top of page
Search

ప్రయాణం

murthydeviv
2 days ago
2 min read

దీపావళి తర్వాత వరుస పండగలు మన భక్తి

ఈ మధ్య పండగ హడావిడి, భాయ్ దూజ్ అని ఇద్దరు అమ్మాయిలు కలిసి తమ్ముడి కీ మర్యాద లు వారం రోజులు నుండి హడావిడి గా గడిచి పోయింది.


మధ్యలో మా అబ్బాయి పిల్లలు మేజర్లు అయినా నీవు గారాబం తో వాళ్ళని దద్దమ్మలు లాగా చేస్తున్నావు అని చికాకు పడుతూ ఉంటాడు..


సరే నీవు ఏమీ నేర్పుతావో నేర్పు అన్నాను.. వెంటనే వాళ్ళని డ్రైవర్ తో గుంటూరు దగ్గర పొలాలు చూసి రమ్మని పంపుతాను అన్నాడు.


మరీ కారు లో పిల్లలు ని పంప లేక నేను కారు ఎక్కాను ,. ఈ మధ్య నే మా మనవడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు.


లైసెన్స్ వచ్చినా మెంటల్ మెచ్యూరిటీ రాలేదు కదా అని నా ఐడియా. కారు ప్రయాణం హాయిగానే వుంటుంది. అందులో విజయవాడ రోడ్డు తో పాటు ఇటు నల్గొండ తో గుంటూరు రోడ్డు కూడా డెవలప్ అయింది.

రోడ్డు వైడనింగ్ లో రోడ్డు పక్కనే వున్న పొలాలు కొన్ని పోతాయి, అనుకుంటే కొంత బాధ గా వుంటుంది . అటూ ఇటు పచ్చటి పొలాలు, మధ్య మధ్యలో బంతి చేమంతి

అదేదో పాట లో లాగా కను విందు చేస్తూ వున్నాయి..


మధ్య మధ్యలో పత్తి మిరప తోటలు. పత్తి కొంచెం కాయ విచ్చుకుంటే ఆకుపచ్చటి చేల మధ్యలో తెల్లగా మెరుస్తూ వుంటాయి..


ఒకప్పుడు పత్తి ని వైట్ గోల్డ్ అనేవాళ్ళు. మొదట్లో బాగా వేసే వారు కానీ చీడ ఎక్కువగా ఉండటం తో మానేశారు. ఇంక మిరప చేలు అయితే ఎర్రటి కాయలు వచ్చాక ఆ చేలు పచ్చటి చెట్ల మధ్యలో ఎర్రటి కాయలు తో చాలా అందము గా వుంటాయి..


మిరప కూడా వాణిజ్య పంట కదా. డిసెంబర్ జనవరి లో అయితే కోసి పొలాల్లోనే అరపెడతారు చూడటానికి అన్నీ అందం గానే వుంటాయి. రైతులు శ్రమ తల్చుకుంటే బాధ కలుగుతుంది..


పన్నెండు గంటలకు సత్తెనపల్లి కీ పిడుగు రాళ్ళ మధ్యలో వున్న మా ఊరు చేరాము.


పిల్లల్ని పొలాలు అన్నీ చూసి ఏమీ పంటలు వేసారో చూసి తెలుసుకోమని వాళ్లకు ఇంస్ట్రుక్షన్స్ ఇచ్చాడు మా అబ్బాయి. అక్కడ కూడా ఎండ లో తిరగ లేరు అని

నీవు తిరగకు అని నాకు కూడా సింపుల్ ఇష్ట్రక్షన్ వచ్చింది.


నేను ఈ లోపల అక్కడ గుడి లో రాముల వారిని, పార్వతి పరమేశ్వర లను చూసి

మా పొలం చేసే వాళ్ళింటి ముందు స్ప్రైట్ తాగుతూ కూర్చున్నాను.


వాళ్ళు మనకు మంచినీళ్లు ఇవ్వరు. మజ్జిగ, లేదా ఇలాంటి కూల్ డ్రింక్ ఇస్తా రు

అన్నీ పొలాలు చూసి వచ్చాక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఈ సారి వర్షాలు లేక సాగర్ నీళ్లు రాలేదు. అందుకని మాగాణి పొలం ఖాళీ గా వున్నది.


బోర్ వున్న చోట పత్తి మిరప మొక్క జొన్న కంది ఇలాంటి పంటలు వేశారు. అన్నీ పొలాల్లో బోర్లు వేయిస్తే బాగుంటుంది అని మాకే టెండర్ పెట్టాడు.


గవర్నమెంట్ ఎన్ని సాఫ్ట్ వేర్ కంపెనీ లు పెట్టినా పైన వరుణుడు కరుణిస్తేనే ధాన్యం వచ్చేది ఆనుకున్నాను. అబ్బాయి గారికి బోర్లు వేయించమని చెప్పండి అమ్మా అని వాళ్ళ రిక్వెస్ట్ కీ తల ఊపాను.


ఊరు ముందర చేలో లిల్లీ పూల తోట నుంచీ చక్కటి సువాసన తెల్లటి పూలతో కొమ్మలు గాలికి సన్నగా ఊగుతుంటే కృష్ణ శాస్త్రి గారి పాట గుర్తు వచ్చింది.


ఆ పూల కు కూడా తేనె టీగ ల బెడ ద ఉంటుందిట.. పెద్ద కవర్ నిండా పూలు వేసి ఇచ్చారు. వచ్చేటప్పుడు కారు అంతా చక్కటి సువాసన తో నిండి పోయింది.


వచ్చే టప్పుడు రోడ్డు పక్కన కొత్త హోటళ్ళు చాలా వెలసినాయి కానీ ఎక్కడికీ వెళ్లినా

పన్నీర్ మసాలా, పన్నీర్ టిక్కా , గోబీ మంచూరియా అదే మెనూ


ఆంధ్ర నడిబొడ్డులో మిర్చి బజ్జీ, పునుగులు ఉల్లి పకోడీ స్టార్టరు గా పెట్టవచ్చు కదా

అనుకున్నాను.


ఉదయమ్ వచ్చే టప్పుడు కూడా ఒక చోట మద్రాస్ కాఫీ ఇంకొక చోట కుంభ కోణం కాఫీ తాగాను.


మన అరకు లో కూడా కాఫీ పండుతుంది కదా , అరకు కాఫీ ఆంద్రా స్నాక్స్ అని

ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయమని మా అబ్బాయికి వున్న గుజరాతి ఫ్రెండ్ కీ


చెపుదాం అనే ఆలోచన వచ్చింది.


ఆహా మా వారు పుట్టి పెరిగిన ఊర్లో స్ప్రైట్ తాగే టప్పటికి నాకు కూడా

బిజినెస్ ఐడియాలు వచ్చేస్తున్నా యి .



అవీ ఈ వారం కబుర్లు శుభ రాత్రి

 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్ల

 
 
 
నాగుల చవితి

బినాగుల చవితి ఏమిటి? నాగుల షష్ఠి అనవచ్చు కదా !చవితి ఏమిటి? భూమి లోపల నివసించే నాగదేవతలను (సర్పాలను) ఆరాధించే పండుగ నాగుల చవితి. కార్తిక మాస శుక్ల పక్ష చవితి నాడు (కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుక్ల చవి

 
 
 
అల్లుడు మర్యాదలు

పూర్వం రోజుల్లో అల్లుళ్లకు చేసే మర్యాదలు విచిత్రంగా ఉండేవి. అల్లుడు గారు పండగకి వస్తున్నారు ఆంటే ఇంట్లో హడావిడి మొదలు అయ్యేది. అరోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ కదా, ఒకే పండగకి అందరు అల్లుళ్లు రా

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page