రూప్ వాళ్ళు వన భోజనాలు ఆరేంజ్ చేస్తున్నామని పార్టిసిపేట్ చేయటానికి ఫీజు
వగైరా రాశారు అదీ చూడ గానే నాకు తాత గారు కార్తీకమాసం లో వన భోజనాలు అమ్మా వాళ్ళు చెప్పిన విషయాలు
గుర్తు వచ్చాయి.
తాత గారు కార్తీక మాసం లో పార్వతీ కళ్యాణం కూడా చేసేవారుట.. ఆ కళ్యాణం శివాలయం లో చేసే వారు అనుకుంటాను.
వన భోజనాలు మాత్రం దగ్గర లోనే వున్న తోట లో చేసే వారుట , అక్కడికి దగ్గర లో కృష్ణ కాలువ ఉండేది.
ఆ రోజుల్లో నీటి వసతి చూసు కోవాలి కదా , ఇప్పటిలాగా నీళ్లు కొనుక్కోవటం కాదు గదా .
బండ్ల మీద సామాను అంతా తీసుకుని వెళ్లేవారుట , అక్కడ ఉసిరి చెట్లు ఉండేవి. అక్కడ ముందు అభిషేకం
చేసి , తర్వాత వేద పారాయణం అదీ చేయించి అప్పుడు భోజనాలు వడ్డించే వారుట .
చుట్టు పక్కల ఊర్ల నుండి కూడా బండ్లు కట్టించుకుని వచ్చే వారుట . ముందు కబురు చేసే వారేమో తెలియదు.
అంతా ఒక పెళ్లి లాగా జరిగే ది ట.
అరోజుల్లో భోజనాలు మధ్యలో అందరూ పద్యాలు అవీ పాడుతూ ఉండేవారు.
ఆ తర్వాత రోజుల్లో అక్కడ వున్న పుట్ట లో మేము చవితికి పాలు పోయటానికి వెళ్ళి నప్పుడు అమ్మగారు ఇక్కడే తాతగారు వన భోజనాలుకి ఏర్పాట్లు చేసే వారు అని చెప్పేది.
మేము వెళ్ళే రోజుల్లో కూడా అక్కడ చాలా ఉసిరి, జీడీ మామిడి, కొబ్బరి చెట్లు తో పెద్ద తోట లాగా ఉండేది . ఆ కాలువ బుకింగ్ హామ్ కాలువ అని మేము హై స్కూల్ కీ వచ్చాక తెలిసింది.
మా తాత గారు చేసిన వన సమారాధన గురించి అమ్మా వాళ్ళు చెప్పిన దాని కంటే కొన్ని ఏళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఎంతో గొప్పగా వర్ణించి చెప్పారు. ఆ రోజు మాత్రం తాతగారికి మనవరాలు గా పుట్టటం ఏదో జన్మ లో చేసుకున్న పుణ్యం అనిపించింది.
మా చెల్లెలు కీ సంభందం చూడటానికి వచ్చిన వాళ్ళ లో ఒక పెద్దావిడ కూడా వచ్చారు. మా నాన్నగారి పేరు చెప్పగానే ఆవిడ తాత గారిని గురించి చెప్పటం మొదలు పెట్టారు. ఆవిడ పుట్టిల్లు కూడా మా ఊరు ట .
ధనుర్ మాసం లో ఆరుద్ర అభిషేకం గురించి , వన భోజనాలు గురించి, అత్తయ్య లు పాడే హారతి పాటలు గురించి ,
పద్యాలు , బ్రాహ్మణు ల వేద పారాయణం గురించి ఎంత గానో చెప్పారు.
మీకు కూడా మీ అత్తయ్య లాగా సంగీతం వచ్చా అని కూడా అడిగారు . హారతి పాట లు మాత్రం నేర్చుకున్నాము అని చెప్పాను. ఆలా ఆ రోజు ఆ బామ్మ గారు తాత గారి గురించి చెప్తూ ఉంటే చాలా ఆనందం కలిగింది.
అలా మా ఆత్త గారి పల్లెటూరు లో చెరువు దగ్గర గా వున్న తోట లో వన భోజనాలు చూసాను. అప్పుడు మా ఆత్త గారు ఊర్లో వుండే ఆడవాళ్లు కలిసి వంట చేసారు . ఆభిషేకం కూడా చేసారు . చెరువు ఒడ్డు కాబట్టి స్నానం,, దీపాలు పెట్టటం
చాలా శ్రాస్త్రోక్తం గా చేసారు అందులో పల్లెటూరు కదా .
వన సమారాధన అంటూ చూడటం అదే మొదటి సారి. అందులో పల్లెటూరు కాబట్టి ఆచారం కూడా చాలా వుంటుంది.వంట కూడా రాళ్లు పెట్టీ కట్టెలు మీద వండుతారు . కొత్త గా చూడటం కాబట్టి వింత గా కూడా వుంటుంది.
నాకు అయితే మా చిన్నప్పుడు చేసుకున్న గుజ్జన గూళ్ళు గుర్తు వచ్చాయి.
ఇప్పుడు అయితే అంతా కేటరింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవెనింగ్ స్నాక్స్ , నాకు అయితే పిక్నిక్ లాగా అనిపిస్తుంది.
నేను కార్తీక మాసం రాగానే కొంచెం దూరం లో వున్న గుడికి తీసుకుని వెళ్ళమంటాను .
దీపాలు పెట్టీ దర్శనం చేసుకుని ఏ పులిహోర , అవీ తిని వస్తాము .
అదే వన భోజనాలు అనుకుంటూ పెద్ద వాళ్ళని తలచుకుని మనకు మంచి అలవాట్లు నేర్పినందుకు నమస్కరిస్తూ
శుభ రాత్రి
Comments